సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు భద్రత కరువైందని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో రోజుకో అఘాయిత్యం వెలుగులోకి వస్తున్నాయన్నారు. మెటర్నిటి ఆసుపత్రి బాధితురాలిని పరామర్శించేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదన్నారు.
కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులు నడిపిన పల్సర్ వాహనంపై పవన్ కళ్యాణ్ స్టిక్కర్ ఉంది. దీనిపై కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలి. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ద్వారా ఏరులై పారుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోండి. ప్రతిపక్షాల పార్టీలు పై విమర్శలు చేయడం మానుకోండి. శాంతి భద్రతలు కాపాడండి’’ అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు.
ఇదీ చదవండి: మరో బాలికపై అఘాయిత్యం!
కాగా, తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై హత్యాచార ఘటనను మరువకముందే.. సోమవారం మరో బాలికపై దారుణం జరిగిందిన సంగతి తెలిసిందే. గాయాల పాలై ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో మూలుగుతున్న బాలికను గుర్తించిన తండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక సమీపంలోని జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది.
Comments
Please login to add a commentAdd a comment