ద్వేషించిన దేవుణ్ణే ఆరాధిస్తున్నా! | Now, pujas to god after when i was hate of god | Sakshi
Sakshi News home page

ద్వేషించిన దేవుణ్ణే ఆరాధిస్తున్నా!

Published Sun, Sep 28 2014 1:43 AM | Last Updated on Sat, Jun 2 2018 6:00 PM

ద్వేషించిన దేవుణ్ణే ఆరాధిస్తున్నా! - Sakshi

ద్వేషించిన దేవుణ్ణే ఆరాధిస్తున్నా!

ఆంధ్రులు ఎక్కువగా ఉండే మోల్‌మిన్... బర్మా ఆంధ్రప్రదేశ్‌గా ప్రసిద్ధి. అక్కడ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. తెలుగువారు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగులోనే మాట్లాడుకుంటారు. వాళ్లలో మాంగ్‌తిన్ ఒకరు. తిరుమలేశునికీ ఆయనకూ ఉన్న అనుబంధం ఏమిటి?
 మీ పూర్వీకులు ఎక్కడివారు?
 మా తాత లండా సింహాచలం పూర్వం ఇక్కడి నుంచి బర్మాకు వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో మా తండ్రి లండా గంగరాజు వైజాగ్‌లో పుట్టారు. ఆయన కూడా తాతతోనే బర్మాలో స్థిరపడ్డారు. ఆయన అక్కడే పెళ్లి చేసుకున్నారు. మేము రంగూన్‌లోనే పుట్టాము. ఐదుగురం సంతానం. నా పేరు సుబ్రహ్మణ్యం (మాంగ్‌తిన్), నా భార్య కళావతి. మాకు చో చో తిన్, ప్యూప్యూ తిన్ ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చో చో తిన్‌కు తెలుగు సంప్రదాయంలోనే రంగూన్‌లో పెళ్లి చేశాను.
     తిరుమల గురించి ఎలా తెలుసు?
 మా తమ్ముడు భూ కైలాష్‌కు స్వామి అంటే ఎనలేని భక్తి. వాడు చెప్పిన మీదట 1999లో మొదటిసారిగా నేను, నా భార్య కళావతి, చెన్నయ్ నుంచి మరో ముగ్గురం వచ్చాం. ఎక్కడ చూసినా జనమే. గది దొరక లేదు. దర్శనానికీ టికెట్లు దొరకలేదు. దాంతో తిరిగి వెళ్లిపోదామని నిశ్చయించుకున్నా. ఇంతలోనే మాపై స్వామికి అనుగ్రహం కలిగినట్లుంది... అనుకోకుండానే కల్యాణం టికెట్టు దొరికింది. గది దొరికింది. ఒకేరోజు మూడు సార్లు దర్శనం లభించింది. అదంతా స్వామి లీలగానే అనుకున్నాం. సంతోషంగా తిరుగుప్రయాణం అయ్యాను. ఇక వీలుదొరికినపుడు కచ్చితంగా రావాలని నిశ్చయించుకున్నాం. ఆ ప్రకారం 15 ఏళ్లుగా వస్తున్నా. నా కుమార్తె పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన వారం రోజుల్లోపే తిరుమలకు వచ్చి స్వామికి కల్యాణం జరిపించాను. స్వామి మొక్కులు పెండింగ్ లేకుండా జాగ్రత్త పడుతుంటాను. అప్పుడే నా మనసు కూడా హాయిగా ఉంటుంది.
     శ్రీవారిని నమ్ముకున్న మీకు ఎలాంటి కష్టాలు తొలగాయి?
 స్వామిని నమ్ముకుని ఎన్నో వ్యాపారాలు ప్రారంభించాను. పైకొచ్చాను. మళ్లీ దివాలా తీసాను. స్వామికి చెప్పుకునేందుకు ఫైల్స్‌తోనే కొండెక్కాను. నా వద్ద ప్రాణం తప్ప మరేమీ లేదని ఏడుస్తూ వేడుకున్నాను. తిరిగి బర్మా వెళ్లాను. తర్వాత వెనక్కు తిరిగి చూడలేదు. స్వామి దయతో చల్లగా ఉన్నాను. అందుకే స్వామిపేరుతో ఆసుపత్రి, గోశాల, కిడ్నీ ఫౌండేషన్ వంటి కార్యక్రమాలు చేయాలని సంకల్పించాను. ఊపిరి ఉన్నంత వరకు ఆ స్వామిని దర్శించుకుంటూనే ఉంటాను. ఆ స్వామికి వినమ్రుడిగా ఉంటాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement