ఆత్మహత్యాయత్నం వార్తను ఖండించిన సింధు మీనన్!
ఆత్మహత్యాయత్నం చేశానంటూ మీడియాలో వచ్చిన రూమర్లను దక్షిణాది నటి సింధూ మీనన్ ఖండించింది. అప్పుల బారి పడిన సింధూమీనన్ ఆత్మహత్యకు ప్రయత్నించారని.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారని మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.
తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని సింధు మీనన్ వెల్లడించారు. ఆత్మహత్యకు సంబంధించిన వార్తలన్ని పుకార్లేనని సింధు మీనన్ తెలిపింది. తెలుగులో చందమామ, భద్రాచలం, సిద్ధం చిత్రాల్లో.. తమిళంలో కాదల్ పుక్కల్, యూత్, ఈరమ్ చిత్రాల్లో సింధు మీనన్ నటించింది.