శాస్త్రోక్తంగా చందనం అరగదీత
సింహాచలం, న్యూస్‌లైన్ : వరా హ లక్ష్మీనృసింహస్వామి ఆల యంలో శుక్రవారం తొలి విడత చందనం అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైం ది. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఉదయం 6.30 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. వచ్చే నెల 2న చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామికి తొలి విడతగా మూడు మణుగుల(125 కిలోలు) చందనాన్ని సమర్పిస్తారు. అందులోభాగంగా తొలుత బేడా మండపంలో తొలి చందనం చెక్కను ఉంచి పూజలు నిర్వహించారు.
ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు చం దనం చెక్కను శిరస్సుపై పెట్టుకుని బేడా ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో మూలవిరాట్ సన్నిధిలో చందనం చెక్కను ఉంచి అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. నోటికి గంతలు కట్టుకుని శ్రీనివాసాచార్యులు తొలిచందనాన్ని శాస్త్రోక్తంగా అరగదీశారు. అనంతరం సిబ్బంది చందనం అరగదీతను ప్రారంభించారు. ఆలయ ప్రధాన పురోహితుడు మోర్తా సీతారామాచార్యుల ఆధ్వర్యంలో అర్చకుడు సీతారాం, గిరి, రవి, వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చందనం అరగదీసే సిబ్బందికి ఈవో కె.రామచంద్రమోహన్ నూతన వస్త్రాలు అందజేశారు. ఐదు రోజులపాటు ఈ అరగదీత కార్యక్రమం జరగనుంది.
చందనోత్సవానికి ప్రత్యేక ప్రణాళిక
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిం చినట్టు సింహాచల దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. వచ్చే నెల 2న సింహగిరిపై జరిగే చందనోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష మందికి పైగా భక్తులు స్వామి నిజ రూప దర్శనానికి వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. 17 వేల మంది భక్తులు స్వామి దర్శనానికి వేచి ఉండేలా ఉచిత దర్శనం, రూ.200, రూ.500 రూపాయల టికెట్ల లైన్లు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి స్వామి నిజరూప దర్శనాన్ని భక్తులకు అందజేస్తామన్నారు. భక్తులు తమ వాహనాల ను గోశాల కూడలి, అడవివరం కూడలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువాలు, జెం డాలతో రాకూడదని చెప్పారు. సమావేశంలో ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, ఈఈ శ్రీనివాసరాజు, డీఈ మల్లేశ్వరరా వు, ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్, సూపరింటెం డెంట్ తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు.