
సాక్షి, తిరుపతి : అవినీతి పాలన చేసిన టీడీపీ అధినేత చంద్రబాబ మళ్లీ రావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ సంకల్ప యాత్ర కార్యక్రమం శనివారం తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సునీల్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్థాపించింది నిజమైన తెలుగుదేశం పార్టీ. ఇప్పటి తెలుగుదేశం అక్రమాలకు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిందని విమర్శించారు. చంద్రబాబు యూటర్న్ బాబుగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment