Sunil Deodhar
-
చంద్రబాబుతో సావాసం.. బీజేపీ నేత సంచలన కామెంట్స్
చంద్రబాబు నాయుడికి బీజేపీ జాతీయ నాయకుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బీజేపీ జాతీయ నాయకుడు సునీల్ దేవ్‌ధర్ అయితే చంద్రబాబు నాయుడికి వీర ఫ్యాన్. గతంలో చంద్రబాబు టాలెంట్ గురించి సునీల్ దేవ్‌ధర్ చక్కగా వివరించారు. రాజకీయాలకు సంబంధించి చంద్రబాబును కట్టప్పతో పోల్చారు డియోరా. బీజేపీతో ఎక్కువ సార్లు పొత్తులు పెట్టుకున్నారు కాబట్టే చంద్రబాబు గురించి బీజేపీ నేతలకు బాగా తెలుస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ బాహుబలులు ఉంటారు. వారి వెనకాలే కట్టప్పలూ పుట్టుకు వస్తారు. చంద్రబాబు నాయుడి గురించి ఎల్లో మీడియా ఎన్ని గప్పాలు కొట్టినా.. చంద్రబాబును బాహుబలి అని మాత్రం ములగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చంద్రబాబుకు సరిపోదని వాళ్లకీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎనభైలలో రాజకీయాల్లో బాహుబలి అంటే ఎన్టీఆర్ అనేవారు. కాంగ్రెస్ ఏకఛత్రాధి పత్యానికి గండి కొట్టిన బలవంతుడు ఎన్టీఆర్. మరి చంద్రబాబు ఎవరు? ఆయన గురించి మనం చెప్పుకునే కంటే బీజేపీ నేతలను అడిగితే సరిపోతుంది. అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుక అన్నట్లు చంద్రబాబు గురించి బీజేపీ నేతలకు బాగా తెలుసు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని చాలా దగ్గరుండి అధ్యయనం చేసిన బీజేపీ జాతీయ నాయకుడు, గతంలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన సునీల్ దేవ్‌ధర్ అయితే గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబు గురించి తనకున్న అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నారో మరొక్కసారి విందాం. జన్మభూమి కమిటీ సభ్యులు దొంగలయితే చంద్రబాబు నాయుడు గజ దొంగ అని బిరుదు ఇచ్చారు సునీల్ దేవ్‌ధర్. అక్కడితో ఆగలేదు చంద్రబాబును మించిన కట్టప్ప మరొకరు లేరన్నారు. ఎన్టీఆర్కే కాదు నమ్మి పొత్తులు పెట్టుకున్న నరేంద్ర మోదీనీ.. మోదీతో కలిసి వచ్చినపుడు గెలిపించిన ఏపీ ప్రజలను కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. అంతేకాదు, అమరావతి ప్రాంతాన్నీ అక్కడి రైతుల ఆశలను సర్వనాశనం చేసింది కూడా చంద్రబాబే అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు దొంగతనాలను ఆయన వెన్నుపోటు కథలను ఆయన మోసకారితనాలను నిశితంగా గమనించారు కాబట్టే సునీల్ ఇంత చక్కగా చెప్పగలిగారు. రెండేళ్ల క్రితం చంద్రబాబు మళ్లీ ఎన్డీయేలోకి వస్తానంటే ఆహ్వానిస్తారా అని మీడియా ప్రశ్నించగా ఇదే దేవ్‌ధర్ చంద్రబాబుకు ఎన్డీయేలో చోటు లేదన్నారు. అటువంటి మోసగాడిని మరోసారి కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే, చంద్రబాబుతో సావాసం వల్ల వచ్చిన సమస్య ఏంటో కానీ బీజేపీ కూడా యూ టర్న్ తీసుకుని చంద్రబాబు పొత్తు కోసం కాళ్లమీద పడగానే సరేలే.. పోనిలే అన్నట్టుగా ఒప్పుకుంది. ఇది బీజేపీకి ఎంత మాత్రం మంచిది కాదని.. సునీల్ దేవ్‌ధర్ చెప్పినట్లు త్వరలోనే చంద్రబాబు మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. -
ఏపీ బీజేపీ సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్‌కి ఉద్వాసన
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్‌కి ఆ పార్టీ ఉద్వాసన పలికింది. జాతీయ కార్యవర్గం నుంచి సునీల్ దేవధర్‌ను తొలగించింది. ఇప్పటి వరకు జాతీయ కార్యదర్శిగా ఉన్న ఆయన పని తీరుపై జాతీయ నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ కమిటీని అధిష్టానం శనివారం ప్రకటించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. తెలంగాణ నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా.. ఏపీ నుంచి సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగనున్నారు. చదవండి: ఆపరేషన్ ఆకర్ష్.. జయసుధ సహా తెలంగాణ బీజేపీలోకి భారీ చేరికలు! -
జనసేనతోనే బీజేపీ పొత్తు.. టీడీపీతో ఉండదు: సునీల్ దియోధర్
సాక్షి, కాకినాడ: 2024 ఎన్నికల్లో జనసేనతో మాత్రమే బీజేపీకి పొత్తు ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ తెలిపారు. టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదని పేర్కొన్నారు. గత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుందని, ఆ పొత్తును రద్దు చేసినట్లు టీడీపీ ఇప్పటి వరకు ప్రకటించలేదని వెల్లడించారు. చంద్రబాబు ఇంకా కాంగ్రెస్‌తోనే ఉన్నారని విమర్శించారు. ‘కర్ణాటక ఎన్నికల్లో మా వల్లే కాంగ్రెస్ గెలిచిందని అక్కడ టీడీపీ ఇంచార్జ్ ప్రకటించారని సునీల్ దియోధర్ పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే నాలుగు శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని, మతమార్పిడులను నిరోధిస్తామని తెలిపారు. -
టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోం. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభవం చవి చూశాం. పవన్ కల్యాణ్‌కు రోడ్డు మ్యాప్ అంశంపై మేము అంతర్గతంగా చర్చించుకుంటామని సునీల్ దేవధర్ అన్నారు. చదవండి: ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర: మంత్రి అంబటి -
2024 ఎన్నికల వరకు సోము వీర్రాజే అధ్యక్షుడు!
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజే 2024 ఎన్నికల వరకు కొనసాగుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ పరోక్షంగా స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోము వీర్రాజు నాయకత్వంలోనే ఏపీలో తమ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని.. ఆ మేరకు జాతీయ నాయకులు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత కనిపిస్తోందని, టీడీపీకి మళ్లీ అధికారం అప్పగించడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. కాగా, విశాఖలో పవన్‌కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడాన్ని బీజేపీ ఖండిస్తోందని చెప్పారు. పవన్‌తో సోము వీర్రాజు ఫోన్లో మాట్లాడారని.. పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్సీ మాధవ్‌ను అక్కడికి పంపామని పేర్కొన్నారు. -
చంద్రబాబు కట్టప్ప లాంటి వాడు : సునీల్ ధియోదర్
-
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఏపీ బీజేపీ సహా ఇన్ ఛార్జ్
-
'చంద్రబాబు నెంబర్‌వన్ క్రిమినల్'
చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ క్రిమినల్ అని ఏపీ బీజేపీ సహాయ ఇన్చార్జీ సునీల్ దియోధర్ దేయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ బాహుబలి లాంటివాడన్నారు. అలాంటి బాహుబలినే వెన్నుపోటు పొడిచిన కట్టప్ప చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు కట్టప్ప లాంటి వాడని.. ప్రధానమంత్రి మోడీని కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడన్నారు.అమరావతి రైతులను చంద్రబాబు నాశనం చేశారని పేర్కొన్నారు.జన్మభూమి కమిటీ సభ్యులు దొంగలైతే చంద్రబాబు పెద్ద గజదొంగ అని ఎద్దేవా చేశారు. -
టీడీపీ.. ఓ కుటుంబ, అవినీతి పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అని బీజేపీ ఏపీ సహ ఇన్చార్జి సునీల్ దేవ్‌ధర్ చెప్పారు. ఆ పార్టీకి ఒక దశ, దిశ ఏదీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీకి తాళం వేశారని, ఆంధ్రాలోనూ త్వరలోనే తాళం పడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కెమెరా ముందు వ్యాఖ్యానించడం చూస్తే పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. దేవ్‌ధర్ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే సొంత పార్టీపై విశ్వాసం లేదని, అలాంటి పార్టీతో బీజేపీకి పొత్తు ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు సీట్ల కోసం, సీఎం పదవి కోసం పొత్తు గురించి మాట్లాడే ఆలోచన చేయబోమన్నారు. బీజేపీలో రాష్ట్ర ఇన్చార్జి, సహ ఇన్‌చార్జిలే పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తారని చెప్పారు. తమ పార్టీ జాతీయ నాయకత్వానికి తామే కళ్లు, చెవులు అని తెలిపారు. పార్టీలో హైకమాండ్ వేరు, ఇన్చార్జిలు వేరు కాదని వ్యాఖ్యానించారు. తాము ఏ విషయంపై మాట్లాడినా పార్టీ అధిష్టానం ప్రతినిధులుగానే చెబుతామన్నారు. 2019 సాధారణ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు సన్నిహితంగా ఉన్నారని, టీడీపీ సహకరించడం వల్లే బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటు బ్యాంకులో పెరుగుదల కనిపించిందని వ్యాఖ్యానించారు. బద్వేలులో బీజేపీకి ఓటమి ఎదురైనా, ఫలితాలు సంతోషాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. గతంలో 700 ఓట్లు వచ్చిన నియోజకవర్గంలో ఇప్పుడు 21 వేల ఓట్లు వచ్చాయన్నారు. 0.7 శాతం నుంచి 15 శాతానికి బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు. భారీగా రిగ్గింగ్ జరిగినప్పటికీ బీజేపీకి ఇన్ని ఓట్లు దక్కాయని, చాలా తక్కువ సమయంలో ఇంత పురోగతి సాధించగలిగామని అన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ–జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. -
టీడీపీ,బీజేపీతో పోత్తు ప్రశ్నే లేదు
-
టీడీపీతో బీజేపీ పొత్తు ప్రశ్నేలేదు: సునీల్ దేవధర్
న్యూఢిల్లీ: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే సొంత పార్టీపై విశ్వాసం లేదని ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీకి తాళం పడింది.. త్వరలోనే ఆంధ్రాలోనూ తాళం పడబోతోందని అచ్చెం నాయుడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. టీడీపీతో .. బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలుగు దేశం పార్టీ.. ఒక కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ .. దానికి ఒక దిశ, దశ లేదని విమర్శించారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి ఓటువేయ్యాలని తమ కార్యకర్తలకు చెప్పారని తెలిపారు. కాంగ్రెస్.. టీడీపీల మధ్య లోపాయకారి ఒప్పందం కొనసాగుతుందని పేర్కొన్నారు. బీజేపీలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, కో ఇన్‌చార్జ్‌లే.. హైకమాండ్‌కు ప్రతినిధులన్నారు. మా జాతీయ నాయకత్వానికి మేమే కళ్లు, చెవులని పేర్కొన్నారు. హైకమాండ్ అభిప్రాయమే.. నేను చెబుతున్నానని ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ తెలిపారు. -
చంద్రబాబు నిజంగా ఢిల్లీకి వచ్చారా.. బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు ఉనికిని సైతం గుర్తించడానికి బీజేపీ అధిష్టానం ఇష్టపడడం లేదు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారన్న సంగతి సైతం తమకు తెలియదని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధానమంత్రి, హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం బాబు హస్తినలో రెండు రోజుల పాటు పడిగాపులు పడిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఆయన ఢిల్లీకి వచ్చారా.. అని సెటైర్లు వేస్తున్నారు. దీన్‌దయాల్ రోడ్డులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ఏపీ ఇన్చార్జి సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటనపై మీడియా ప్రశ్నలడగ్గా, చంద్రబాబు నిజంగా ఢిల్లీకి వచ్చారా అని సునీల్ దేవధర్ ఎదురు ప్రశ్నలతో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఉనికిని సైతం గుర్తించడానికి బీజేపీ ఇష్టపడడం లేదనడానికి ఇదే ఉదాహారణ అని పలువురు అంటున్నారు. అంతేకాక, భవిష్యత్‌లో జరిగే ఏ ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నలేదని స్పష్టంగా తేల్చిచెప్పారు. టీడీపీ.. రాష్ట్ర ఆరోగ్యానికి హానికరం అంటూ ముక్తాయింపు ఇవ్వడం కొసమెరుపు. (చదవండి: కష్టం.. కలవలేం: చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, అమిత్ షా) నిజానికి సునీల్ దేవధర్ ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలోనే, చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారని ఎల్లో మీడియా లీకులు ప్రసారం చేసింది. రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చంద్రబాబు వివరించినట్లు, ఆ విషయాలను పరిశీలిస్తానని షా చెప్పినట్లు ప్రచారం చేశారు. అమిత్ షా, బాబుకు ఫోన్ చేశారా లేదా అన్నదానిపై అమిత్ షా కార్యాలయవర్గాలేవీ స్పందించలేదు. (చదవండి: ‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో తెలుసా బాబు?!’) అమిత్ షా అపాయింట్మెంట్ దొరక్క అభాసుపాలైన బాబుకు ఫేస్ సేవింగ్ కోసం ఎల్లో మీడియా ఈ ప్రచారం చేపట్టిందనే గుసగుసలు వినిపించాయి. అదే సమయంలో చంద్రబాబు ఢిల్లీకి వచ్చారా అని ఏపి బిజెపి వ్యవహారాల ఇన్చార్జి అని ప్రశ్నించడంతో, ఎల్లో మీడియా ప్రచారం అంతా వట్టిదేనని తేలిపోయిందంటున్నారు. మోడీ, షాల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును బిజెపి పెద్దలు మరిచిపోలేదనడానికి ఇదొక తాజా నిదర్శనమని అంటున్నారు. చదవండి: ద్వంద్వనీతితో రుబాబు -
‘టీడీపీతో కలవటం ఇక జరగదు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు కోరుకుంటున్నట్టుగా భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం కానీ, కలిసి పనిచేయడం కానీ జరగబోదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ ధియోధర్ అన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీకి, టీడీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ కృషి చేస్తుందని శనివారం ట్వీట్ చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేయాలన్న తన ఆకాంక్షను చంద్రబాబు మహానాడు వేదికపై నుంచి పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేశారని, అయితే.. నేతలు ఆ పార్టీని వీడకుండా ఉండేందుకే చంద్రబాబు ఇలాంటి మోసపూరిత ప్రచారం మొదలుపెట్టారని సునీల్ విమర్శించారు. తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మాదిరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. -
'బాబు ఎవరినైనా వాడుకుని వదిలేస్తారు'
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పిన విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబూరావు శనివారం బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఏపీ సహ ఇంచార్జి సునీల్ దేవధర్ సమక్షంలో బాబూరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మీడియాతో మట్లాడుతూ... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలో చేరాలని పిలుపునిస్తున్నాను. ఎన్టీఆర్ కుమార్తె పురంధ్రేశ్వరికి పార్టీ కేంద్ర కమిటీలో స్థానం కలిపించారు. చంద్రబాబు ఎవ్వరినైనా వాడుకుని వదిలేస్తారు. గత ఎన్నికల్లో తనకు అనుకూలమైన వ్యక్తులకు సీటివ్వలేదని పోత్తును వదులుకున్నటు చంద్రబాబు ప్రకటించాడు. మళ్లీ సాయంత్రమే కాళ్లబేరానికొచ్చాడు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వాడుకున్నాడు, మోసగించాడు, వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేయగలడు..? నిర్మాణమైన ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా పోషించలేకపోతున్నారు. బీజేపీ జాతీయ పార్టీ. మోడీ ఇజమ్.. ఎన్టీఆర్ విధానాలను ఇప్పుడు బీజేపీ అనుమతిస్తోంది. (అందుకే పార్టీకి రాజీనామా : గద్దె బాబూరావు) హుద్ హూద్ సమయంలో కింజరపు అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువుల పూడికలో అడ్డగోలుగా దోచేశారు. బాత్రూమ్ కట్టడంలో కూడా అవకతవకలకు పాల్పడి ఆ నిధులు కూడా తెలుగు దేశం పార్టీ నాయకుల జోబుల్లోకే వెళ్లాయి. చంద్రబాబు సొంత మండలంలో కూడా నిర్మాణాలు చేపట్టకుండానే నిధులన్నీ దోచేశారు. గతంలో చినరాజప్పకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా చేశారు అని సోమువీర్రాజు విమర్శలు గుప్పించారు. (లక్ష్మీపతిరాజాపై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ) -
ఏడు కొండలని, ఎర్రచందనాన్ని కాపాడాలి
సాక్షి, తిరుమల: బీజేపీ నేషనల్ సెక్రటరీ సునీల్ ధియోదర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడాలని, త్వరగా వ్యాక్సిన్ రావాలని కలియుగ దైవం వేంకటేశ్వరున్ని కోరుకున్నాను. ప్రజలకు సేవలందిస్తున్న ప్రధాని, హోమ్ మంత్రి ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నాను. (ఏపీలో కొత్త చరిత్ర) సహజసిద్ధంగా శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే ఎర్రచందనం మొక్కలు పెరుగుతాయి. ఎర్రచందనం స్వామి వారి సంపద, కానీ కొందరు స్మగ్లర్లు శతాబ్ధాలుగా వాటి ద్వారా అక్రమంగా ధనార్జన చేస్తున్నారు. ఎర్రచందనం రక్షణ కోసం సెంట్రల్ ఫోర్స్ ఇవ్వాలని ఏపీ సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. ఏడు కొండలని, ఎర్రచందనంను కాపాడాలని పీఎం నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు' సునీల్ ధియోదర్ తెలిపారు. -
ఆ లేఖకు, సీఎంకు ఎలాంటి సంబంధం లేదు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి తుడా: ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు అపార గౌరవం, ప్రేమాభిమానాలు ఉన్నాయని, ఆయన మనందరి నాయకుడని వైఎస్సార్సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. విరసం నేత వరవరరావుతో తనకున్న వ్యక్తిగత పరిచయంతోనే ఆయనను విడిచిపెట్టాలని తాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశానని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏమాత్రం సంబంధం లేదని తేల్చిచెప్పారు. తాను రాసిన ఆ లేఖను బీజేపీ నేత సునీల్ దియోధర్ ట్విటర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ముడిపెట్టి ప్రస్తావించడం బాధ కలిగించడంతోపాటు నవ్వు తెప్పించిందన్నారు. ఈ మేరకు భూమన ఆదివారం సునీల్ దియోధర్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలా.. ► భారత ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం ఏమాత్రం కాదు. నా లేఖలో నేను ఉపరాష్ట్రపతిని కోరింది.. అనారోగ్యంతో ఉన్న 81 ఏళ్ల వృద్ధుడు (వరవరరావు) పట్ల జాలి చూపాలని మాత్రమే. అంతేగానీ ఆయన భావజాలాన్ని అంగీకరించి కాదు. ఇది తప్పని మీకు (సునీల్ దియోధర్) అనిపిస్తే నమస్కారం పెట్టడం తప్ప మరేమీ చేయలేను. నేరస్తులు, హంతకులను నేనెప్పుడూ సమర్థించను. సాయుధ పోరాటం పట్ల, హింసే ఆయుధంగా ఉన్నవారి పట్ల నాకు ఎలాంటి సుముఖత లేదు. ► 46 ఏళ్ల క్రితం వరవరరావు, నేను, వెంకయ్య నాయుడు జైలులో కలిసి ఉన్నాం కాబట్టి నేను ఉపరాష్ట్రపతికి వ్యక్తిగతంగా లేఖ రాశాను. నా రాజకీయ ప్రస్థానం 1969–70లో ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ప్రారంభమైంది. ► శత్రువును చంపడం కాదు.. క్షమించడం పెద్ద శిక్ష అని నేను నమ్ముతాను. ఆ పై ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. భూమన ఆరోగ్యంపై సీఎం ఆరా కరోనా బారినపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూమన కరుణాకర్‌రెడ్డిని ఆదివారం సీఎం వైఎస్ జగన్ ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని సీఎంకు భూమన వివరించారు. ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం ఆదర్శనీయమని సీఎం అభినందించారు. త్వరగా కోలుకుని ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు. -
ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన
సాక్షి, అమరావతి : విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరావును విడిపించాలని కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాయడం తన వ్యక్తిగత నిర్ణయం అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ ట్వీట్ చేయడం బాధాకరం అన్నారు. దేశ ప్రధానమంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన విరసం నేత వరవరరావును విడుదల చెయ్యాలని భూమన కోరడం సమంజసం కాదని సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు. దానికి సమాధానంగా సునీల్ దియోధర్‌కు భూమన ఆదివారం లేఖ రాశారు. ‘ప్రధాని మోదీ పట్ల నాకు అపార గౌరవం, ప్రేమ ఉంది. నేను లేఖలో కోరింది అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ల వరవరావు పట్ల జాలి చూపించమని, అంతే కానీ వరవరరావు భావాజాలాన్ని అంగీకరించి కాదు. భారతదేశపు సనాతన ధర్మాన్ని, విలువలను గౌరవిస్తా. హింసా మార్గాన్ని ఏ మాత్రం సమర్థించను. నా వ్యక్తిగత అభిప్రాయానికి సీఎం జగన్‌తో మీరు ముడిపెడుతూ ట్వీట్ చేయడం బాధాకరం. శత్రువును చంపడం కాదు.. క్షమించడం పెద్ద శిక్ష అని నమ్ముతా’అని లేఖలో భూమన పేర్కొన్నారు. కాగా, భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి, విరసం నేత వరవరరావును ఎన్ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు (వీవీ)ను విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కొన్ని రోజుల క్రితం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. అయితే ఆ లేఖ తన వ్యక్తిగత నిర్ణయం అని, దానిలో పార్టీకి సంబంధం లేదని భూమన అప్పుడే స్పష్టం చేశారు. అయితే దీనిపై మళ్లీ విమర్శలు రావడంతో భూమన వివరణ ఇచ్చారు. -
చంద్రబాబు ఒక గజ దొంగ
-
‘ఆయన వేషం మార్చి నటుడయ్యారు..!’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నేతలు అమరావతి విషయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోంచి రాజకీయ నేతగా మారారని, కానీ చంద్రబాబు మాత్రం తొలుత రాజకీయ నేతగా ఉండి నెమ్మదిగా నటుడిగా మారారని చురకలంటించారు. చంద్రబాబు ఒక గజ దొంగ అని దేవధర్ వ్యాఖ్యానించారు. జీవీఎల్‌పై అనవసర ఆరోపణలు చేయవద్దని హితవు పలికారు. వైజాగ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ సమానమే.. ‘విధి నిర్వహణలో భాగంగా ప్రధాన మంత్రిని రాష్ట్రాల ముఖ్య మంత్రులు కలవడం సహజం. దానిలో భాగంగానే ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని టీడీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనే లేదు. జనసేనతో ఇప్పటికే బీజేపీ పొత్తు పెట్టుకుంది. రానున్న స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పనిచేస్తాం. రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. నిజానికి రాజ్యసభలో మాకు బలం లేదు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు మాకు మద్దతు ఇచ్చాయి. అంత మాత్రన వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకున్నామని కాదు. ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు పొలిటికల్ ఫైట్ మాత్రమే’అని సునీల్ దేవధర్ పేర్కొన్నారు. -
నేనేమైనా వాళ్లకు బాకీ ఉన్నానా?
సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భావజాలం, తమ పార్టీ భావజాలం ఒక్కటేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. 2014 ఎన్నికల తరువాత బీజేపీతో ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు తొలగిపోయిందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ నేతలు వివరిస్తుంటే దానివల్ల ఎంత ఉపయోగమో తెలిసిందని పేర్కొన్నారు. ఇకనుంచి ఎలాంటి షరతులూ లేకుండా బీజేపీతో కలసి పని చేస్తామని తేల్చిచెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని పవన్ గుర్తు చేశారు. బీజేపీ, జనసేన పార్టీల ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశమయ్యారు. ఇక నుంచి రాష్ట్రంలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ అవసరం ఎంతో ఉందని చెప్పారు. ఇకపై ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవ్‌ధర్ నేతృత్వంలో పని చేస్తామని వెల్లడించారు. గతంలో మీరు బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలతో కలసి పనిచేశారు కదా! అని విలేకరుల ప్రశ్నించగా.. ‘నేను ఏమైనా వామపక్షాలకు బాకీ ఉన్నానా’ అని తీవ్రస్వరంతో బదులిచ్చారు. బీజేపీ విధానాలకు మద్దతు ఇస్తున్నాం.. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుని తీరుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ సత్తా, తెగువ తమకు ఉన్నాయన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తోపాటు బీజేపీ విధానాలన్నింటికీ తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఆ చట్టం వల్ల మన దేశంలో ఉన్న ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ విశ్వవిద్యాలయం రూపొందించిన నివేదిక చదవడంతో తనకు తెలిసిందన్నారు. అందరూ ఆ నివేదిక చదవాలని సూచించారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని పవన్ కల్యాణ్ చెప్పారు. ఏపీలో బీజేపీ బలపడుతుంది: సునీల్ దేవ్‌ధర్ జనసేన పార్టీతో పొత్తు వల్ల ఏపీలో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవ్‌ధర్ చెప్పారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో తృతీయ ప్రత్యమ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. అన్ని స్థాయిల్లోనూ రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. టీడీపీతో గానీ, వైఎస్సార్సీపీతో గానీ తమకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎలాంటి పొత్తు ఉండదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... ఎలాంటి షరతులూ లేకుండా తమతో కలిసి పనిచేసేందుకు పవన్ కల్యాణ్ సమ్మతించారని చెప్పారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుంటామన్నారు. ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఏర్పడటమే తమ లక్ష్యమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, జనసేన పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శివశంకర్, రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. . -
దేశద్రోహులను ఏరేస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దేశ ద్రోహానికి పాల్పడితే సహించేది లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ అన్నారు. దేశంలో ఉన్న పాకిస్తానీ, బంగ్లాదేశ్ ముస్లింలను కచ్చితంగా దేశం నుంచి పంపించేస్తామని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) అవగాహన సదస్సు పేరుతో శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మతం పేరుతో రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాగా, సీఏఏను టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ చెప్పే కారణాలు తప్పని రుజువు చేస్తానన్నారు. మీరు చెప్పే కారణాలు సరైనవేనని రుజువు చేస్తే తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తానని, దీనికి కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ చెప్తే నా పదవికి రాజీనామా చేస్తా: లక్ష్మణ్
సాక్షి, నిజామాబాద్ : ముస్లిం పదం లేదని పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తున్నారంటే పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతున్నట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రానంతరం ముస్లింలకు ప్రత్యేక దేశాలిచ్చినా.. హిందువుల మీద దాడి మాత్రం ఆపలేదని మండిపడ్డారు. నిజామాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ హాజరయ్యారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారత్ నుంచి విడిపోయిన ప్రాంతాలు ఇస్లాం దేశాలుగా ఏర్పడితే మనది మాత్రం సెక్యులర్ దేశంగా మిగిలిందన్నారు. తెలంగాణ పేరుతో ఆనాడు ఆంధ్ర ఉద్యోగులు, ప్రజలపై దాడి చేసిన కేసీఆర్.. ఇప్పుడు దేశంలోని హిందువులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆరా లేక ఓవైసీనా అని ప్రశ్నించారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సరైన సమాధానం చెబితే బీజేపీ రాష్ట్ర పదవికి రాజీనామ చేస్తానని ప్రకటించారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే కేసీఆర్‌కు పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. భద్రాచలంలో రామునికి తలంబ్రాలు ఇవ్వలేని నువ్వు హిందువు ఎలా అవుతావని కేసీఆర్‌ను నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాలు కృష్ణార్జుల్లా దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వేతో అరాచకం సృష్టించిన కేసీఆర్.. ఇప్పుడు ఎన్పీఆర్ను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు నిజామాబాద్‌లో సభ పెడితే హైదరాబాద్‌లో కేసీఆర్ వణుకుతున్నారని బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ దుయ్యబట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ ముస్లింలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ గడ్డం పీకీ కేసీఆర్‌కు పెడతా. ఏం పీకుదామని నిజామాబాద్‌కు వచ్చారో ఓవైసీ చెప్పాలి. కూతురు ఓడిపోయిందన్న బాధలో అసద్‌ను కేసీఆర్ మాటిమాటికీ నిజామాబాద్ పంపుతున్నారు. కేటీఆర్ అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ బలోపేతం అవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 95 శాతం ఓట్లు వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. జిన్నా కాలం పోయింది గుర్తుంచుకో బీజేపీతో పెట్టుకుంటే ఎంఐఎం చనిపోతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్ అన్నారు. పాకిస్తాన్ భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందని, ఒవైసీ దేశాన్ని ముక్కలు చేయాలని మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జిన్నా కాలం పోయిందని గుర్తుంచుకో ఒవైసీ అంటూ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీఆర్ఎస్, ఎంఐఎం పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. గతంలో ఈ బిల్లును తేవాలని చెప్పిన పార్టీలన్నీ ఇప్పుడు వ్యతిరేకించడం అన్యాయమన్నారు. దేశంలో ఉన్న పాకిస్తానీ, బంగ్లాదేశ్ ముస్లింలను కచ్చితంగా పంపిస్తామని తెలిపారు. బీజేపీ ఉన్నంత వరకు దేశ రక్షణ కోసం పనిచేస్తామని, తెలంగాణలో బీజేపీని గెలిపించాలని సునీల్ కోరారు. -
‘చంద్రబాబు, పవన్ డ్రామాలు ఆడుతున్నారు’
సాక్షి, విజయవాడ : ఇసుకపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు డ్రామాలు ఆడుతున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. గురువారం విజయవాడలో ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దేవ్‌ధర్, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్, చంద్రబాబువి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బహిష్కరించిన పార్టీ అని అన్నారు. టీడీపీ, జనసేన వేదికను తమ పార్టీ పంచుకోదని స్పష్టం చేశారు. సునీల్ దేవ్‌ధర్ మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు నాయుడుకు శాశ్వతంగా తలపులు మూసేశామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఉన్న ఏ వేదికను తాము పంచుకోమని అన్నారు. చంద్రబాబు మళ్లీ తమ వద్దకు రావాలని చూస్తున్నారని తెలిపారు. -
‘చంద్రబాబును ఎవరూ కోరుకోవడం లేదు’
సాక్షి, తిరుపతి : అవినీతి పాలన చేసిన టీడీపీ అధినేత చంద్రబాబ మళ్లీ రావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ సంకల్ప యాత్ర కార్యక్రమం శనివారం తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సునీల్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్థాపించింది నిజమైన తెలుగుదేశం పార్టీ. ఇప్పటి తెలుగుదేశం అక్రమాలకు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిందని విమర్శించారు. చంద్రబాబు యూటర్న్ బాబుగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కోరారు. -
టీడీపీతో పొత్తుండదు
కర్నూలు కల్చరల్ : ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్చార్జ్ సునీల్ దేవ్‌ధర్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న గాంధీ సంకల్పయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. దివంగత ఎన్టీఆర్ రాజకీయ, సామాజిక విలువలతో టీడీపీని స్థాపిస్తే.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం చేసుకున్నాడని విమర్శించారు. ఇప్పుడున్న టీడీపీ అవినీతితో నిండిపోయిందన్నారు. టీడీపీని, చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కేంద్రానికి ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బాబు ఓటుకు నోటు విషయంలో ఆరితేరిన వ్యక్తి అని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.