chandragrahanam
-
28న పాక్షిక చంద్రగ్రహణం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్: ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం కవాట బంధనం (తలుపులు మూసివేయడం) చేయనున్నట్లు పేర్కొంది. 29న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేపట్టి 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 29న సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చనను రద్దు చేశారు. శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణాలు యథావిధిగా జరగనున్నాయి. 28న శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలాలయ ద్వారాలు 28న సాయంత్రం 5 గంటల నుంచి 29న ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. 29న ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభిస్తారు. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకే సర్వదర్శనం, మధ్యాహ్నం 12.30 గంటల వరకే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. సర్వదర్శనానికి ఉదయం మాత్రమే అవకాశం ఉంటుంది. 28న అన్నప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని..ఆ రోజు సాయంత్రం అల్పాహార వితరణ నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. -
తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం
తిరుమల/సింహాచలం/శ్రీశైలం టెంపుల్/శ్రీకాళహస్తి: పాక్షిక చంద్ర గ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూతబడ్డ ప్రధాన ఆలయాలన్నీ గ్రహణం విమోచానంతరం సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు పూర్తయ్యాక తెరుచుకున్నాయి. రాహుకేతువులకు నిలయమైన శ్రీకాళహస్తీవ్వరాలయంలో మాత్రం స్వామిఅమ్మవార్లకు గ్రహణ కాలాభిషేకాలు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8.20 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉ.8.40 గంటలకు ఆలయం తలుపులు మూసివేశారు. రాత్రి 7.20 గంటలకు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. అలాగే, రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. విశాఖ జిల్లా సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి పూజాదికాలు నిర్వహించారు. ఇక్కడ బుధవారం ఉ.6.30 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ఇక శ్రీశైల ఆలయంలో రాత్రి 8 గంటల నుంచి అలంకార దర్శనాన్ని మాత్రమే భక్తులకు కల్పించారు. శ్రీకాళహస్తిలో గ్రహణ కాలాభిషేకాలు మరోవైపు.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా భక్తులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతబడినప్పటికీ ఇక్కడి స్వామిఅమ్మవార్లకు గ్రహణ కాలాభిషేకాలు చేశారు. దీంతో దేశం నలుమూలల నుంచి స్వామివారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. సహస్ర లింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శాంతి అభిషేకాలు జరిపారు. రష్యా భక్తులు కూడా రాహు–కేతు పూజలు చేయించుకుని మురిసిపోయారు. -
Lunar Eclipse 2022: దేశవ్యాప్తంగా వీడిన చంద్రగ్రహణం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం వీడింది. కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, మరికొన్ని నగరాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5:40 నిమిషాల నుంచి చంద్రగ్రహణం కనిపించింది. మొత్తంగా 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమై సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. దేశవ్యాప్తంగా గ్రహణ సమయం ముగియడంతో మూతపడిన ఆలయాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నాయి. మళ్లీ మార్చి 14, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇక ఇదిలా ఉంటే, ఒడిశాలో మాత్రం గ్రహణం ఉద్రిక్తతలకు దారితీసింది. హేతువాదులు, భజరంగ్‌దళ్ కార్యకర్తల మధ్య రగడ జరిగింది. చంద్రగ్రహణం రోజున చికెన్ బిర్యానీ ఫెస్టివల్ నిర్వహించడంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
నేడు ఉదయం 7 గంటల వరకే దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): చంద్రగ్రహణం కారణంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయాలతోపాటు ఉపాలయాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల వరకే దర్శనానికి అనుమతిస్తారు. ఎనిమిది గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. గ్రహణ మోక్షకాలం అనంతరం సాయంత్రం 6.30గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి శుద్ది, అమ్మవారికి స్నపనాభిషేకం, అర్చన, మహానివేదన, హారతులను ఇచ్చి ఆలయ ద్వారాలను తిరిగి మూసివేస్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమాలను మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన నుంచి సాయంత్రం పంచహారతులు వరకు అన్ని సేవలను రద్దు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి అన్ని ఆర్జిత సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఆలయ వైదిక కమిటీ తెలిపింది. -
8న 11 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: చంద్ర గ్రహణం కారణంగా నవంబర్ 8న ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా 8న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో 7న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా 8న శ్రీవాణి,రూ.300 దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసి సర్వదర్శనానికి అనుమతిస్తారు. భక్తజనరంజకంగా ‘బాలకాండ’ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం 13వ విడత బాలకాండ అఖండ పారాయణం జరిగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల సమక్షంలో బాలకాండలోని 61 నుంచి 65 సర్గల వరకు ఉన్న 137 శ్లోకాలను, యోగవాసిష్టం– ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలనూ పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు. సర్వ దర్శనానికి 38 గంటలు తిరుమలలో 31 క్యూ కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. సర్వదర్శనానికి 38 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 82,604 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 37,025 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.5.57 కోట్లు వేశారు. శ్రీవారి సేవలో ప్రముఖులు శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రాజేశ్వరరావు, తెలంగాణ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఏపీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సతీమణి లక్ష్మి రవి దర్శించుకున్నారు. -
ఈ నెల 8న చంద్ర గ్రహణం.. శ్రీవారి ఆలయం మూత..
తిరుమల: ఈ నెల 8న చంద్ర గ్రహణం కారణంగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఆ రోజున బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను, తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం–2 నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 8న మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆ రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. రాత్రి 8.30 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. సర్వ దర్శనానికి 30 గంటలు తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. 31 క్యూ కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 30 గంటలు, రూ.300 దర్శనానికి 3 గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 68,995 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 29,037 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.3.71 కోట్లు వేశారు. తిరుమలలో గురువారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా, శ్రీవారిని గురువారం సినీ నటుడు అల్లు శిరీష్ దర్శించుకున్నారు. 5న డయల్ యువర్ ఈవో డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఈ నెల 5న శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఫోన్లో తెలపవచ్చు. ఇందుకుగాను 0877–2263261 నంబర్‌ను సంప్రదించాలి. -
గ్రహణం రోజుల్లో శ్రీవారి ఆలయం మూత
తిరుమల: ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. అలాగే, నవంబర్ 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉన్న కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ రెండు రోజులూ ఆలయ తలుపులు తెరిచిన తరువాత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులను మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ రెండు రోజులూ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. గ్రహణం రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. హోటళ్లు కూడా గ్రహణం పూర్తయ్యే వరకు మూసి ఉంచుతారు. దీనికనుగుణంగా తిరుమల యాత్రను రూపొందించుకోవాలని భక్తులను టీటీడీ కోరింది. శ్రీవారి దర్శనానికి 30 గంటలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 32 క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 83,223 మంది శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. 36,658 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించారు. దర్శనానికి 30 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలేశుని సేవలో ప్రముఖులు శ్రీవారిని మంగళవారం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాలతో సత్కరించారు. -
చంద్రగ్రహణం: తెలుగు రాష్ట్రాల్లో అలయాల మూసివేత
-
31న తిరుమల ఆలయం మూసివేత
తిరుపతి : చంద్రగహణం కారణంగా జనవరి 31న తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నట్టు చెప్పారు.. రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలను అధికారులు నిర్వహించనున్నారు. రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదాల వితరణను కూడా టీటీడీ నిలిపివేస్తుంది. వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. 300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు కూడా టీటీడీ తెలిపింది. ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అదే రోజున(జనవరి 31న) రామకృష్ణ తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. శేషాచలగిరుల్లో నెలవైన పుణ్యతీర్థాల్లో శ్రీరామకృష్ణ తీర్థం ఒకటి. రామకృష్ణ తీర్థానికి భక్తులు భారీగా తరలిరానున్నట్టు తెలుస్తోంది. -
చంద్రగ్రహణం
ఇన్పుట్ సబ్సిడీలో లోపించిన పారదర్శకత - టీడీపీ నేతల దయాదాక్షిణ్యాలపైనే మంజూరు - అస్మదీయులైతే పొలం లేకున్నా పరిహారం - జిల్లాలో రూ.వంద కోట్లకు పైగా గోల్మాల్ - భాగస్వాములవుతున్న వ్యవసాయాధికారులు - ఇన్సూరెన్స్ మంజూరులోనూ అన్యాయమే.. - ఆత్మకూరు మండలం సిద్ధలాపురానికి చెందిన ఎ.లక్ష్మిదేవికి సర్వే నెంబర్ 497–3ఏలో పొలం ఉన్నట్లు, అందులో ఆముదం సాగు చేసినట్లు.. ఈ పంటకు నష్టం వాటిల్లినట్లు రూ.13,600 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. నిజానికి ఈమెకు పొలం లేదు. ఇదే సర్వే నెంబర్ 497–3ఏలో అదే గ్రామానికి చెందిన కె.కవిత కూడా ఆముదం సాగు చేసి నష్టపోయినట్లు రికార్డులు సృష్టించారు. ఈమెకు రూ.13,600 పరిహారం మంజూరయింది. ఇంతటితో ఆగలేదు. ఇదే సర్వే నెంబర్(497–3ఏ)లో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి వెంకటేశులు కూడా ఆముదం సాగు చేసి నష్టపోవడంతో రూ.12,240 పరిహారం ఇచ్చారు. ఈయనకూ పొలం లేకపోవడం గమనార్హం. ఈ మండలంలో ఇలాంటి అనర్హులు వేల సంఖ్యలో ఉన్నారు. అయితే వీరికున్న అర్హత.. మంత్రి పరిటాల సునీత అనుచరులు కావడమే! - బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో లక్ష్మీదేవి అనే మహిళా రైతుకు 3.60 ఎకరాల పొలం ఉంది. ఈమె ఖాతాలో(నెంబర్:1163) రూ.3వేలు మాత్రమే జమ చేశారు. ఇదే గ్రామంలో డి.ఈశ్వరయ్య అనే మరో రైతు 2.74 ఎకరాల్లో(పట్టా నెంబర్.954–డి) పంటసాగు చేసి నష్టపోయారు. ఈయనకు రూ.6వేల ఇన్పుట్ సబ్సిడీ జమ చేశారు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు సూర్యనారాయణ 2.50 ఎకరాల్లో(పట్టా నెంబర్.955) పంటసాగు చేసి నష్టపోయారు. ఈయనకు రూ.3వేలు జమ అయ్యింది. ఎకరాకు రూ.6వేలు చొప్పున పరిహారం అందాల్సి ఉన్నా.. అలా జరక్కపోవడానికి వీరంతా అధికార టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలగకపోవడమేనని తెలుస్తోంది. - ఇదీ జిల్లాలో ఇన్పుట్ సబ్సిడీ తీరుతెన్ను. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ పూర్తిగా అధికార పార్టీ నేతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరుగుతోంది. ఇది ప్రభుత్వ సొమ్ము. నష్టపోయిన రైతులందరికీ దక్కాల్సిన పరిహారం అనే విషయాన్ని విస్మరించి అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు జీహుజూర్ అంటున్నారు. పొలం లేని వారికి సర్వే నెంబర్లు, ఖాతాలు సృష్టించి పరిహారం పంచుతున్నారు. పొలం ఉండి, పంటసాగు చేసి నష్టపోయిన వారితో చెలగాటం ఆడుతున్నారు. సాక్షిప్రతినిధి, అనంతపురం : గత ఏడాది ఖరీఫ్‌లో రైతులు 8.50లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ విస్తీర్ణానికి బ్యాంకర్లు పంట రుణం కూడా అందించారు. అధికారులు మాత్రం 7.17లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు తేల్చారు. ఇందులో 5.90లక్షల హెక్టార్లు వేరుశనగ, తక్కిన విస్తీర్ణంలో ఇతర పంటలు నష్టపోయినట్లు లెక్కగట్టారు. బ్యాంకర్లు వేరుశనగకు ఎకరాకు పెట్టుబడి రూ.19,500 అవుతుందని లెక్కగట్టి ఆ మేరకు రుణం మంజూరు చేశారు. ఈ లెక్కన జిల్లాలో సాగైన 6.02లక్షల హెక్టార్ల వేరుశనగకు రూ.2,954 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర పంటలకు మరో రూ.500కోట్ల మేర నష్టం సంభవించింది. ప్రభుత్వం 63 కరువు మండలాలను ప్రకటించింది. కానీ ఇన్పుట్ సబ్సిడీ మాత్రం రూ.1032.42కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అంటే.. రైతులకు ఎకరాకు 19,500 ఖర్చయితే, ప్రభుత్వం రూ.6వేలు మాత్రమే లెక్కగట్టింది. ఇది ప్రభుత్వం రైతులకు చేసిన మొదటి అన్యాయం. పోనీ ఆ మేరకైనా పరిహారం ఇస్తున్నారా? అంటే అదీ లేదు. ఆధార్ ‘లింకు’ పేరుతో మరో అన్యాయం ప్రతి రైతుకు 5ఎకరాల వరకూ పరిహారం ఇవ్వాలి. ఈ లెక్కన అత్యధికంగా రూ.30వేల వరకూ రైతులకు పరిహారం దక్కాలి. ఒక రైతుకు ఓ గ్రామంలో 2 ఎకరాల పొలం ఉండి, మరో గ్రామంలో మరో రెండు ఎకరాల పొలం ఉంటే నాలుగెకరాలకు పరిహారం అందాలి. కానీ ఒకే ఆధార్‌కార్డుతో రెండుచోట్ల పొలం ఉందనే కారణంతో పరిహారం ఎగవేస్తున్నారు. దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. టీడీపీ నేతలకైతే పొలం లేకున్నా సర్వే నెంబర్లు, ఖాతాలు సృష్టించి పరిహారం వేస్తున్నారు. ఇందులో వ్యవసాయాధికారులు పూర్తిగా అధికార పార్టీ చెప్పుచేతల్లో నడుచుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో గోల్మాల్ చేస్తున్నారు. నిజమైన రైతులుంటే వారికి హక్కుగా దక్కాల్సిన పరిహారాన్ని కూడా అందించని పరిస్థితి. ఇలా.. రూ.వంద కోట్లకు పైగా జిల్లాలో గోల్మాల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం రైతు కృతజ్ఞత యాత్ర పేరుతో చంద్రబాబును జిల్లాకు రప్పిస్తున్నారు. కృతజ్ఞత చెప్పాలనే ఆలోచన ‘అనంత’ రైతులెవ్వరికీ లేకపోయినా అధికార పార్టీనేతలు, కార్యకర్తలు పంటసాగు చేయకపోయినా కాసుల పంట పండుతుండటంతో వారు చంద్రబాబుకు కృతజ్ఞత తెలియజేసేందుకు బాబును పిలిపించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. బీమా మంజూరులో తిరకాసు 21.25లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేందుకు రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకు రికార్డులు చెబుతున్నాయి. ఈ విస్తీర్ణానికి రైతుల నుంచి ప్రీమియం వసూలు చేశారు. కానీ 15.05లక్షల ఎకరాల్లోనే పంట సాగయిందని వ్యవసాయాధికారులు క్రాప్‌బుకింగ్ రికార్డుల్లో పేర్కొన్నారు. ఇందులో 14.87లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లిందని బీమా కంపెనీ తేల్చింది. ఈ మొత్తానికి పరిహారం చెల్లించేందుకు బజాజ్ కంపెనీ జిల్లాకు రూ.419కోట్ల పరిహారాన్ని చెల్లిస్తోంది. నిజానికి రైతు తీసుకున్న రుణానికి ఇన్సురెన్స్ చేశారు. అంటే ఏ మేరకు రుణం తీసుకున్నారో, ఆ మేరకు బీమా మంజూరు కావాలి. ఈ లెక్క రూ.2,500కోట్లకు పైనే అవుతుంది. కానీ బీమా కంపెనీ కేవలం రూ.419కోట్లు మాత్రమే ఇస్తోంది. ఈ మొత్తాన్ని 14.87లక్షల ఎకరాలకు జమ చేస్తున్నారు. తక్కిన 6.37లక్షల ఎకరాలకు పరిహారం ఎవరు చెల్లించాలనేది ప్రశ్నార్థకం.