కేపీహెచ్బీ చందనా బ్రదర్స్లో చోరీ | KPHB chandraba brothers showroom Robbed | Sakshi
Sakshi News home page

కేపీహెచ్బీ చందనా బ్రదర్స్లో చోరీ

Published Thu, Aug 7 2014 12:20 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

KPHB chandraba brothers showroom Robbed

హైదరాబాద్ : కేపీహెచ్బీ చందనా బ్రదర్స్ షోరూంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు కిలో బంగారు ఆభరణాలతో పాటు, 16 లక్షల నగదును దోచుకు వెళ్లారు. అర్థరాత్రి ఒంటిగంట, రెండు గంటల మధ్యలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దొంగలు షోరూమ్ పక్క భవనం నుంచి లోనికి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా భద్రత సరిగా లేనందువల్లే దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. షోరూమ్లో నమోదు అయిన సీసీ కెమెరా పుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాగా నగరంలో ఓ వైపు చోరీలు జరుగుతున్నా.... నగల దుకాణాల యాజమాన్యాలు మాత్రం సరైన భద్రతా చర్యలు తీసుకోవటం లేదని పోలీసులు చెబుతున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement