
కర్నూలు కల్చరల్ : ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న గాంధీ సంకల్పయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. దివంగత ఎన్టీఆర్ రాజకీయ, సామాజిక విలువలతో టీడీపీని స్థాపిస్తే.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం చేసుకున్నాడని విమర్శించారు. ఇప్పుడున్న టీడీపీ అవినీతితో నిండిపోయిందన్నారు. టీడీపీని, చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కేంద్రానికి ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బాబు ఓటుకు నోటు విషయంలో ఆరితేరిన వ్యక్తి అని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment