Jammu and Kashmir government
-
జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు
తిరుమల: జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఆ రాష్ట్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ గురువారం నిర్ణయం తీసుకుంది. సదరు స్థలాన్ని 40 ఏళ్లపాటు టీటీడీకి లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, యాత్రికుల కోసం వసతి సముదాయాలు, పార్కింగ్ వసతులను ఏర్పాటు చేయనుంది. జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు, మూడు స్థలాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, గతంలో ఈవోగా ఉన్న అనిల్‌కుమార్ సింఘాల్ పరిశీలించిన విషయం తెలిసిందే. -
అమర్నాథ్ యాత్ర : లాటరీ పద్దతిలో భక్తుల ఎంపిక
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం తీపికబురు అందించింది. యాత్రా ప్రణాళికను సిద్దం చేసిన ప్రభుత్వం కొన్ని నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతీ ఏడాది లక్షలాది మంది తరలివచ్చే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ ఒకటి. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా యాత్రకు బ్రేక్ పడుతుందేమో అన్న సందేహాల నడుమ భక్తులకు శుభవార్త అందించింది. అమర్నాథ్ యాత్ర జులై 21న మొదలుకొని 15 రోజుల్లో తీర్థయాత్ర ముగియనుంది. సాధారణంగా అయితే 45 రోజుల వరకు యాత్ర కొనసాగేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రోజుల వరకు భక్తులను అనుమతించడం ద్వారా మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రణాళికలో మార్పులు చేసింది. అంతేకాకుండా బాల్తాల్ మార్గంలోనే యాత్రకు అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈసారి కేవలం నాలుగువేల నుంచి ఐదు వేల మంది యాత్రికులకు మాత్రమే అనుతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. (2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్ ) సాధారణంగా అయితే బాల్తాల్ సహా పహల్గామ్ మార్గాల్లో అమర్నాథ్ యాత్ర కొనసాగేది. కానీ కోవిడ్ దృష్ట్యా పహల్గామ్ దారిని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తీర్థయాత్ర సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు బసీర్ అహ్మద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని తాజా ప్రకటనలో పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో సహజంగా ఏర్పడిన మంచు-లింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఏటా దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. లక్షలసంఖ్యలో ప్రతీ ఏటా జులై చివరివారంలో 45 రోజులపాటు తీర్థయాత్ర కొనసాగుతుంది. అయితే గత ఏడాది ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో భద్రతా సమస్యల దృష్ట్యా యాత్రను మధ్యలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా షెడ్యూల్లో కేవలం 15 రోజులకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (24 గంటల్లో 9887 కేసులు.. 294 మరణాలు ) -
'పెల్లెట్ గన్స్కు చట్టంలో చోటు లేదు'
న్యూఢిల్లీ: ప్రపంచ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ జమ్మూకశ్మీర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రంలో ఆందోళన కారులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించడం మానుకోవాలని సూచించింది. వీటి వల్ల వందలమంది అంధులు మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 'పెల్లెట్ గన్స్ ఉపయోగించడం ఒక రకంగా బయటకు కనిపించని వివక్షలాంటిదే. అలాంటి వాటికి ఏ చట్టాల్లోను చోటు లేదు' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా సీనియర్ ప్రచారకర్త జహూర్ వాని అన్నారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చే పేరిట పెల్లెట్ గన్స్ ఉపయోగించవద్దని మేం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని చెప్పారు. -
వాట్సాప్ గ్రూప్ పెట్టాలంటే.. లైసెన్స్ తీసుకోవాలి!
శ్రీనగర్: వాట్సాప్‌లో గానీ, ఫేస్బుక్లో గానీ యూజర్లు ఎవరైనా ఉచితంగా గ్రూప్ ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ, స్థానిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని.. వాట్సాప్ గ్రూపులపై ఉక్కుపాదం మోపాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది. వాట్సాప్‌లో ఒక గ్రూప్‌ను నడిపించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, లైసెన్స్ లాంటి ధ్రువపత్రం సంబంధిత అధికారుల నుంచి పొందాలని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో యూజర్ల ప్రైవసీని వాట్సాప్ కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ముప్తి మెహబూబా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో అల్లర్లకు ఆజ్యం పోస్తున్న సోషల్ మీడియా వేదికలపై ఉక్కుపాదం మోపాలని తాజాగా నిర్ణయించింది. దీంతో వాట్సాప్‌లో గ్రూప్ ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్న నిబంధన కలిగిన తొలి ప్రాంతం ప్రపంచంలో ఇదే కావొచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది. 'సోషల్ మీడియా న్యూస్ ఏజెన్సీస్ నిర్వాహకులందరూ తమ గ్రూప్‌లలో వార్తలు పోస్టు చేసేందుకు సబంధిత జిల్లా డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని డివిజనల్ కమిషనర్ గురువారం ఆదేశాలు ఇచ్చారు' అని ప్రభుత్వ ప్రకటన ఒకటి మంగళవారం వెల్లడించింది. కశ్మీర్లో ఏ చిన్న అలజడి జరిగినా రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హంద్వారాలో కాల్పుల నేపథ్యంలో మూడురోజుల పాటు రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తాజాగా వాట్సాప్ గ్రూపులపై కూడా ఆంక్షలు విధించడంపై కశ్మీర్ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతా అత్యాధునిక సాంకేతికతతో ముందుకుసాగుతుంటే.. సోషల్ మీడియా వినియోగం విషయంలోనూ తమపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. -
63 మంది అధికారుల 'బలవంతపు' పదవీవిరమణ
శ్రీనగర్: అవినీతి ఊబిలో కూరుకుపోయిన అధికారులపై జమ్ముకశ్మీర్ సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తోన్న 63 మంది అధికారులు తక్షణమే స్వచ్ఛంద పదవీవిరమణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రికిరాత్రే ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ పేరుతో సదరు అధికారులకు లేఖలు పంపారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని రూపుమాపేందుకు కొద్ది నెలలుగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగానే అధికారుల తొలిగింపు ప్రక్రియకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గత మార్చి నెలలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ కందాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అవినీతి ప్రక్షాళన కమిటీ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగులపై చర్యలకు దిగింది. -
ఎన్సీ మద్దతు తీసుకోం: పీడీపీ
శ్రీనగర్: కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుకోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మద్దతు తీసుకోవాలనుకోవడం లేదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) పేర్కొంది. జమ్మూ, కశ్మీర్ ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారని పీడీపీ ప్రతినిధి నయీమ్ అక్తర్ బుధవారం మీడియాతో అన్నారు. కేవలం 15 సీట్లుమాత్రమే ఉన్న ఆ పార్టీకి, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించే అధికారం లేదని ఆయన పేర్కొన్నారు. పీడీపీకి మద్దతు ఇస్తామని, అంతేకాక తమ పార్టీని సంప్రదించకుండా ప్రభుత్వం ఏర్పాటుకోసం ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోరుతూ నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర గవర్నర్‌కు లేఖరాయడాన్ని అక్తర్ తప్పుబట్టారు. కేవలం అధికారంకోసమే ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమ పార్టీ లక్ష్యం కాదని, రాష్ట్రంలో శాంతి, సుస్థిరతల స్థాపనే తమ ఎజెండా అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకోసం బీజేపీతో జరుగుతున్న చర్చల గురించి ప్రస్తావించగా, అనధికార చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు వారాలు అయినా ఈ రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుపై ఒక అవగాహనకు రాలేకపోయాయి. దాంతో పాలన బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించారు. బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తామన్నాం: ఎన్సీ ప్రభుత్వం ఏర్పాటులో పీడీపీకి తాము కేవలం బయటినుంచి మాత్రమే మద్దతు ఇస్తామన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ పేర్కొంది. పీడీపీలా తమకు అధికార దాహం లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి అలీ మహమ్మద్ ఓ ప్రకటన చేశారు. తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, ఆదర్శాలు ఉన్నాయని పేర్కొన్నారు.