చందనా బ్రదర్స్ చైర్మన్ అరెస్టు | Chandana Brothers chairman Ramarao Arrested In Cheating Case | Sakshi
Sakshi News home page

చందనా బ్రదర్స్ చైర్మన్ అరెస్టు

Published Wed, Nov 23 2016 3:08 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

చందనా బ్రదర్స్ చైర్మన్ అరెస్టు

చందనా బ్రదర్స్ చైర్మన్ అరెస్టు

హైదరాబాద్: చందనాబ్రదర్స్ చైర్మన్ రామారావు ఓ చీటింగ్ కేసులో అరెస్టు అయ్యారు. బుధవారం ఎస్సార్ నగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కాసుల కక్కుర్తితో తనకు తానే బెదిరింపు లేఖ రాసుకొని తాను తీసుకున్న గోతిలో ఆయనే పడ్డాడు. వివరాలు.. గ్యాంగ్‌స్టర్ నయీం పేరుతో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తనయుడు కన్నా ఫణీంద్ర తనను బెదిరిస్తున్నాడని.. చందన బ్రదర్స్ చైర్మన్ రామారావు గతంలో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేయగా విస్మయకర విషయాలు బయటపడ్డాయి. మంత్రి కుమారుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి తనకు తానే బెదిరింపు లేఖ రాసుకొని రామారావు నాటకాలు ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పక్కా ఆధారాలతో ఆయన మీద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement