సాక్షి,తిరుపతి:కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తామని చెప్పి మోసం చేసిందని, చంద్రబాబు మొదటి నుంచి రైతు వ్యతిరేకి అని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.‘అన్నదాతకు అండగా’ పేరుతో ఈ నెల 13 నుంచి వైఎస్సార్‌సీపీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాల పోస్టర్‌ను భూమన మంగళవారం(డిసెంబర్10) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం చేస్తామని,వరికి మద్దతు ధర ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలయినా రైతులను పట్టించుకోక పోవడం దారుణం.20 ఏళ్ల క్రితమే చంద్రబాబు రైతు వ్యతిరేకి, ఉచిత కరెంటు ఇస్తామని ఆనాడు వైఎస్సార్ చెబితే హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు.రూ.86 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని 2014లో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.
రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఈనెల 13న తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముందు నేతలు ఆర్కే రోజా, అభినయ్,మోహిత్,రాజేష్,మధుసుధన్‌రెడ్డితో కలిసి నేను నిరసనలో పాల్గొంటా. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పూతలపట్టు పార్టీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ సునీల్,విజయానందారెడ్డి కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. విద్యుత్ చార్జీలు పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిరసన కార్యక్రమాలు చేపడతాం. డిస్కంల ఎదుట ఆందోళన చేస్తాం’అని భూమన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment