breaking news
chandra grahan
-
బ్లడ్ మూన్.. వెరీ స్పెషల్..!
బ్లడ్ మూన్ హైదరాబాద్ ఆకాశాన్ని మాత్రమే కాదు, సోషల్ మీడియా వేదికలను కూడా ఆక్రమించింది. శాస్త్రీయ నిజాలు, మూఢనమ్మకాలు, యువత ట్రెండ్.. అన్నీ కలిపి నగరాన్ని బ్లడ్ మూన్ ముచ్చట్లతో ముంచెత్తాయి. వచ్చే బ్లడ్ మూన్ వరకూ హైదరాబాదీలు ఈ జ్ఞాపకాన్ని ఫొటోల రూపంలో, పోస్టుల రూపంలో ఆస్వాదిస్తూ మిగిలిపోతారు. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకూ జరిగిన చంద్ర గ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రుడు ఎర్రటి వర్ణంలో మెరిసిపోవడం వల్ల దీనిని ప్రజలు బ్లడ్ మూన్ అని పిలిచారు. సహజసిద్ధంగా ఏర్పడే ఈ ఖగోళ క్షణం హైదరాబాద్ నగరాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గ్రహణానికి గంటల ముందే ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్బుక్ వేదికలు హాష్‌ట్యాగ్‌లతో సందడి చేశాయి. కొందరు గ్రహణం ఫొటోలు పంచుకుంటే, మరికొందరు ‘బ్లడ్ మూన్ అంటే ఏమిటి?’ అనే గూగుల్ సెర్చ్‌లో మునిగిపోయారు. ఒక్క రాత్రిలోనే వేల పోస్టులు, వీడియోలు షేర్ కావడం గమనార్హం. ముఖ్యంగా యువత ఈ గ్రహణాన్ని ఫొటోషూట్లుగా మార్చుకుని #సెలనోఫైల్ #బ్లడ్ మూన్ వంటి హాష్‌ట్యాగ్‌లతో క్రియేటివ్‌గా ఎక్స్‌ప్రెస్ చేశారు. సైన్స్ వర్సెస్ మూఢనమ్మకాలు.. ఒకవైపు శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలు ఈ ఘటనకు వెనుక ఉన్న ఖగోళ శా్రస్తాన్ని వివరించగా, మరోవైపు సోషల్ మీడియాలో మూఢనమ్మకాలు విపరీతంగా చెక్కర్లు కొట్టాయి. ‘గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదు’, ‘ఆహారం తినకూడదు’ వంటి అపోహలను కొందరు జోరుగా ప్రచారం చేశారు. అయితే హైదరాబాద్‌లోని బీఎం బిర్లా ప్లానిటోరియం నిపుణులు, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైన్స్ రీసెర్చ్, ఐఐటీఎస్ శాస్త్రవేత్తలు ఈ గ్రహణం సహజ ఖగోళ సంఘటన అని, దీనికీ మన ఆరోగ్యం లేదా దైనందిన జీవితానికీ ఎటువంటి సంబంధం, ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ‘బ్లడ్ మూన్ కేవలం విజువల్ ఎఫెక్ట్ మాత్రమే. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రకృతి అందించే అద్భుత క్షణం’ అని వివరించారు. బ్లడ్ మూన్ అంటే? సాధారణంగా చంద్రుడు భూమి నీడలోకి వెళ్లినప్పుడు చంద్ర గ్రహణం జరుగుతుంది. కానీ ఈ సమయంలో సూర్యకిరణాలు భూమి వాతావరణాన్ని దాటి చంద్రుని చేరుకున్నప్పుడు, నీలి కాంతి ఫిల్టర్ అవుతుంది, ఎర్రటి కాంతి మాత్రమే చంద్రుడిపై ప్రతిబింబిస్తుంది. అందుకే చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దీనినే ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. గతం–భవిష్యత్తు బ్లడ్ మూన్‌లు.. చరిత్ర చెబుతున్నట్లు.. గతంలో హైదరాబాద్‌లో 2018 జూలై 27న ఒక విశేషమైన బ్లడ్ మూన్ కనిపించింది. అది 21వ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘమైన చంద్ర గ్రహణంగా రికార్డయ్యింది. 2022లో కూడా కనిపించిన ఈ బ్లడ్ మూన్ ఈ ఏడాది మార్చిలోనూ కనువిందు చేసింది. 2026లో మరో బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది. ఈ విధంగా తరచూ కాకపోయినా, కొన్ని ఏళ్లకోసారి మాత్రమే ఈ అపూర్వ క్షణాలు మన కళ్లముందు మెరుస్తాయి.హైదరాబాద్ ప్రత్యేకత.. హైదరాబాద్ ఆకాశం నుండి చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించడం ఈ సారి ప్రత్యేకత. నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో, గోల్కొండ కోట ప్రాంగణంలో, షామీర్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో చాలా మంది ఫొటోగ్రాఫర్లు, సెలనోఫైల్స్ టెలిస్కోపులతో గ్రహణాన్ని ఆస్వాదించారు. టెర్రస్ పార్టీల రూపంలో కూడా బ్లడ్ మూన్ నైట్ జరుపుకున్నవారు ఉన్నారు. చంద్రుడి అందాన్ని ఆస్వాదించే వారికి ‘సెలనోఫైల్స్’ అని పేరు. ఈ తరం యువతలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఇది ‘అంతరిక్షంతో కనెక్ట్ అవుతున్నామనే ఫీలింగ్ ఇస్తుంది’ అని పలువురు యువత భావించారు. (చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!) -
చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది? సూతక కాలం అంటే..
భాద్రపద పౌర్ణమి, ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం(Chandra Grahan) ఏర్పడనుంది. గతంలో ఒకటి రెండు గ్రహణాలు వచ్చినా అవి మన దేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం మన దేశంలో లేదు. ఈ ఆదివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది. గ్రహణ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలనే దానిపై పండితులు చెప్పిన వాటిలో ముఖ్యాంశాలు. ఆదివారం,7న రాత్రి 9:58 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది. దీని మొత్తం వ్యవధి దాదాపు మూడున్నర గంటలు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం.సూతక కాలం అంటే ఏమిటి? ఆ సమయంలో ఏం చేయాలి?హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడటానికి ముందు కొంత సమయం నుంచి, గ్రహణ సమయంతో పాటు, గ్రహణం తరువాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే ఆదివారం మధ్యాహ్నం 12.57 నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు, పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తరువాత తలుపులు తెరిచి యథావిధిగా పూజలు చేస్తారు. రాహుకేతు పూజలు జరిగే ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటాయిపాటించాల్సిన నియమాలు ఏంటంటే...గ్రహణం రోజున సూతక కాలం ఆరంభం అయినప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు. ఆరోగ్యం సరిగా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేక΄ోతే ΄ాలు, పండ్ల రసం వంటివి తీసుకుంటారు. అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం.గ్రహణం సమయంలో శుభకార్యాలు, పూజలు, దేవాలయ దర్శనాలు చేయరు. వీలైనంత వరకు భగవన్నామ స్మరణ, ధ్యానం మంచిది. .దానాలు శ్రేష్టంచంద్ర గ్రహణం ముగిసిన తర్వాత సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహణ సమయంలోనూ, ఆ తర్వాతా చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శక్తిమేరకు బట్టలు, ఆహారం, ధాన్యం, డబ్బు దానం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నమ్మకం. అలాగే గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం, బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. ఈ ఆదివారం రానున్న చంద్ర గ్రహణం రోజు మనం కూడా పెద్దలు, శాస్త్రాలు చెప్పిన పరిహారాలు పాటించడం శ్రేయస్కరం. దైవారాధన ఎలా?గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని నిత్యపూజ చేసుకోవాలి. (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు) -
ప్రపంచవ్యాప్తంగా కనువిందుచేసిన చంద్రగ్రహణం (ఫొటోలు)
-
Lunar Eclipse 2022: దేశవ్యాప్తంగా వీడిన చంద్రగ్రహణం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం వీడింది. కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, మరికొన్ని నగరాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5:40 నిమిషాల నుంచి చంద్రగ్రహణం కనిపించింది. మొత్తంగా 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమై సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. దేశవ్యాప్తంగా గ్రహణ సమయం ముగియడంతో మూతపడిన ఆలయాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నాయి. మళ్లీ మార్చి 14, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇక ఇదిలా ఉంటే, ఒడిశాలో మాత్రం గ్రహణం ఉద్రిక్తతలకు దారితీసింది. హేతువాదులు, భజరంగ్‌దళ్ కార్యకర్తల మధ్య రగడ జరిగింది. చంద్రగ్రహణం రోజున చికెన్ బిర్యానీ ఫెస్టివల్ నిర్వహించడంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
చంద్ర గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావమెంతంటే..
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటాన్నే చంద్ర గ్రహణం అంటారు. ఈరోజు(నవంబరు8వ తేదీ) చంద్ర గ్రహణం ఏర్పడటంతో ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తి కనబరిచే వారు కొందరైతే.. గ్రహణం కాబట్టి దాని ప్రభావం లేకుండా జాగ్రత్త పడేవారు మరి కొందరు. ఏది ఏమైనా ఈ గ్రహణం ఏ సమయంలో సంభవించనుంది, ఏయే దేశాల్లో కనిపించనుందో చూద్దాం. ఈ రోజు ఏర్పడే చంద్ర గ్రహణం ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, భారత్, ఫసిఫిక్, అట్లాంటిక్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం సంభవించనుండగా, అందులో సంపూర్ణ చంద్ర గ్రహణం 3.46 నుంచి సాయంత్రం 5.12 గంటల వరకు ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తే ఈ గ్రహణం ప్రక్రియ పూర్తవడానికి మొత్తం 3 గంటల 40 నిమిషాలు పట్టనుంది. భారత్‌లో చంద్ర గ్రహణం ఏర్పడే సమయం పగటి పూట కావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉండదు. కాగా, భారత్‌లో ఇటానగర్, గుహవాటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం చూసే అవకాశం ఉండగా, కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీ నగర్, ముంబై వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది. సాధారణంగా పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే అవకాశాలు ఉండవు. ఎందుకంటే పౌర్ణమి సందర్భంగా సూర్యుడు, భూమి, చంద్రుడు కచ్చితంగా ఒకే సరళ రేఖపైకి రావని నిపుణులు చెబుతున్నారు. భూమి కక్ష్య, చంద్రుని కక్ష్య పరస్పరం 5 డిగ్రీల కోణంలో వంగి ఉండడమే అందుకు కారణమని వారు విశ్లేషిస్తున్నారు. -
‘తొలి’ చంద్రగ్రహణం నేడే
కోల్‌కతా: ప్రస్తుత ఏడాదిలో ఆరు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో నాలుగు చంద్రగ్రహణాలు కాగా.. మరో రెండు సూర్య గ్రహణాలు. ఇక ఈ ఏడాదిలో మొట్టమొదట ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం కానుంది. జనవరి 10వ తేదీ రాత్రి 10.37 గంటలకు ప్రారంభమై జనవరి 11వ తేదీ తెల్లవారుజాము 2.42 గంటల వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగనున్నట్లు ఎంపీ బిర్లా ప్లానెటోరియమ్ బుధవారం తెలిపింది. జూన్ 5, జూలై 5, నవంబర్ 30 తేదీల్లో మరో మూడు చంద్రగ్రహణాలు సంభవించనున్నాయి. -
కనువిందు చేసిన చంద్రగ్రహణం
-
నేడు సంపూర్ణ సుదీర్ఘ చంద్రగ్రహణం
-
ఆకాశంలో అద్భతం
-
గ్రహణం ఎఫెక్ట్:శ్రీవారి ఆలయం మూసివేత
-
నేడు సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం
-
కడపకు చంద్ర గ్రహణం
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ కక్షతో కడప జిల్లా దశాబ్దాల త రబడి నిర్లక్ష్యానికి గురైంది. రాయలసీమ ప్రాంతవాసులే ముఖ్యమంత్రులుగా ఉన్నా అన్ని విధా లా వెనుకబడింది. మూడు దశాబ్దాలుగా వివక్షకు గురైన జిల్లాకు మరోమారు ‘చంద్ర’గ్రహణం పట్టింది. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన మౌ లిక సదుపాయాలు అం దుబాటులో ఉన్నా విస్మరిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అభివృద్ధి ఫలాలు దక్కుతాయనే కనీస స్పృహ లేకపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ జిల్లాను అప్రాధాన్యత జాబితాలో చేర్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెనుకబడిన కడప జిల్లా ‘దశ-దిశ’ 2004-2009 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మారింది. జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా పయనించింది. కేజీ నుంచి పీజీ వరకూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వచ్చింది. కేంద్రీయ విద్యాలయం, హైదరాబాదు పబ్లిక్ స్కూలు, యోగివేమన యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ట్రిపుల్ ఐటీ, రాజీవ్‌గాంధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాల, దంత వైద్య కళాశాల, పశువైద్య విద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే దాల్మియా, భారతి సిమెంటు కర్మాగారాలు, పాలిమర్స్ పరిశ్రమలు వచ్చి చేరాయి. అదే విధంగా రహదారుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటివి ప్రత్యేక ప్రాధాన్యతతో చేపట్టారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి, అభివృద్ధి ఫలాలు దక్కుతాయనుకున్న తరుణంలో అర్ధంతరంగా ప్రాజెక్టులు ఆగిపోయాయి. స్వల్ప మొత్తం ఖర్చు పెడితే అభివృద్ధి కళ్లెదుట కన్పించనుంది. అలాంటి పథకాలు సైతం దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కలెక్టరేట్ కాంప్లెక్స్, అంతర్జాతీయ పశుపరిశోనా కేంద్రం నిలుస్తున్నాయి. మెగా పరిశ్రమల కోసమే.. ఉపాధి మార్గాలు చూపడం ద్వారా ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్‌ను కూకటి వేళ్లతో పెకలించవచ్చని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ భావించారు. అందులో భాగంగా కడప సమీపంలో చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు మండలాల పరిధిలోని ప్రభుత్వ, డీకేటీ భూములను ఏపీఐసీసీ ద్వారా సేకరించి పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ మేరకు కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ పరిధిలో 6464.5 ఎకరాలు భూ సేకరణ చేశారు. అందుకోసం సోమశిల వెనుక జలాల నుంచి నీటి వసతి కల్పనకు శ్రీకారం చుట్టారు. శరవేగంగా రూ.450 కోట్లతో నీటి వసతి ఏర్పాటుకు పనులు చేపట్టారు. అందులో రూ.150 కోట్ల మేర పనులు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో చేసిన పనులకు బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఆ పనులు నిలిపేశారు. కొన్ని కంపెనీలు ముందుకు వచ్చినా భరోసా కల్పించేవారు లేక వెనుతిరిగారు. భారత్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీ (బీడీఎల్) ఏర్పాటుకు ప్రతినిధుల బృందం కడప మెగా ఇండస్ట్రియల్ పార్కును సందర్శించి అనువైన ప్రదేశంగా గుర్తించారు. ఆ మేరకు 600 ఎకరాలు కేటాయించాలంటూ అభ్యర్థించా రు. విమానాల స్పేర్‌పార్ట్స్, రక్షణ విభాగాలు ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమ ప్రతి నిధులు ఏపీఐఐసీ ఎండీతో సైతం చర్చించారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రె డ్డి నుంచి సానుకూలత లేకపోవడంతో వెనుదిరిగారు. కడప లో నెలకొల్పాల్సిన ఆ పరి శ్రమ చిత్తూరు జిల్లా పలమనేరులో ఏర్పాటు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గారని సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం అన్ని జిల్లాల్లో అటు పారిశ్రామికంగానో, ఇటు వైద్యం, అత్యున్నత విద్య పరంగానో అభివృద్ధికి ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. అలాంటి జాబితాలో వైఎస్సార్ జిల్లాకు మాత్రం చోటు దక్కడం లేదని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల సమీక్షలోనైనా గుర్తింపు దక్కేనా... గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులతోపాటు, ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లుతో సమీక్ష నిర్వహించనున్నారు. అందులోనైనా జిల్లాకు ప్రాధాన్యత దక్కుతుందా అని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైఎస్సా ర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు, విద్యుత్ జనరేషన్ ప్లాం ట్ల నిర్మాణానికి ఆశావహులు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ప్రతిపాదనలు తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే తక్కువ ఖర్చుతో పూర్తి కాగల సాగునీటి ప్రాజెక్టుల వివరాలు రూపొందించినట్లు తెలుస్తోంది. తుది దశకు చేరిన విమానాశ్రయం, కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయని వివరించనున్నట్లు తెలిసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పట్ల ఏమేరకు దయచూపుతారో వేచి చూడాల్సిందే.