సాక్షి, తిరుమల: బీజేపీ నేషనల్ సెక్రటరీ సునీల్ ధియోదర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడాలని, త్వరగా వ్యాక్సిన్ రావాలని కలియుగ దైవం వేంకటేశ్వరున్ని కోరుకున్నాను. ప్రజలకు సేవలందిస్తున్న ప్రధాని, హోమ్ మంత్రి ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నాను. (ఏపీలో కొత్త చరిత్ర)
సహజసిద్ధంగా శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే ఎర్రచందనం మొక్కలు పెరుగుతాయి. ఎర్రచందనం స్వామి వారి సంపద, కానీ కొందరు స్మగ్లర్లు శతాబ్ధాలుగా వాటి ద్వారా అక్రమంగా ధనార్జన చేస్తున్నారు. ఎర్రచందనం రక్షణ కోసం సెంట్రల్ ఫోర్స్ ఇవ్వాలని ఏపీ సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. ఏడు కొండలని, ఎర్రచందనంను కాపాడాలని పీఎం నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు' సునీల్ ధియోదర్ తెలిపారు.
తిరుమల శ్రీవారి సేవలో సునీల్ ధియోదర్
Published Wed, Oct 28 2020 10:17 AM | Last Updated on Wed, Oct 28 2020 11:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment