రాంగోపాల్‌పేట్ : విదేశీ కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలపై నలుగురు బాధితులు రెండు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పాతబస్తీ సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు అదే ప్రాంతానికి చెందిన కిరాణా షాపు యజమానిని పరిచయం చేసుకుని తమ వద్ద సౌదీ కరెన్సీ ఉందని దానిని మార్చుకుంటే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పి ఓ నోటు ఇచ్చారు. సదరు వ్యక్తి ఈ నోటు మార్చుకోగా రూ.2వేలు వచ్చాయి.
ఈ విషయాన్ని చికెన్ షాప్‌లో పనిచేసే తన స్నేహితుడైన అజీజ్‌కు చెప్పడంతో అతను తన యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అతను ఈ నెల 13న అజీజ్‌కు రూ.2లక్షలు ఇచ్చి మార్చుకుని రమ్మని చెప్పాడు. దీంతో అజీజ్ ఆర్పీరోడ్‌కు వెళ్లి ముఠా సభ్యులకు రూ.2 లక్షలు ఇవ్వడంతో వారు ఒక ప్యాకెట్‌ను అజీజ్‌కు అందజేశారు. ఆ తర్వాత అతను షాప్‌నకు వచ్చి చూడగా అందులో సబ్బు బిళ్లలు కనిపించడంతో మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో మరో ముగ్గురిని మోసం చేయడంతో బాధితులు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేట్టారు.
Comments
Please login to add a commentAdd a comment