సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం వీడింది. కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, మరికొన్ని నగరాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5:40 నిమిషాల నుంచి చంద్రగ్రహణం కనిపించింది. మొత్తంగా 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమై సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.
గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. దేశవ్యాప్తంగా గ్రహణ సమయం ముగియడంతో మూతపడిన ఆలయాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నాయి. మళ్లీ మార్చి 14, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.
ఇక ఇదిలా ఉంటే, ఒడిశాలో మాత్రం గ్రహణం ఉద్రిక్తతలకు దారితీసింది. హేతువాదులు, భజరంగ్‌దళ్ కార్యకర్తల మధ్య రగడ జరిగింది. చంద్రగ్రహణం రోజున చికెన్ బిర్యానీ ఫెస్టివల్ నిర్వహించడంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment