ఈ టాప్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? తెలుగులో అదే చివరి చిత్రం! | Guess This Actress Who Acted With Srihari, Siva Balaji | Sakshi
Sakshi News home page

తెలుగులో ఆ సినిమాతో ఫుల్‌ క్రేజ్‌.. వివాదాలతో వార్తల్లో.. ఎవరో గుర్తుపట్టారా?

Published Fri, Mar 29 2024 2:06 PM | Last Updated on Fri, Mar 29 2024 3:23 PM

Guess This Actress Who Acted with Srihari, Siva Balaji - Sakshi

హీరోల కెరీర్‌కు పెళ్లనేది అడ్డంకే కాదు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. కొందరు పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తే మరికొందరు కాస్య గ్యాప్‌ ఇచ్చి రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెడతారు. పైన కనిపిస్తున్న హీరోయిన్‌ మాత్రం సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఇంతకీ ఆవిడెవరో గుర్తుపట్టారా? ఆమె సింధు మీనన్‌. కన్నడలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

బోలెడు సినిమాలు
భద్రాచలం సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. త్రినేత్రం, శ్రీరామచంద్రులు, ఆడంతే అదో టైప్‌, ఇన్‌స్పెక్టర్‌, వైశాలి ఇలా పలు చిత్రాల్లో నటించింది. తనకు విపరీతమైన క్రేజ్‌ తెచ్చిపెట్టిన మూవీ మాత్రం చందమామ. ఈ సినిమాలో తన అల్లరి, అందానికి జనాలు ఫిదా అయిపోయారు. ఈ సినిమా బాగానే వర్కవుట్‌ అయినా టాలీవుడ్‌లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే సినిమాలు చేసుకుంటూ పోయింది. 2009లో వచ్చిన సిద్ధం తర్వాత తెలుగులో మరే మూవీలోనూ కనిపించలేదు. ఈ బెంగళూరు బ్యూటీ 2010లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రభును పెళ్లాడింది. వీరికి ఇద్దరు కుమారులతోపాటు ఓ కూతురు సంతానం. పెళ్లి తర్వాత ఒకే ఒక్క సినిమాలో కనిపించి వెండితెరకు దూరమైపోయింది.

వార్తల్లో..
గతంలో తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిందీ నటి. బ్యాంకుకు నకిలీ పత్రాలు సమర్పించి రూ.36 లక్షల రుణం తీసుకోవడమే కాకుండా దాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో సింధుపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఆ మధ్య అప్పుల బాధతో నటి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు రాగా అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసింది.

చదవండి: ఇది కలకాలం ఉండాలంటూ తాప్సీ పోస్ట్‌.. పెళ్లి గురించేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement