
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ సహ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి కరకట్టపై వున్న ఇంటిని ఖాళీ చేయిస్తే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేపట్టాల్సిన భాధ్యత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉందన్నారు. విచారణ చేసి చంద్రబాబు అవినీతిపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు అవినీతి రుజువైతే రెండు సంవత్సరాల్లోనే ఆయన జైలుకెళ్తారని జోస్యం చెప్పారు. బీజేపీలో చేరేందుకు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. (చదవండి: టీడీపీ నుంచి బీజేపీలోకి అందుకే చేరికలు)
Comments
Please login to add a commentAdd a comment