venkateswara swamy temple
-
తిరుపతి తొక్కిసలాట : హృదయ విదారక దృశ్యాలు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలులో ఆకట్టుకుంటున్న ప్రదర్శన శాల (ఫొటోలు)
-
కాకినాడలో మాజీ MLA ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పూజలు
-
నిలువెత్తు నిదర్శనం
పూనా పట్టణం నుంచి ఓ పత్రికా విలేఖరి స్వామిని చూడాలని తిరుమల కొండకు బయలుదేరాడు. స్వామి వారి దర్శన సమయానికి వైకుంఠం వద్దకు చేరాడు. అక్కడి శ్రీవారి సేవకులు దర్శన టికెట్ చూసి ‘క్యూ’ లోకి పంపుతున్నారు. విలేఖరి ముందు ఓ ఆరు పదులు పైబడిన వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమెకు తోడుగా పన్నెండేళ్ళ మనవడు కూడా వచ్చి ఉన్నాడు. ఆమె తన సంచిలోని టికెట్ చూపడానికి చాలా అవస్థలు పడుతూ ఉంది. పత్రికా విలేఖరి ఆమెకు సహాయం చేశాడు. ముగ్గురూ క్యూలోకి ప్రవేశించారు. ఆ రిటైర్డ్ టీచర్ కి మోకాలి నొప్పులు ఎక్కువగా ఉండటంతో కష్టంగా నడుస్తోంది. మాటల్లో ఆమె రిటైర్డ్ టీచర్ అని, వారిది తమిళనాడు ఈరోడ్ అని తెలిసింది.‘‘నడవటానికి ఇంత కష్ట పడుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా?’’ అని అడిగాడు విలేఖరి. ‘‘మోకాలి చిప్పలు బాగా అరిగి పోయాయి. రెండు కాళ్ళకూ ఆపరేషన్ అవసరమన్నారు డాక్టర్లు. ఇంటి వ్యవహారాల వల్ల కుదరక ఆపరేషన్ చేయించుకోలేదు’’ అని చెప్పింది. కొద్దిదూరం నడిచాక, సెక్యూరిటీ వారు చెకింగ్ చేయసాగారు. అక్కడ ఆమె చక్కగా నిలబడలేక తూలి పడబోయింది. పక్కనే ఉన్న మనవడు ఆమెను కింద పడనీయకుండా పట్టుకున్నాడు. అందర్నీ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లో కూర్చోమన్నారు. మంచి గాలి, వెలుతురు వచ్చే ప్రదేశం చూసి కూర్చున్నాడు విలేఖరి. కుంటుకుంటూ వస్తున్న రిటైర్డ్ టీచర్ కి, ఆమె మనవడికి కూడా స్థలం పెట్టి పెట్టాడు. అభిమానంగా కూర్చోమని స్థలం చూపాడు. ఆమె కూర్చోలేదు. మనవడు మాత్రం కూర్చున్నాడు.‘‘కొద్దిసేపు కూర్చుంటే అలసట తగ్గుతుంది, మీ మోకాలి నొప్పులు కూడా తగ్గుతాయి’’ అని చె΄్పాడు. ‘‘ఫర్లేదు!’’ అని చెప్పి నిలబడే ఉంది. గంట గడిచింది. కంపార్ట్ మెంట్ గేటు తీయలేదు. మరో గంట గడిచింది. అప్పుడు తీశారు. జనం పోలో’మని పరుగులు తీశారు. ఆ రెండు గంటలూ మోకాలి నొప్పులకి ఆమె బాధ పడుతూనే నిలబడి ఉంది. చిన్నగా మోకాళ్ళను అప్పుడప్పుడూ అదుముకుంటూ నడుస్తోంది.ఆమె తను చెప్పినట్లు కూర్చోక పోవడం విలేఖరికి నచ్చలేదు. ‘రెండు గంటలు నిలబడుకోవాల్సిన అవసరం ఏముంది. కూర్చుని ఉండవచ్చు కదా!’ అనుకున్నాడు. వాళ్ళకి దూరంగా జరిగి జనంతో పాటు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకో మనస్కరించలేదు. వారితో పాటే నడవసాగాడు. తిరుమల నంబి ఆలయం వద్ద ఉండే మూవింగ్ బ్రిడ్జి దగ్గరికి వచ్చింది క్యూ లైను. తట్టుకోలేని నొప్పితో బాధ పడుతోంది ఆ రిటైర్డ్ టీచర్. ధైర్యం చెబుతున్నాడు మనవడు. అక్కడ కొద్దిసేపు కూర్చునే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఆమె కూర్చోలేదు. అలా ఇబ్బందిగా నడుస్తూనే మహా ద్వారం దాటి, ధ్వజ స్తంభానికి నమస్కరించి బంగారు వాకిలి గుండా లోపలికి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు.ఉచిత లడ్డూ ప్రసాదం తీసుకుని గుడి బయటికి వచ్చాక పుష్కరిణి వద్ద కూర్చుని అవ్వా మనవడు లడ్డు తింటూ ఉన్నారు. వారితో పాటు ఉన్న విలేఖరి ‘‘వైకుంఠం నుంచి, దర్శనం పూర్తయ్యేంతవరకు మీరు ఎందుకుకూర్చోలేదు?’’ అని అడిగాడు ఆమె గుడివైపు తిరిగి చేతులెత్తి నమస్కరిస్తూ ‘‘పెరుమాళ్ళు వేంకటేశ్వర స్వామి కొన్ని వేల సంవత్సరాలుగా అలా గర్భగుడిలో మన కోసం నిలబడే ఉన్నాడు. స్వామి వారి దర్శనం కోసం వచ్చినప్పుడు మనం కూర్చోవడం భావ్యం కాదు కదా’’ అని సమాధానమిచ్చింది. ఆమెకు స్వామి వారి పట్ల ఉన్న భక్తి, గౌరవం, నమ్మకానికి విలేఖరి కళ్ళు తడి అయ్యాయి. ‘స్వామీ... ఎన్ని బాధలో మనిషికి. లిప్తకాలం నిన్ను చూస్తే... ఎంత ఉపశమనమో కదా’ అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
పిట్స్ బర్గ్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వైభవంగా శ్రీ లక్ష్మీ నారాయణ హోమం
-
మారిషస్ : 108 అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహం (ఫొటోలు)
-
శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఆర్జిత సేవ
-
శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుపతి: తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న 83,825 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా.. 25,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.57 కోట్లుగా లెక్క లేలిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
పిట్స్ బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
నేడు కోనాయిపల్లికి కేసీఆర్
సాక్షి, సిద్దిపేట/నంగునూరు: ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఈ ఆలయం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సెంటిమెంట్. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి వస్తున్నారు. వేంకటేశ్వరస్వామి వద్ద ఆ పత్రాలను ఉంచి పూజలు చేశాక వాటిపై సంతకాలు చేయనున్నారు. వారు ఈ నెల 9న ఆలయానికి రానున్నట్టు ప్రకటించినా ముందుగానే వస్తున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శుక్రవారంతో ముగిసింది. దీంతో ముందుగానే కోనాయిపల్లి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నెల 9న కేసీఆర్ తన నామినేషన్లను దాఖలు చేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. -
కమనీయంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు
-
బ్రహ్మోత్సవాల్లో పుష్పాలంకరణ మరింత ప్రత్యేకం
-
శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక నిజాలు..!
-
వాడపల్లి వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి
-
ఋషికొండపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
నామాలగుండు వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
-
ఆధ్యాత్మిక కేంద్రంగా కాకినాడ.. సీఎం జగన్ కీలక నిర్ణయం
-
Kushaiguda: గుడిలో చోరీకి యత్నించి ప్రాణాలు కోల్పోయిన దొంగ
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గుడిలో చోరీకి యత్నించిన దొంగపై వాచ్మెన్ దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రంగయ్య (60) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఓ యువకుడు చోరీ కోసం గుడిలోకి ప్రవేశించాడు. ఆలయంలోకి వచ్చిన దుండగుడు గర్భగుడిలోని హుండీ దగ్గరకు వెళ్లి దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన రంగయ్య వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతను వాచ్మెన్పై రాళ్లతో దాడికి దిగాడు. దొంగను అడ్డుకునేందుకు వాచ్మెన్ కూడా దగ్గర ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో దొంగ తలకు బలంగా దెబ్బ తగలడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు. ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు, పోలీసులు మృతదేహం చూసి భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటహుటిన ఆలయానికి చేరుకున్న పోలీసులు మృతుడిని పరిశీలించగా.. అతని ఫోన్ దొరికింది. ఫోన్లోని ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు గండం రాజు (23)గా గుర్తించారు. రాజు స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లిగా తెలిపారు. పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. -
కాళ్లకూరులో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు
కాళ్ల(పశ్చిమగోదావరి): కాళ్లకూరులో వేంచేసియున్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామిని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చదవండి: శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్ ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ గురుపౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎంతో మహిమగల కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరస్వామిని ఏటా దర్శించుకునేందుకు వస్తుంటానన్నారు. అనంతరం త్రివిక్రమ్ దంపతులను ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. -
కృష్ణా తీరంలో కొలువైన తిరుమలేశుడు.. (ఫోటోలు)
-
కృష్ణా తీరంలో తిరుమలేశుడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, అమరావతి/తాడికొండ: కృష్ణాతీరంలో తిరుమలేశుడు కొలువయ్యాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేశస్థానం నిర్మించిన ఆలయంలో భక్తులకు శ్రీవేంకటేశుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో గురువారం ఉదయం మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరిగింది. ఉదయం 7.50 నుంచి 8.10 గంటల నడుమ టీటీడీ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు పుణ్యాహవచనం, కుంభారాధన, నివేదన, హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 6.30 నుంచి 7.15 గంటల వరకు విమాన గోపుర కలశ ఆవాహన చేశారు. అనంతరం ఆగమోక్తంగా ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం బ్రహ్మఘోష, వేదశాత్తుమొర జరిగాయి. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాల స్థలంలో టీటీడీ రూ.31 కోట్లతో ఈ ఆలయం నిర్మించింది. ఆలయం శిల్పకళ అద్భుతం : స్వరూపానందేంద్ర సరస్వతి ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరిక మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంతో రాజధాని అమరావతిలో మరింతగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని అన్నారు. వైఖానస ఆగమానుసారం అద్భుతమైన శిల్ప కళతో ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్నే వచ్చాడా అన్నట్లుగా ఉందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం ప్రత్యేకంగా ఉన్నదని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో 1,300 ఆలయాలు : వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల విశాఖ, ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలు ప్రారంభించినట్లు చెప్పారు. జమ్మూలో 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో 500 ఆలయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్లలో 1,300 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అమరావతిలోనే స్వామి వారి దర్శనం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మనందరినీ ఆశీర్వదించడానికి స్వామివారు తిరుమల నుండి ఇక్కడికి వచ్చారన్నారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వెళ్లే భక్తులకు అమరావతిలోనే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, ఎంపీ నందిగం సురేష్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టినా, బోర్డు సభ్యులు బుర్రా మధుసూదన్‌యాదవ్, మల్లాడి కృష్ణారావు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్‌ను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణదారులను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు సన్మానించారు. సాయంత్రం కార్యక్రమాలు.. ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగాయి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు. చదవండి: (చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?) -
వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం కలిశారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ అందజేశారు. చదవండి: సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి ఈ సందర్భంగా సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ వేద పండితులు.. వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ వెంట జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్‌వో నరసింహ కిశోర్, చీఫ్ ఇంజనీర్ డి.నాగేశ్వరరావు ఉన్నారు. ఈ నెల 4 నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
వైకుంఠ ఏకాదశికు సర్వం సిద్ధం