
సాక్షి, కాకినాడ: 2024 ఎన్నికల్లో జనసేనతో మాత్రమే బీజేపీకి పొత్తు ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ తెలిపారు. టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదని పేర్కొన్నారు. గత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుందని, ఆ పొత్తును రద్దు చేసినట్లు టీడీపీ ఇప్పటి వరకు ప్రకటించలేదని వెల్లడించారు. చంద్రబాబు ఇంకా కాంగ్రెస్‌తోనే ఉన్నారని విమర్శించారు.
‘కర్ణాటక ఎన్నికల్లో మా వల్లే కాంగ్రెస్ గెలిచిందని అక్కడ టీడీపీ ఇంచార్జ్ ప్రకటించారని సునీల్ దియోధర్ పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే నాలుగు శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని, మతమార్పిడులను నిరోధిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment