acchemnaidu
-
అచ్చోసిన క్రిమినల్
దశాబ్దాల రాజకీయ వారసత్వాన్ని ఆయన అక్రమాలకు అనువుగా మార్చుకున్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినకాడికి దోచుకున్నారు. అధికారులను బెదిరించి...రికార్డులు తారుమారు చేసి... అనుచరులతో కలసి భూదందా నడిపారు. సహజసిద్ధంగా లభ్యమయ్యే గ్రానైట్‌ను అక్రమంగా తవ్వేసి అధికారుల కళ్లుగప్పి ఎగుమతి చేసుకున్నారు. తమ మాట విననివారినీ.. ఎదురు తిరిగిన వారిని మట్టుబెట్టడం.. లేకుంటే వారిని సామాజిక బహిష్కరణ చేసి బెదిరించడం అలవాటుగా చేసుకున్నారు. ఓ ప్రతిపక్షం రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఈయన ఓ విడత అమాత్యపదవి వెలగబెట్టి ఏకంగాపెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని ఓ తెలుగుదేశం నాయకుడి అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయంగా ఆయనకున్న పరపతిని భూదందాలకు, అక్రమంగా గ్రానైట్ తరలింపునకు వాడుకుంటున్నారు. అడ్డుకునే అధికారులపై విరుచుకుపడుతున్నారు. ఆయన సోదరుడు కోటబో మ్మాళి మండలం నిమ్మాడ సమీపంలో పెద్దబమ్మిడి గ్రామంలో 3.15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి గోడౌన్ నిర్మించారు. సాగునీటి కాలువ మూసేసి గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ నిర్మించారు. సాగునీటి కాలువను సైతం మూసేశారు.ఆ కాలువపై ఆధారపడిన 40 ఎకరాలకు సాగునీరు నిలిచిపోయింది. ఆక్రమించుకున్న భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు కూడా మాయం చేశారు. అధికారంలో ఉండగా కబ్జా చేసిన భూములను తమకు తెలిసిన వ్యక్తుల పేరు మీదకు మార్చేసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారు. అధికారుల స్టాంపు, డిజిటిల్ సిగ్నేచర్‌ను తమ గుప్పెట్లో పెట్టుకుని అక్రమాలను కొనసాగించారు.దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దౌర్జన్యానికి పాల్పడేవారు. తన అనుచరులను బినామీలుగా మార్చుకుని వారి పేరున అనేక పట్టాలు సృష్టించుకున్నారు.టీడీపీ హయాంలో కోటబొమ్మాళి మండల కేంద్రంలో పెద్ద చెరువు అభివృద్ధి పేరుతో సుమారు 12 ఎకరాలను కబ్జా చేశారు. గరీబుల గెడ్డ పరీవాహక భాగంలో సుమారు 7 ఎకరాలు తన అనుచరుడి పేరున కబ్జాచేశారు. ఇవి కొన్ని ఆక్రమణలు మాత్రమే. ఇవిగాకుండా తన అనుచరులు చేసిన భూదందాలకు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రానైట్ అక్రమాలతో ప్రభుత్వ ఆదాయానికి గండిఆ నాయకుడి కుటుంబ సభ్యులు గ్రానైట్‌ను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. దీనిపై మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి పక్కా ఆధారాలతో కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 379, 420, 477–ఎ, 406, 120బి, 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ నాయకుడి కుమారుడి పేరున 2018 ఏప్రిల్ 23వ తేదీ నుంచి 2038 ఏప్రిల్ 22వ తేదీ వరకు దాదాపు 20 ఏళ్ల మినరల్ డీలర్ లైసెన్సు తీసుకున్నారు.రఫ్ గ్రానైట్ బ్లాక్‌ల కటింగ్, పాలిషింగ్ తదితర కార్యక్రమాలను వీరి ఇండస్ట్రీ చేపడుతుంది. క్వారీల నుంచి గ్రానైట్ బ్లాక్‌లను అధికారికంగా అనుమతి తీసుకుని తమ ఇండస్ట్రీకి రవాణా చేసుకోవాల్సి ఉంది. కానీ వీరి ఇండస్ట్రీలో అందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయని అధికారుల తనిఖీల్లో తేలింది. 172.87క్యూబిక్ మీటర్ల బరువైన 23 బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టుగా తేల్చారు. దీనివిలువ అపరాధ రుసుంతో కలిపి రూ.6 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం. ఇప్పటివరకూ వీరి ద్వారా రూ.11,43,29,120 మేర అక్రమాలు జరిగాయి. మరో రూ.3,18,72,960 మేర జీఎస్టీ చెల్లించకుండా ఎగ్గొట్టారు. అ«ధికారం లేకపోయినా అధికారులు కళ్లుగప్పి అక్రమ రవాణాకు పాల్పడ్డారంటే ఈ నాయకుడి ఫ్యామిలీ ఎంత బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన నేర చరిత్ర చాంతాడంతఆయన మాట కాదన్నవారు ఎవరైనా అదృశ్యమైపోతారు. కారణం మాత్రం ఇప్పటికీ చిదంబర రహస్యం. తొలుత బెదిరింపులు.. ఆ తర్వాత దౌర్జన్యాలు.. అప్పటికీ లొంగకపోతే సామాజిక, గ్రామ బహిష్కరణలు..ఇంకా వినకపోతే దాడులు చేయడం ఇక్కడ పరిపాటి. ఈఎస్ఐ స్కామ్‌లోనూ కీలకంగా మారి... టీడీపీ అధికారంలో ఉండగా మంత్రి హోదాలో ఈయన చేసిన ఈఎస్ఐ స్కామ్ జిల్లాకే మాయని మచ్చగా మారింది. అడ్డొచి్చన అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150 కోట్లకు పైగా జరిగిన స్కామ్‌లో సూత్రధారిగా నిలిచారు. మందు బిల్లులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో సొమ్ము నొక్కేశారు.బినామీలను తెరపైకి తెచ్చి నామినేటెడ్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల విలువైన మందులు, పరికరాలను యథేచ్ఛగా కొనుగోలు చేసి నచి్చనట్టుగా బిల్లులు చేసేసుకున్నారు. ఈ బండారం కాస్తా విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు, పనులు నామినేషన్‌పై అప్పగించాలని మంత్రి హోదాలో ఆ నాయకుడు ఇచి్చన సిఫారసు లేఖతో మొత్తం గుట్టు రట్టు అయింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. వీటన్నింటిపైనా పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. నమోదైన కేసుల వివరాలు► అవినీతి నిరోధక శాఖ క్రైమ్ నంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అధికారులు కేసు నమోదు చేశారు. ► 2008 ఆగస్టు 11న కోటబో మ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద మూడో విడత పింఛన్ల పంపిణీని అడ్డుకున్నందుకు ఎఫ్ఐఆర్ నంబర్ 150/2008 ప్రకారం 354, 323, 506(1) అండ్ (2) రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం మహిళను అవమానపరిచేలా ప్రవర్తించి, గాయపర్చి, బెదిరించినందుకు తదితర కారణాలతో కేసులు నమోదయయ్యాయి. ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి ప్రచారానికి వెళ్లిన ఆయన్ను అడ్డుకున్న మహిళపై దారుణంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై నౌపడ పోలీస్‌స్టేషన్‌లో మహిళలు ఫిర్యాదు చేయగా, 341, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత వారిని బెదిరించి రాజీ యత్నాలు చేశారు. ► 2021 ఫిబ్రవరిలో నిమ్మాడలో కింజరాపు అప్పన్న అనే వ్యక్తి సర్పంచి స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఆ నాయకుడి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 44/2021 ప్రకారం 147, 148, 307, 324, 506, 341, 384, 188 రెడ్ విత్ 149 ఐపీసీ, సెక్షన్ 123 ఆఫ్ దీ పీపుల్ రిప్రజెంట్ చట్టం, సెక్షన్ 212 ఆఫ్ ద ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1995 కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఆ సమయంలో 14 రోజులు రిమాండ్‌లో ఉన్నారు. ఇవిగాకుండా మరెన్నో కేసులు ఆయనపై నమోదై ఉన్నాయి. -
టీడీపీతో బీజేపీ పొత్తు ప్రశ్నేలేదు: సునీల్ దేవధర్
న్యూఢిల్లీ: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే సొంత పార్టీపై విశ్వాసం లేదని ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీకి తాళం పడింది.. త్వరలోనే ఆంధ్రాలోనూ తాళం పడబోతోందని అచ్చెం నాయుడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. టీడీపీతో .. బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలుగు దేశం పార్టీ.. ఒక కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ .. దానికి ఒక దిశ, దశ లేదని విమర్శించారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి ఓటువేయ్యాలని తమ కార్యకర్తలకు చెప్పారని తెలిపారు. కాంగ్రెస్.. టీడీపీల మధ్య లోపాయకారి ఒప్పందం కొనసాగుతుందని పేర్కొన్నారు. బీజేపీలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, కో ఇన్‌చార్జ్‌లే.. హైకమాండ్‌కు ప్రతినిధులన్నారు. మా జాతీయ నాయకత్వానికి మేమే కళ్లు, చెవులని పేర్కొన్నారు. హైకమాండ్ అభిప్రాయమే.. నేను చెబుతున్నానని ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ తెలిపారు. -
ఈఎస్ఐ స్కాం: త్వరలోనే చార్జ్‌షీట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన 150 కోట్ల ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మాజీ మంత్రి పితాని తనయుడితో పాటు మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా కాల్ సెంటర్లో చూపించిన కాల్స్ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు. ఈ విషయం గురించి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ కాల్స్‌ని లిస్ట్‌లో చూపించి బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో తొమ్మిది మందికి సంబంధించి ఈ కేసులో ఆధారాలు సేకరించామని తెలిపారు. త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని , నిందితుల సంఖ్య కూడా ఇరవై ఐదుకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో మందులు, సర్జికల్, ల్యాబ్, మెడికల్, ఫర్నిచర్ కొనుగోలులో జరిగిన అవినీతిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. మందులు కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలను పాటించలేదని తేలింది. నిర్ణీత ధర కంటే ఎక్కువ రేట్లకు మందులను కొన్నట్టు గుర్తించాం. రూ.103 కోట్లు విలువ చేసే మందులు నాన్ కాంట్రాక్టులో కొన్నారు. లక్ష పైన కొనే వాటిని ఈ ప్రోక్యూర్లో కొనాలి, అయితే డైరెక్టర్స్ అలా కాకుండా కొన్ని సంస్థలతో కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారు. ఈ టెండర్లు పక్కన పెట్టి 400 కోట్లకు కొనుగోళ్లు జరిపారు. ధనలక్ష్మి అనే ఉద్యోగిని కుమారుడు అమరావతి మెడికల్స్, తిరుమల మెడికల్స్ ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. వాటిని 2019 తర్వాత మూసేసిన్నట్లు గుర్తించాం’’ అని రవికుమార్ తెలిపారు. కింద ఆసుపత్రి నుంచి స్టాక్ ఆడిగితేనే మందుల సరఫరా జరగాలని.. అయితే డాక్టర్ జనార్దన్ అనే వ్యక్తి మాత్రం 4 కోట్లు విలువైన మందులు అవసరం లేకుండా కొన్నారని పేర్కొన్నారు. కొన్న మందులను ఏం చేశారో తెలీయదని, స్టాక్ బోర్డు లెక్కలు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రమోద్ రెడ్డి, నీరజ్ రెడ్డి అనే వ్యక్తులకు మంత్రి అచ్చెన్నాయుడు టెలీ సర్వీసెస్ పేరుతో కాంట్రాక్టు ఇప్పించారని రవికుమార్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు ముందస్తు బెయిల్ తీసుకొని విచారణ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసులో నిందితులందరినీ పట్టుకొని త్వరలోనే న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. -
ఏపీ ఈఎస్ఐలో కుంభకోణం
-
ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాల
సాక్షి: పరిపాలన, అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసనలు ఎగసిపడ్డాయి. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనేకచోట్ల మానవహారాలు నిర్వహించారు. మరికొన్నిచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి ప్రజలు తమ ఆగ్రహాన్ని చాటుకున్నారు. విశాఖ నగరంతో పాటు జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు ఉవ్వెత్తున సాగాయి. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును శాసన మండలిలో కుట్రపూరితంగా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఎన్ఏడీ, మద్దిలపాలెం జంక్షన్లలో పెద్దఎత్తున మానవహారాలు నిర్వహించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన విశాఖపైనే విషం కక్కుతున్న వెలగపూడి రామకృష్ణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంవీపీ కాలనీలోని ఆయన ఇంటివద్ద బుధవారం రాత్రే ఆందోళనలు మొదలయ్యాయి. గురువారం సాయంత్రం మరోసారి ప్రజలు భారీఎత్తున తరలివెళ్లి ముట్టడించారు. చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. తర్వాత ఆ బొమ్మను దహనం చేశారు. ఇక కొమ్మాది, చోడవరంలో, బుచ్చయ్యపేట మండలం వడ్డాది, రావికమతంలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. రోలుగుంట మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు. నక్కపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనకాపల్లిలో జరిగిన నిరసన ప్రదర్శనలో భారీఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. నర్సాపురంలో వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి, రాస్తారోకో చేశారు. తణుకు, అత్తిలి, ఇరగవరం, తాడేపల్లిగూడెంలలో చంద్రబాబువి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎమ్మెల్సీలు ఫరూక్ ఆఫీసు, బీటీ నాయుడు ఇల్లు ముట్టడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కర్నూలులో రాయలసీమ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ బి.సత్యన్న, న్యాయవాదుల జేఏసీ చైర్మన్ వై.జయరాజు ఆధ్వర్యంలో భారీఎత్తున ధర్నా నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తంచేశారు. నంద్యాలలో విద్యార్థి సంఘాలు ఎమ్మెల్సీ ఫరూక్ కార్యాలయాన్ని ముట్టడించాయి. అనంతరం చంద్రబాబు చిత్రపటాలను, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదోనిలో న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఇంటిని ముట్టడించి, ఆయన ఇంటి గేటుకు వినతిపత్రాన్ని అంటించి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మిగనూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు, నిండ్ర, ఐరాల మండలంలో పార్టీ నేతలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉత్తరాంధ్ర వెన్నుపోటుదారుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర వెన్నుపోటుదారుడు అచ్చెన్నాయుడు డౌన్..డౌన్.. అంటూ సాగిన నినాదాలతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మార్మోగింది. అమరావతి భూ మాఫియా కోసం ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగలవద్దని అచ్చెన్న సొంత నియోజకవర్గంలోనే ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. టెక్కలిలో పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి చంద్రబాబు, అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ధర్మపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో అర్ధనగ్న ప్రదర్శన అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధ నగ్నంగా ర్యాలీ నిర్వహిస్తూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ దిగజారుడు రాజకీయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, బాలకృష్ణ సీమ ద్రోహులని మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ మండిపడ్డారు. బాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ.. విజయనగరంలో చంద్రబాబు దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి కాళ్లతో కొడుతూ నిరసన వ్యక్తంచేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ నేతలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. అలాగే, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షం అడుగడుగునా ఆటంకాలు సృష్టించటం సమంజసం కాదని వైఎస్సార్సీపీ మహిళా విభాగం గుంటూరు నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి విమర్శించారు. వికేంద్రీకరణ అంశంపై చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ ఆయన చిత్రపటాన్ని మహిళలు పాదరక్షలతో కొట్టి నిరసన తెలిపారు. -
అడ్డంగా దొరికి.. పారిపోయి వచ్చారు
సాక్షి, అమరావతి : పక్క రాష్ట్రాలతో తమ ప్రభుత్వం సన్నిహితంగా మెలుగుతోందనే బాధ టీడీపీ నేతల్లో స్పష్టంగా కనబడుతోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడిన దాంట్లో సబ్జక్ట్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అందరికీ తెలిసిన విషయాలనే అచ్చెన్నాయుడు పదేపదే ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి రాత్రికి రాత్రి హైదరాబాద్‌నుంచి పారిపోయి వచ్చారంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆ భవనాలు ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయని, ఆ భవనాలకు మూడేళ్లుగా కరెంట్ బిల్లులు కూడా కట్టలేదని తెలిపారు. వాటిని ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలనే తెలంగాణకు ఇచ్చామన్నారు. సీఎం జగన్ పాలనలో రైతులకు పెద్దపీట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎలీజా వ్యాఖ్యానించారు. గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులకు సీఎం జగన్ పెద్దమొత్తంలో కేటాయింపులు చేశారని తెలిపారు. చింతలపూడి పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమని, చింతలపూడి ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రారంభించారని చెప్పారు. గత ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం విషయంలో అన్యాయం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక మంది నిర్వాసితులు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖలో కూడా భారీగా అవినీతి జరిగిందన్నారు. టీడీపీ అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు. నీరు-చెట్టు పథకంలో అక్రమాలు జరిగాయి: మనుగుంట గత టీడీపీ ప్రభుత్వంలో నీరు-చెట్టు పథకంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కందుకూరు సమస్యలను ప్రస్తావించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలింపు జరిగిందన్నారు. చెరువుల్లో నీళ్లు లేవని, కంప చెట్లతో నిండిపోయిందని అన్నారు. చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. మధ్య,చిన్న తరహా చెరువులపై దృష్టి సారించాలని కోరారు. తెలుగుగంగ ప్రాజెక్టును వైఎస్సార్ వరంలా ఇచ్చారు తెలుగుగంగ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజేశేఖరరెడ్డి గూడూరుకు వరంలా ఇచ్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గూడూరు బ్యారేజీ ఎత్తు పెంపును పరిశీలించాలని కోరారు. తెలుగుగంగ ప్రతి ఒక్క చెరువుకు వెళ్లే విధంగా స్వర్ణముఖి నదిని అభివృద్ధి పరచటానికి 3టీఎంసీ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
అచ్చెన్నాయుడు ఇంకా మారలేదు: శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించినా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇంకా మారలేదని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఏపీలో గత ఐదేళ్లు టీడీపీ పాలన దుర్మార్గంగా సాగిందని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం కాంట్రాక్టుల కోసం పనిచేసిందనీ, ఏ ప్రాజెక్టునూ పూర్తిచేయకపోగా, వేలకోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా టీడీపీనే అధికారంలో ఉన్నట్లు వైసీపీ సభ్యులు భ్రమ పడుతున్నారనీ, దాని నుంచి బయటకు రావాలని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై శ్రీకాంత్ రెడ్డి ఈ మేరకు స్పందించారు. -
అనుచిత వ్యాఖ్యలపై కలకలం
వైఎస్సార్సీపీపై మంత్రి అచ్చెన్నాయుడు అసంబద్ధ వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి ఒక మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు గురువారం సభలో కలకలం రేపాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీనిపై చ ర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షసభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విపక్ష నేత జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమైన అంశమైనందున రేపు(శుక్రవా రం) సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఎజెండాలో పెట్టామని చెప్పి ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపడుతున్నట్టు స్పీకర్ ప్రకటించిన తరుణంలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని... తానొక మంత్రిగా కాకుం డా ఓ సభ్యునిగా మాట్లాడుతున్నానంటూ.. ‘మీ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అని కాకుండా సైకో పార్టీగా పేరు పెట్టుకోండి’ అని అసంబద్ధ వ్యాఖ్య చేశారు. దాంతో విపక్ష సభ్యులు భగ్గుమన్నారు. పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ... ఆ మంత్రికి సైకో అంటే అర్థం తెలుసా? ఈ అన్‌పార్లమెంటరీ భాషేమిటని స్పీకర్‌ను నిల దీశారు. స్పీకర్ స్పందిస్తూ అసభ్య పదజాలం ఉంటే రికార్డుల్లోకి వెళ్లదన్నారు. విపక్షసభ్యులు మంత్రితో క్షమాపణ చెప్పించాలన్నారు. వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్ ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీడీపీ సభ్యుల ప్రవర్తనను ఆక్షేపించారు. ‘ఒక మంత్రిగారు లేచి సభను కావాలని పక్కదోవ పట్టించేందుకు మీపార్టీ సైకో అంటే దాని మీద ఈవేళ మాట్లాడవలసి వస్తోంది. ఆ మాటలపై వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పటికీ చెప్తున్నా.. వాళ్లు ఎత్తుగా, భద్రంగా ఉండి.. వాళ్ల పార్టీ అధ్యక్షుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారున్నారో ఆయన పెద్ద పెద్ద కళ్లతో చూసి వేలు ఇలా, ఇలా పైకి ఎత్తి చూపిస్తూ భయపెట్టిస్తూ మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. రౌడీ ముఖ్యమంత్రి, రౌడీ శాసనసభ్యులు(వాళ్ల పార్టీ తరఫున ఉన్న వారిలో) ఏమేమి చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. రౌడీచేష్టల్నీ ప్రజలు బాగా చూస్తున్నారు. జనం కచ్చితంగా మొటిక్కాయలు వేస్తారు’ అని జగన్ అన్నారు. రౌడీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఖండన అనంతరం స్పీకర్ జీరోఅవర్‌ను చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ దశలో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అడ్డుతగిలి రౌడీ ముఖ్యమంత్రి, రౌడీఎమ్మెల్యేల వంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తప్పు చేసింది టీడీపీ మంత్రే: వైఎస్ జగన్ ఆ తర్వాత జగన్ మాట్లాడుతూ... ‘తప్పు చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి. అదేపనిగా రెచ్చగొట్టడానికి సభ సమయాన్ని వృధా చేయడం కోసం ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి తన(మంత్రి) నోట్లో నుంచి ప్రతిపక్షపార్టీని, ఎమ్మెల్యేలను ఉద్దేశించి సైకోపార్టీ ఎమ్మెల్యేలని, సైకోపార్టీ అంటారు. అటువంటి రౌడీచేష్టల్ని ప్రజలు హర్షించరని అంటే అదేదో తప్పన్నట్టుగా, అదేదో తప్పు చేస్తాఉన్నట్టుగా.. మళ్లీ దాన్నే పట్టుకుని బాబు ఇదే అసెంబ్లీలోనే.. టీవీలు, అందరూ చూస్తుండగానే పెద్దపెద్ద కళ్లు చేసి వేలు ఇలా చూపిస్తూ, చూపిస్తూ రౌడీ మాదిరిగా తాను బెదిరించినా... దాన్నీ ప్రజలు చూస్తున్నారని అంటే అది కూడా మాదే తప్పు అన్నట్టుగా సభలో మాట్లాడుతున్నారు’ అని అంటుండగా స్పీకర్ మైకు కట్ చేసి జీరో అవర్‌ను చేపట్టారు. -
'సెక్షన్ 8 పై రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తాం'
హైదరాబాద్: పుష్కరాల నేపథ్యంలో వారానికోసారి కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పుష్కరాలకు కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల హైకోర్టు జడ్జిలను ఆహ్వానిస్తామన్నారు. సెక్షన్ 8, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. ఆగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతిపథకానికి ఆధార్‌ను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఆక్టోబర్ 22 న పోలవరం నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వనిస్తామని తెలిపారు.