దేశద్రోహులను ఏరేస్తాం | BJP Leader Sunil Deodhar Questions KCR Over Citizenship Amendment Act | Sakshi
Sakshi News home page

దేశద్రోహులను ఏరేస్తాం

Published Sat, Jan 4 2020 1:31 AM | Last Updated on Sat, Jan 4 2020 8:08 AM

BJP Leader Sunil Deodhar Questions KCR Over Citizenship Amendment Act - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: దేశ ద్రోహానికి పాల్పడితే సహించేది లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవదర్‌ అన్నారు. దేశంలో ఉన్న పాకిస్తానీ, బంగ్లాదేశ్‌ ముస్లింలను కచ్చితంగా దేశం నుంచి పంపించేస్తామని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) అవగాహన సదస్సు పేరుతో శుక్రవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మతం పేరుతో రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాగా, సీఏఏను టీఆర్‌ఎస్‌ ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ చెప్పే కారణాలు తప్పని రుజువు చేస్తానన్నారు. మీరు చెప్పే కారణాలు సరైనవేనని రుజువు చేస్తే తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తానని, దీనికి కేసీఆర్‌ సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఈ సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement