తిరుపతి : చంద్రగహణం కారణంగా జనవరి 31న తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నట్టు చెప్పారు.. రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలను అధికారులు నిర్వహించనున్నారు. రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు.
చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదాల వితరణను కూడా టీటీడీ నిలిపివేస్తుంది. వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. 300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు కూడా టీటీడీ తెలిపింది. ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అదే రోజున(జనవరి 31న) రామకృష్ణ తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. శేషాచలగిరుల్లో నెలవైన పుణ్యతీర్థాల్లో శ్రీరామకృష్ణ తీర్థం ఒకటి. రామకృష్ణ తీర్థానికి భక్తులు భారీగా తరలిరానున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment