సునీల్ దేవధర్ (ఫైల్)
న్యూఢిల్లీ: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే సొంత పార్టీపై విశ్వాసం లేదని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీకి తాళం పడింది.. త్వరలోనే ఆంధ్రాలోనూ తాళం పడబోతోందని అచ్చెం నాయుడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. టీడీపీతో .. బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తెలుగు దేశం పార్టీ.. ఒక కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ .. దానికి ఒక దిశ, దశ లేదని విమర్శించారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి ఓటువేయ్యాలని తమ కార్యకర్తలకు చెప్పారని తెలిపారు. కాంగ్రెస్.. టీడీపీల మధ్య లోపాయకారి ఒప్పందం కొనసాగుతుందని పేర్కొన్నారు. బీజేపీలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, కో ఇన్‌చార్జ్‌లే.. హైకమాండ్‌కు ప్రతినిధులన్నారు. మా జాతీయ నాయకత్వానికి మేమే కళ్లు, చెవులని పేర్కొన్నారు. హైకమాండ్ అభిప్రాయమే.. నేను చెబుతున్నానని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment