
చందనా బ్రదర్స్ లో భారీ అగ్నిప్రమాదం
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో చందనా బ్రదర్స్ దుకాణంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీరోడ్డులో ఉన్న దుకాణంలో మంటలు వ్యాపించాయి.
మంటలు ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.