
తెనాలి రూరల్: ప్రేమ పేరుతో మైనర్ బాలికకు దగ్గరైన యువకుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చిన సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను విచారించగా, దూరపు బంధువైన యువకుడు కారణమని తెలిసింది. పెద్దలకు విషయం తెలుపగా, సదరు యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి యడ్ల లింగయ్య కాలనీకి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలసి కూలి పనులకు వెళుతుంటుంది.
వారికి దూరపు బంధువైన యువకుడు తలవరస విజయబాబు కూడా పనులకు వెళుతూ బాలికతో స్నేహం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటూ దగ్గరయ్యాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చిన సంగతి తల్లిదండ్రులు శుక్రవారం గుర్తించారు. విచారించగా, విజయబాబు కారణమని తెలిసింది. దీంతో బాలికను వివాహం చేసుకోవాలని పెద్దల సమక్షంలో యువకుడిని అడగ్గా, అతను నిరాకరించాడు. మోసపోయిన బాలిక తల్లిదండ్రులతో కలసి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో, అత్యాచారం సెక్షన్‌ల కింద త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment