chandana brothers
-
షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)
-
సందడి చేసిన అనుపమ
శతమానం భవతి..ప్రేమమ్.. రాక్షసుడు తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన అందాల నటి అనుపమ ఆదివారం నంద్యాలలో సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటి అనుపమను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. సాక్షి, నంద్యాల(కర్నూలు): పట్టణంలోని శ్రీనివాస నగర్– సంజీవగేట్ మధ్యలో ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ 65వ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన యువకులను అనుపమ తన హావభావాలతో ఉత్సాహపరిచారు. అనంతరం ఆమెతోపాటు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. చందన బ్రదర్స్ షోరూం ప్రారంభం సందర్భంగా నంద్యాలకు వచ్చి తన అభిమానులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అనుపమ అన్నారు. పట్టు వస్త్రాలు, చీరలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి దసరా పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలని కోరారు. -
నంద్యాలలో అనుపమ సందడి
-
‘చందన బ్రదర్స్’లో అగ్ని ప్రమాదం
-
‘చందన బ్రదర్స్’లో అగ్ని ప్రమాదం
సాక్షి, గుంటూరు ఈస్ట్ : గుంటూరు నగరంలోని ఆర్కేటీ సెంటర్లో ఉన్న వస్త్ర దుకాణం చందన బ్రదర్స్ షోరూంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని జెంట్స్ వేర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చాయి. షోరూం సిబ్బంది రాత్రి షట్టర్‌కు తాళాలు వేసి బయలు దేరుతున్న సమయంలో పై అంతస్తుల నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఈ క్రమంలో పైకి వెళ్లి చూడగా నాలుగో అంతస్తు నుంచి మంటలు రావడం గమనించి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలు అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నారు. అర్ధరాత్రి 11.30 గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
చందనా బ్రదర్స్ చైర్మన్ అరెస్టు
హైదరాబాద్: చందనాబ్రదర్స్ చైర్మన్ రామారావు ఓ చీటింగ్ కేసులో అరెస్టు అయ్యారు. బుధవారం ఎస్సార్ నగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కాసుల కక్కుర్తితో తనకు తానే బెదిరింపు లేఖ రాసుకొని తాను తీసుకున్న గోతిలో ఆయనే పడ్డాడు. వివరాలు.. గ్యాంగ్‌స్టర్ నయీం పేరుతో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తనయుడు కన్నా ఫణీంద్ర తనను బెదిరిస్తున్నాడని.. చందన బ్రదర్స్ చైర్మన్ రామారావు గతంలో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేయగా విస్మయకర విషయాలు బయటపడ్డాయి. మంత్రి కుమారుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి తనకు తానే బెదిరింపు లేఖ రాసుకొని రామారావు నాటకాలు ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పక్కా ఆధారాలతో ఆయన మీద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరుపతి చందన బ్రదర్స్‌లో భారీ అగ్నిప్రమాదం
తిరుపతి: తిరుపతి గాంధీరోడ్డులోని చందన బ్రదర్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 అగ్రిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేస్తున్నారు. -
చందనా బ్రదర్స్ లో భారీ అగ్నిప్రమాదం
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో చందనా బ్రదర్స్ దుకాణంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీరోడ్డులో ఉన్న దుకాణంలో మంటలు వ్యాపించాయి. మంటలు ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. -
చందన బ్రదర్స్‌లో భారీ చోరీ
-
కేపీహెచ్‌బీ చందనా బ్రదర్స్‌లో చోరీ
హైదరాబాద్ : కేపీహెచ్‌బీ చందనా బ్రదర్స్ షోరూంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు కిలో బంగారు ఆభరణాలతో పాటు, 16 లక్షల నగదును దోచుకు వెళ్లారు. అర్థరాత్రి ఒంటిగంట, రెండు గంటల మధ్యలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దొంగలు షోరూమ్ పక్క భవనం నుంచి లోనికి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా భద్రత సరిగా లేనందువల్లే దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. షోరూమ్‌లో నమోదు అయిన సీసీ కెమెరా పుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాగా నగరంలో ఓ వైపు చోరీలు జరుగుతున్నా.... నగల దుకాణాల యాజమాన్యాలు మాత్రం సరైన భద్రతా చర్యలు తీసుకోవటం లేదని పోలీసులు చెబుతున్నారు.