ప్రపంచ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ జమ్మూకశ్మీర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: ప్రపంచ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ జమ్మూకశ్మీర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రంలో ఆందోళన కారులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించడం మానుకోవాలని సూచించింది. వీటి వల్ల వందలమంది అంధులు మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
'పెల్లెట్ గన్స్ ఉపయోగించడం ఒక రకంగా బయటకు కనిపించని వివక్షలాంటిదే. అలాంటి వాటికి ఏ చట్టాల్లోను చోటు లేదు' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా సీనియర్ ప్రచారకర్త జహూర్ వాని అన్నారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చే పేరిట పెల్లెట్ గన్స్ ఉపయోగించవద్దని మేం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని చెప్పారు.