
సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనం కోసం నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి పోలీసులకు చిక్కాడు ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఖమ్మం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. శ్రీవారి దర్శనం కోసం బుధవారం తిరుమలకు వెళ్లిన అరుణ్ కుమార్... తాను ఐపీఎస్ నంటూ జేఈవో కార్యాలయానికి వచ్చి ప్రోటోకాల్ దర్శనం అడిగాడు. అధికారుల విచారణలో అతను ఐపీఎస్ అధికారి కాదని తేలింది. దీంతో జేఈఓ కార్యాలయం అధికారులు విజులెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దర్శనానికి వెళ్తున్న అరుణ్‌కుమార్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమల పోలీసులు.. అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. అరుణ్‌కుమార్ గతంలో పలువురు రాష్ట్ర మంత్రుల వద్ద ఓయస్డిగా పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment