తిరుమల: జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఆ రాష్ట్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ గురువారం నిర్ణయం తీసుకుంది. సదరు స్థలాన్ని 40 ఏళ్లపాటు టీటీడీకి లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, యాత్రికుల కోసం వసతి సముదాయాలు, పార్కింగ్ వసతులను ఏర్పాటు చేయనుంది. జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు, మూడు స్థలాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, గతంలో ఈవోగా ఉన్న అనిల్‌కుమార్ సింఘాల్ పరిశీలించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment