Chandamama
-
చందమామపై నీటి జాడలు!
బీజింగ్: చందమామపై నీటి ఆనవాళ్లు ఉన్నాయా? అంటే నిజమేనని చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు. జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరీక్షించగా, జలం జాడ కనిపించిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్) వెల్లడించింది. చైనా 2020లో ప్రయోగించిన చాంగే–5 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకొచ్చింది. దాదాపు 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను భూమిపైకి చేర్చింది. వీటిపై చైనా సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నమూనాల్లో భారీ స్థాయిలో నీటి అణువులు ఉన్నట్లు గుర్తించారు. 2009లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్–1 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది. -
బుల్లితెర నటి అంజలి కూతురు చందమామ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగనున్న విక్రమ్ ల్యాండర్
చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. కోటిపూలు తేవే.. అని పాడుతూ.. ఆకాశంలోని చందమామను చూపిస్తూ.. ప్రతి అమ్మా తన బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తుంది. జాబిలితో చెప్పనా.. అంటూ ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఉద్దేశిస్తూ డ్యూయెట్ పాడతాడు.. మామా.. చందమామా.. వినరావా నా కథ.. అంటూ ఒంటరిగా తన గుండెను చందమామ ముందు ఆవిష్కరిస్తూంటాడు ఓ భావుకుడు.. (డెస్క్–రాజమహేంద్రవరం): ఎవరెన్ని విధాలుగా చెప్పినా అందరికీ చందమామ ప్రియమైనదే. జాబిల్లిని చూడగానే గుండె నిండా తెలియని ఆనందం, అనుభూతి కలుగుతాయి. ఆకాశంలో ఉంటూ.. వెన్నెల కురిపిస్తూ.. అందరి మనసుల్లో అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఈ చందమామ ఎవరు.. ఏమా కథ.. అక్కడెవరున్నారు.. గ్రహాంతవాసులున్నారా.. అక్కడ కూడా ఆకాశం ఉంటుందా.. గాలి.. నీరు ఉంటాయా.. ఉంటే మనం ఇల్లు కట్టుకోవచ్చా.. ఇలాంటి ఎన్నో సందేహాలు చాలా మందిని వెంటాడుతున్నాయి. సామాన్యులనే కాదు మన ఇస్రో శాస్త్రవేత్తల మదిని కూడా ఇలాంటి ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. అందుకే చందమామ విశేషాల గుట్టును విప్పేందుకు వారందరూ అహరహం శ్రమించారు. దాని ఫలితమే చంద్రయాన్–3. అన్నీ సజావుగా సాగితే బుధవారం సాయంత్రం ఈ వ్యోమనౌక ఓ ఖగోళ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. అంతరిక్ష రంగంలో మన దేశాన్ని ముందు వరుసలో నిలపనుంది. ఆ క్షణాల కోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజానీకం ఒళ్లంతా కళ్లు చేసుకుని కోటి ఆశలతో ఎదురు చూస్తోంది. చంద్రుడి విశేషాలు ► మన కాలమానం ప్రకారం చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 29.5 రోజులు పడుతుంది. చంద్రుడిపై ఒక్క రోజు భూమిపై దాదాపు ఒక నెలకు సమానం. ► చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టి రావడానికి 27.3 రోజులు పడుతుంది. భూమి – చంద్రుడు – సూర్యుడి మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే చాంద్రమాసం అంటారు. ► చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ తిరగడానికీ ఒకే సమయం పడుతుంది. దీనివల్ల భూమిపై ఉన్న వారికి చంద్రుడి ఒకే ముఖం కనబడుతుంది. చంద్రుడి ఆవలి వైపు ఎప్పటికీ కనబడదు. దీనిని టైడల్ లాకింగ్ అంటారు. ► చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాదముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ► చంద్రుడి సాంద్రత భూమి సాంద్రతలో 1/6వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు. ► చంద్రుడి గరిష్ట ఉష్ణోగ్రత 127 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత –173 డిగ్రీల సెల్సియస్. ► 1959 సెప్టెంబర్ 14న రష్యా పంపిన లూనా – 2 చంద్రుడి మీదకు మొట్టమొదట దిగింది. ► ఇప్పటి దాకా వ్యోమగాములు 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారు. అందరూ ఆసక్తిగా.. చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపాలనే మన దేశం కలలు నెరవేరే క్షణాలు సమీపిస్తున్నాయి. చంద్రుని విశేషాలను ఆవిష్కరించే అరుదైన ఘట్టం చేరువవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత నెల 14న శ్రీహరికోటలో చేపట్టిన చంద్రయాన్–3 రాకెట్ ప్రయోగంలో రెండు దశలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. మూడో దశలో భాగంగా చంద్రయాన్–3 లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా ల్యాండ్ అయ్యే ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు జిల్లా యావత్తూ ఉత్కంఠతో నిరీక్షిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు చంద్రుడిపై రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినా దక్షిణ ధ్రువానికి చేరుకోలేదు. రష్యాకు చెందిన లూనార్–25ను ప్రయోగించినా చివరి దశలో విఫలమైంది. అన్నీ అనుకూలిస్తే నేటి సాయంత్రం 6.04 గంటలకు చందమామపై విక్రమ్ ల్యాండర్ దిగనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇదే కనుక జరిగితే ప్రపంచంలోనే దక్షిణ ధ్రువానికి చేరిన తొలి దేశంగా భారత్ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోనుంది. -
Happy Childrens Day 2021: చందమామ.. నా ఆత్మ కథ!!
మీకు నేను ప్రతి రాత్రీ ఒకేవేళకు కనిపించను, అప్పుడప్పుడు అసలే రాను, అందువల్ల నేను మంచివాడిని కాదని అనుకునేరు.. తల్లిదండ్రులంటే నాకూ భయభక్తులున్నాయి. చదువు సంధ్యలేకుండా నేను అల్లరిచిల్లరగా తిరగటం లేదు. నిజంగా నా కథ తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతున్నదో మీకే తెలుస్తుంది. నా మీద మీకు అంత అపనమ్మకమూ ఉండదు. నాకు ప్రతిరోజూ వచ్చి మీతో ఆడుకోవాలనే ఉంటుంది. కానీ ఏమి చెయ్యను? చాలా ఏళ్ల కిందట, లక్షలు, కోట్ల సంవత్సరాల కిందట, అప్పటికి మనుషులు ఇంకా పుట్టలేదు, జంతువులు పుట్టలేదు. చెట్లు పుట్టలేదు. నీళ్లు కూడా లేవు. అప్పుడు మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మను మీరెరుగరూ? మీరుంటున్నది మా అమ్మ ఒళ్లోనేగా. భూదేవి మా అమ్మ. మా అమ్మ సూర్యుని కూతురు. మా అమ్మ చిన్నప్పుడు మా తాత సూర్యుడిలానే ఉండేదట. నేను కూడా ఎరుగుదునుగా నా చిన్నతనంలో మా అమ్మ ఎలా ఉండేదని. నా కళ్లు కూడా సరిగా చూడనిచ్చేవికావు. మా అమ్మ పుట్టినప్పటి నుంచి మా తాత చుట్టూ గిరగిరా బొంగరంలా తిరుగుతూ ఆడుకొంటూ ఉండేది. అదే మా అమ్మకు ఆచారమైపోయింది. ఇలా ఉండగా నేను పుట్టాను. పుట్టి, కాళ్లు వచ్చిన తర్వాత ఒక చోట ఎలా కూర్చుంటాం? కాళ్లు, చేతులు ఊరుకోనిస్తాయా? నేనూ మా అమ్మ కొంగు వదలిపెట్టకుండా ఆమె చుట్టూ అల్లాబిల్లీ తిరిగేవాడ్ని. చుక్కలు ఎంతో ప్రేమతో పిలిచేవి కానీ నేను మా అమ్మను వదిలిపెట్టేవాడ్ని కాను. ఆ రోజుల్లో నేను మా తాత సూర్యుడిలాగా ఉండేవాడ్ని. అందుకని అందరూ నన్ను ఎత్తి ముద్దులాడ పిలిచేవాళ్లు. మా అమ్మకు నన్ను చూస్తే ఎంతో సంతోషం. నా ఆటపాటలకు మురిసి చక్కని అద్దం ఇచ్చింది. మీకు అద్దం ఇస్తే ఏం చేస్తారు? ముఖం చూసుకోరా? నేనూ ఆ పొరపాటే చేశాను. అద్దంలో చూసుకునే కొద్ది నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించసాగింది. అలా చూసుకుంటూ ఉంటే ఇక ప్రపంచంలో మరొటి అందమైనది ఉన్నట్లే కనిపించేది కాదు. అందువల్ల ఎప్పడూ అదేపనిగా నన్ను నేను అద్దంలో చూసుకునేవాడ్ని. మా అమ్మ చివాట్లు పెడుతూ ఉండేది. నేను వింటేగా? ఇలా చేయగా చేయగా కొన్నాళ్లకు నా కాంతి అంతా పోయింది. ముఖం మాడిన అట్ల పెనంలాగా అయిపోయింది. నాకు పుట్టెడు ఏడుపు వచ్చింది. చుట్టూ చూశాను. చుక్కలు మిలామిలా మెరుస్తున్నాయి. ఎదురుగా చూశాను.. మా అమ్మ జ్యోతిలాగా వెలిగిపోతుంది. మా అమ్మకు పక్కగా చూశాను. మా తాత ఎలా ఉన్నాడని? చూడటానికి కళ్లు చాలకుండా ఉన్నాయి. మళ్లీ నన్ను నేను చూచుకున్నాను. నా ఒళ్లు నాకే కనిపించలేదు. నాకు పట్టరాని ఏడుపు వచ్చింది. పోయినకాంతి ఎలా తిరిగి సంపాదించటం అని ఆలోచించాను. ఏమీ పాలుపోలేదు. దిగాలుపడి కూర్చున్నాను. అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిలలాడింది. చప్పున ఒక ఉపాయం తోచింది. అక్కడ నుంచి ఒక గంతులో పోయి చుక్కమ్మ ఇంటి తలుపు తట్టాను. ఆమె తలుపు తీయకుండానే ‘ఎవరది.. ఎందుకొచ్చావ్?’ అని కిటికీలోనుంచే గద్దించింది. ‘నేనే చుక్కమ్మా.. చందమామను.. కాస్త వెలుగుపెట్టవూ?’ అన్నాను. ‘ఫో..ఫో.. ఇప్పుడు కావలసివచ్చానేం నేను? నల్లటి అట్ల పెనం మొహం నువ్వూ?’ అని కసిరింది. మీ అక్కయ్య బొమ్మ ఇవ్వక కసిరితే ఎలా ఉంటుంది? నా పనీ అంతే అయ్యింది. కాళ్లీడ్చుకుంటూ ఇంకొక చుక్కమ్మ ఇంటికి వెళ్లాను. ‘ఇక్కడ మాకే లేకపోతే నీ మొహానికెక్కడ ఇవ్వమంటావ్ వెలుగు?’ అని మూలిగింది ఆమె. తతిమ్మా చుక్కమ్మలూ ఇలాగే అన్నాయి. ఇక ఏమిచేసేది? బావురుమని ఏడ్చాను. అప్పుడే మా తాత సూర్యుడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే ఒక్క గంతులో మా తాతయ్య ఇంటిముందు వచ్చిపడ్డాను. కానీ లోపలికి వెళ్లడం ఎట్లా? తలుపు తీద్దామంటే చేతులు కాలిపోవూ? అంతగా మా తాతయ్య ఇల్లు వెలిగిపోతున్నది. నేను ఏడుస్తూ అక్కడే నుంచున్నాను. అంతలో మా తాతయ్య ఏడుగుర్రాల బండిలో వస్తూ నన్ను చూశాడు. ‘నాయనా ఎందుకు ఏడుస్తున్నావ్? నాకు చెప్పవూ? నీకేమి తక్కువ?’ అన్నాడు. ‘తాతయ్యా.. నాలోని మంటలన్నీ ఆరిపోయాయి. వెలుతురంతా పోయింది. నాకన్నా చుక్కలే బాగున్నాయి. ఈ మాడు ముఖంతో మీ అందరి మధ్య నేను ఎలా ఉండాలి? తాతయ్యా తాతయ్యా నాకు కాస్త వెలుగివ్వవూ?’ అని జాలిగా అడిగాను. తాతయ్య ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా అన్నాడు. ‘నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావురా.. మీ అమ్మ ఇచ్చిన అద్దం సరిగా వాడుకోలేక చెడిపోయావు. ఆ అద్దం పెట్టి చూస్తే ఎన్ని రంగులు కనిపించేవి? ఎంత ప్రపంచం కనిపించేది? ఎన్ని విచిత్రాలు కనిపించేవి? సరే జరిగిందేదో జరిగింది. ఇక మీదనన్నా నేను చెప్పినట్టుచెయ్యి. నీ అద్దం ఉంది చూశావా.. దాన్ని ఎప్పుడూ నా కాంతి పడుతూ ఉండేటట్టుగా పట్టుకో.. ఆ అద్దం మీద వెలుతురు నీ ముఖానికి తిప్పుకో.. అప్పుడు నీ ముఖం తెల్లగా ఉంటుంది’ అన్నాడు. అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనుకున్నారు? నాటి నుంచి మా తాతయ్య చెప్పినట్లే చేస్తున్నాను. ఆయన వెలుగును నా అద్దంలో పట్టి నావైపుకు తిప్పుకుంటూ ఉన్నాను. నా ముఖం మళ్లీ ప్రకాశించడం మొదలుపెట్టింది. అయితే అప్పుడప్పుడు మా అమ్మ నా అద్దానికి మా తాతయ్యకు అడ్డం వస్తుంది. అందువల్ల మీకు సరిగా వేళకు కనిపించలేకపోతున్నాను. అంతే కానీ మరేమీ లేదు. - చందమామ (1947, జులై సంచిక నుంచి) చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
లవ్ యూ చందమామ
వెన్నెల రోజున భూమి ఎలా ఉంటుంది? వెన్నెల కురిసే ఆ రోజున కాస్తంత ఎత్తు మీద నుంచో, వీలైతే ఏ కొండపై నుంచో చూడండి. ఎలా కనిపిస్తుంటుంది భూమి?వెన్నెల టాల్కమ్ పౌడర్‌ను దూమెరుగ్గా రాసుకుని, ఫ్రెష్‌గా ఉన్నట్టుంటుంది భూమి.రాత్రి చీకటిలో డార్క్ కాంప్లెక్షన్ చాయతక్కువగ ఉన్నట్టుండే ధరణి... ఫెయిర్‌నెస్ క్రీము రాసుకుని ఫెయిర్‌గా కనిపిస్తున్నట్టుంటుంది. ఆ నిగారింపుల మిలమిలలతో, వెన్నెల సింగారింపుల కళకళలతో మెరిసిపోతుంటుంది. చందమామ అనగానే అందరికీ భావావేశమే. కోటిపూలతో కొండెక్కీ, బంతిపూలతో బండెక్కీ, పల్లకీలో పాలుపెరుగులతో, పరుగుపరుగున పనసపండుతో, అలయకుండా అరటిపండుతో రావాలనీ... అన్నింటినీ తెచ్చి తమ చిన్నారికి ఇవ్వాల్సిందే అని అన్నమయ్య డిమాండ్ చేశాడు. ఇక శ్రీరాముడు మాత్రం తక్కువా? చందమామ అందితేగానీ అన్నం తిననని మారాం చేశాడు. అద్దం చేతనుంచుకొని, దాంట్లో చూసి, అద్దం ఫ్రేమ్‌లో బిగించాడు కాబట్టే రామ‘చంద్ర’మూర్తి అయ్యాడేమో. ఇంతటి చందమామ గురించి ఎన్నెన్నో విశేషాలు. అందులో కొన్నింటిని తెలుసుకుందాం.గ్రహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. ఆ శక్తి కారణంగానే అవి పరిభ్రమిస్తూ ఒకదానితో ఒకటి ఢీకొనకుండా తిరుగుతూ ఉంటాయి. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగానే సముద్రజలాలు ఆకర్షితమై ఆటుపోట్లు వస్తుంటాయని తెలుసు. మరి భూభాగం సంగతో?... అక్కడా ఆ శక్తి పనిచేస్తుంటుంది. జలాలు ద్రవరూపంలో ఉంటాయి కాబట్టి ఆటుపోట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ... నీటిమట్టం పెరగడం తగ్గడం జరుగుతుంది. అలాగే మన కాళ్ల కింది భూభాగమూ కాస్తంత ఉబుకుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ భూమ్మీద ఉన్న సమస్త కొండగుట్టలూ, భవనాలూ, నిర్మాణాలూ ఒకింత పైకి లేస్తాయి. మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. కాకపోతే దాన్ని మనం గమనించలేం అంతే. చంద్రుడు సరిగ్గా భూమి చుట్టే తిరుగుతున్నాడా? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడని మనం చిన్నప్పట్నుంచీ చదువుకున్నాం. అది నిజమే అయినా పూర్తిగా వాస్తవం కాదు. భూమీ, చంద్రుడూ పరస్పరం ఆకర్షించుకుంటూ ఉంటాయి కాబట్టి చంద్రుడు తిరిగే కేంద్రం భూమి కేంద్రస్థానానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఆ ఊహాకేంద్రకాన్ని మనం ‘బ్యారీసెంటర్’ అని పిలుస్తాం. ఈ బ్యారీసెంటర్ అన్నది భూమి పైపొర అయిన క్రస్ట్‌లో ఉంటుంది. అక్కడా కావాల్సినంత చెత్త! మనిషి అంటేనే చెత్త పుట్టించేవాడు. తానెంత మంచి పిక్నిక్ స్పాట్‌కు వెళ్లినా తాగేసిన నీళ్లబాటిళ్లు, ఇతరత్రా చెత్తనక్కడ పడేస్తూ ఉంటాడు. చంద్రుడూ ఇందుకు మినహాయింపు కాడు. మీకు తెలుసా? ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకూ మానవుడు వెళ్లినప్పుడు వదిలేసినవీ, మనం పంపించిన ఉపగ్రహాల వల్ల వెలువడినవీ... ఇవన్నీ కలిసి దాదాపు లక్షా ఎనభై రెండు వేల కిలోల (కచ్చితంగా చెప్పాలంటే 1,81,437 కిలోల) చెత్త చంద్రుడి ఉపరితలం మీద చేరిందట. అదో మరుస్థలి కూడా... అంతేకాదు... అక్కడ ఓ శ్మశానం కాని శ్మశానమూ ఉంది. ఆ కథాకమామిషూ చూద్దాం. యూజీన్ షూమాకర్ అనే ఓ అద్భుతమైన ఖగోళ పరిశోధకుడూ, జియాలజిస్టూ చాలా కీలకమైన పరిశోధనలు చేశాడు. చంద్రుడి మీదకు వెళ్లాలన్నది అతడి తీరని కోరిక. కానీ అతడిలోని చిన్న శారీరక లోపం చంద్రుడిమీదకు వెళ్లడానికి అవరోధంగా మారింది. తన ప్రగాఢ వాంఛ అందని చందమామఅయ్యింది. ఖగోళరంగంలో అతడి కీలక పరిశోధనలకు ఓ నివాళిగా అతడి చివరి కోర్కెను మరోలా తీర్చారు శాస్త్రవేత్తలు. అతడు చనిపోయాక అతడి చితభస్మాన్ని లూనార్ ప్రాస్పెక్టర్ ద్వారా1998లో చంద్రుడి మీదకి తీసుకెళ్లి అక్కడి చంద్రధూళిలో ఖననమయ్యేలా చూశారు. అలా అతడి చివరి కోర్కెను తీర్చారు నాసా వారు. అంతేనా... చంద్రుడి మీద తమ చితాభస్మం పడాలన్నది చిరకాలంగా చాలా మంది మన భూలోక వాసుల కోరిక కూడా. అందుకే దాదాపు క్రీస్తుపూర్వం 450 నాటి నుంచే కొందరి కోరిక మేరకు వారి చితాభస్మాన్ని ఎల్తైన ప్రదేశం నుంచి ఆకాశంలోకి విసిరేసేవారు. అది చంద్రుడి మీదికి చేరి అక్కడ ధూళిలో కలిసిపోతుందని వాళ్ల ఆశ. అయితే ఇలాంటి కోరికలెవరికైనా ఉంటే అవి భవిష్యత్తులో తీరే అవకాశాలున్నాయి. ‘లూనార్ మెమోరియల్ సర్వీస్’ పేరిట ‘ఎసైలమ్ స్పేస్’ వంటి కొన్ని కంపెనీలు చంద్రుడి మీద వారి చితాభస్మాలనూ, అవశేషాలను ఖననం చేసే పనికి పూనుకుంటున్నాయి. 2013 నెలకొల్పిన ఎసైలస్ స్పేస్ సంస్థ ఇస్తున్న భరోసా ప్రకారం... కేవలం చంద్రుడి మీదే కాకుండా... సౌరకుటుంబానికి ఆవలనున్న సుదూర అంతరిక్ష స్థలాల్లోనూ ఆ చితాభస్మాన్ని వదులుతామంటూ ఆ కంపెనీ వాగ్దానాలు చేస్తోంది. అయితే ఈ దిశగా వారి మొదటిమజిలీ శ్మశానస్థలి మాత్రం జాబిల్లేనట. చంద్రకంపాలూ ఉంటాయి భూమ్మీద భూకంపాలు వస్తాయన్నది మనకు తెలిసిందే కదా. అలాగే చంద్రుడిమీద కూడా అలాంటివే సంభవిస్తాయి. మనం భూకంపం అన్నట్టుగానే దాన్ని చంద్రకంపం అనవచ్చు. ఇంగ్లిషులో ‘మూన్‌క్వేక్’ అన్నమాట. ఇందులోనూ మళ్లీ నాలుగు రకాలుంటాయి. చాలా లోతుగా వచ్చే డీప్ క్వేక్స్, ఏవైనా ఉల్కలు చంద్రతలం మీద పడటం వల్ల వచ్చే కంపనాలైన మీటియోరైట్ ఇంపాక్ట్స్, సూర్యుడి ఉష్ణోగ్రత ప్రభావం వచ్చే థర్మల్ క్వేక్స్... ఈ మూడూ ఒకింత తక్కువ శక్తిమంతమైనవి. కానీ రిక్టర్ స్కేలు మీద 5.5 వరకు వచ్చే ‘షాలో మూన్ క్వేక్’ లనేవి మాత్రం చాలా భయంకరమైవి. మన భూమ్మీద భూకంపం వస్తే అది సెకన్లపాటు, మహా అయితే కొన్ని అరనిమిషం ఉంటుంది. కానీ చంద్రకంపం దాదాపుగా అరగంట పాటూ రావచ్చు. నాసా పరిశీలన ప్రకారం.. ఒక గంట మోగుతున్నప్పుడు ఆ లోహంపై కలిగే ప్రకంపనల్లాగే చంద్రకంపం సమయంలో చంద్రుడి ఉపరితలం అలా ప్రకంపనాలకు లోనవుతుంటుంది. నాసా భాషలో చెప్పాలంటే ‘ద మూన్ రింగ్స్ లైక్ ఎ బెల్’! ఇప్పట్లో పిక్నిక్ స్పాట్ కాబోదు చంద్రుడి మీదకెళ్లడం మన ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. అక్కడి చంద్రధూళి మానవుల ఆరోగ్యానికెంతో ప్రమాదం. మనం స్పేస్ సూట్ తొడుక్కుని పోయినప్పటికీ ఆ ధూళి ఎలాగోలా మన బట్టల్లోకి చేరిపోతుంది. ఈ ధూళి కారణంగా మనకు ‘లూనార్ హే ఫీవర్’ అనే వైద్య సమస్య రావచ్చట. దీన్నే ‘మూన్ డస్ట్ ఫీవర్’ అని కూడా అంటారట. అందరి చంద్రుడు అందని చంద్రుడవుతున్నాడా? మనందరికీ ప్రియాతి ప్రియమైన చందమామ రోజురోజుకూ మనకు దూరమవుతున్నాడా? ఒకనాటికి మనకు అందకుండా పోతాడా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతి ఏడాది చంద్రుడు మననుంచి 3.78 సెం.మీ. దూరంగా జరుగుతున్నాడట. ఇప్పటికైతే జాబిల్లి దూరమవుతున్నందువల్ల మనకా ప్రభావం గణనీయంగా కనిపించకపోవచ్చు. కానీ ఒకనాటికి బాగా దూరం వెళ్లిపోతే మన భూగోళం తిరిగే వేగం (భూభ్రమణ వేగం) కూడా తగ్గిపోతుందట. అయితే ఆ ప్రమాదం మాత్రం ఇప్పట్లో లేదంటున్నారు శాస్త్రవేత్తలు. మీరు చందమామ అనండి. జాబిల్లి అనండి. ఇంగ్లిష్‌లో మూన్ అనండి. లూనా అనండి. కానీ చందమామ కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు. మన ఎన్నో ఎమోషనల్ అంశాలకు ఒక కేంద్రస్థానం. సౌరకుటుంబంలో మన భూమితో పాటు పుట్టిన మన ఉపగ్రహం. భూమిని మనం భూమాత అంటాం. అంటే మన తల్లిలాంటిదే మన భూగ్రహం. మరి దాని తోబుట్టువు మనకు మేనమామే కదా. అందుకే చంద్రుణ్ని మనం చందమామ అంటాం. తల్లి పుట్టిలు మనం మేనమామకు చెబితే ఎలా ఉంటుంది. అందుకే మన తల్లి అయిన భూమాత పుట్టుకకు సంబంధించిన ఎంతో సమాచారం తెలుసుకోవాలన్నా చంద్రుడికి తెలుసేమో. దాని గురించి ఆయన్నే అడగాలేమో! అలా అడగగా వెల్లడయ్యే ఎన్నో అంశాలు తెలిసిరావచ్చు. మరెన్నో రహస్యాలు విడివడవచ్చు. మన చంద్రుడికి సంబంధించిన చిత్రవిచిత్రాల్లో ఇవి కొన్ని మాత్రమే. తెలుసుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే అప్పటి విక్రమార్కుడు చెట్టెక్కి శవాన్ని దించినట్టుగా మన ఈ పరిశోధనా విక్రముడు... చంద్రుడి ఎత్తులు విక్రమార్కుడిలా ఎక్కుతూనే ఉంటాడు. తెలియని చిక్కు ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉంటాడు.– యాసీన్ -
శాస్త్రోక్తంగా చందనం అరగదీత
సింహాచలం, న్యూస్‌లైన్ : వరా హ లక్ష్మీనృసింహస్వామి ఆల యంలో శుక్రవారం తొలి విడత చందనం అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైం ది. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఉదయం 6.30 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. వచ్చే నెల 2న చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామికి తొలి విడతగా మూడు మణుగుల(125 కిలోలు) చందనాన్ని సమర్పిస్తారు. అందులోభాగంగా తొలుత బేడా మండపంలో తొలి చందనం చెక్కను ఉంచి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు చం దనం చెక్కను శిరస్సుపై పెట్టుకుని బేడా ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో మూలవిరాట్ సన్నిధిలో చందనం చెక్కను ఉంచి అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. నోటికి గంతలు కట్టుకుని శ్రీనివాసాచార్యులు తొలిచందనాన్ని శాస్త్రోక్తంగా అరగదీశారు. అనంతరం సిబ్బంది చందనం అరగదీతను ప్రారంభించారు. ఆలయ ప్రధాన పురోహితుడు మోర్తా సీతారామాచార్యుల ఆధ్వర్యంలో అర్చకుడు సీతారాం, గిరి, రవి, వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చందనం అరగదీసే సిబ్బందికి ఈవో కె.రామచంద్రమోహన్ నూతన వస్త్రాలు అందజేశారు. ఐదు రోజులపాటు ఈ అరగదీత కార్యక్రమం జరగనుంది. చందనోత్సవానికి ప్రత్యేక ప్రణాళిక శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిం చినట్టు సింహాచల దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. వచ్చే నెల 2న సింహగిరిపై జరిగే చందనోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష మందికి పైగా భక్తులు స్వామి నిజ రూప దర్శనానికి వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. 17 వేల మంది భక్తులు స్వామి దర్శనానికి వేచి ఉండేలా ఉచిత దర్శనం, రూ.200, రూ.500 రూపాయల టికెట్ల లైన్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి స్వామి నిజరూప దర్శనాన్ని భక్తులకు అందజేస్తామన్నారు. భక్తులు తమ వాహనాల ను గోశాల కూడలి, అడవివరం కూడలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువాలు, జెం డాలతో రాకూడదని చెప్పారు. సమావేశంలో ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, ఈఈ శ్రీనివాసరాజు, డీఈ మల్లేశ్వరరా వు, ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్, సూపరింటెం డెంట్ తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు. -
నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం?
చందమామ, వైశాలి చిత్రాల్లో నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న దక్షిణాది నటి సింధు మీనన్ గత రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు సమాచారం. అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రభును పెళ్లాడి బెంగుళూరులో స్థిరపడిన సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం వార్త మీడియాలో సంచలనం రేపింది. సింధు మీనన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు వార్తలు అందుతున్నాయి. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేర్పించే సమయానికి ఆమె అపస్మారక స్థితిలో ఉంది అని వార్తలు వెలువడ్డాయి. తమిళంలో కాదల్ పుక్కల్, యూత్, ఈరమ్ చిత్రాల్లో సింధు మీనన్ నటించింది.