
'తెలుగు ప్రజల గుండె రాక్షస బొగ్గులా మండుతోంది'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు ప్రజల గుండె రాక్షస బొగ్గులా మండుతోందని భూమన అన్నారు. ప్రధానమంత్రే స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదన్నారు. భూమన బీజేపీ ఎట్టి పరిస్థితిలో పోరాడకూడదన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం అవసరమా అని ప్రశ్నించారు. సీఎంగా ఉండటానికి చంద్రబాబు అనర్హుడని భూమన ధ్వజమెత్తారు. ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో కొనసాగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను పక్కన పెట్టిన టీడీపీ జీవచ్చవంలా మారిందన్నారు.