నేత్రపర్వం.. సహస్రదీపాలంకరణ
భీమవరం : భీమవరం రెండో పట్టణ æపరిధి జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ పద్మావతి వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వాడపల్లి ఆదినారాయణాచార్యుల ఆధ్వర్యంలో ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో సహస్ర దీపాలంకరణ జరిపారు. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహ«ణాధికారిణి ఆర్.గంగాశ్రీదేవి, ఆలయ వంశపారంపర ్య ధర్మకర్త మంతెన రామ్‌కుమార్ రాజు పర్యవేక్షించారు.