
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించినా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇంకా మారలేదని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఏపీలో గత ఐదేళ్లు టీడీపీ పాలన దుర్మార్గంగా సాగిందని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం కాంట్రాక్టుల కోసం పనిచేసిందనీ, ఏ ప్రాజెక్టునూ పూర్తిచేయకపోగా, వేలకోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా టీడీపీనే అధికారంలో ఉన్నట్లు వైసీపీ సభ్యులు భ్రమ పడుతున్నారనీ, దాని నుంచి బయటకు రావాలని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై శ్రీకాంత్ రెడ్డి ఈ మేరకు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment