మంచులో బుల్లి ఎల్సా డ్యాన్స్‌.. చూశారా.. | Texas 2 Year Old Girl Dress Up Like Elsa And Sing Song Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘అచ్చం.. ‘ప్రాజెన్‌’ ఎల్సాను దింపేసింది’

Feb 8 2020 1:01 PM | Updated on Feb 8 2020 2:15 PM

Texas 2 Year Old Girl Dress Up Like Elsa And Sing Song Video Goes Viral - Sakshi

టెక్సాస్‌: సాధారణంగా చిన్నపిల్లలు అన్నం తినమని మారాం చేస్తే కార్టూన్ వీడియోలు చూపించి తినిపిస్తాము. ఇక వాటిని చూసి ఆకర్షితులైన పిల్లలు.. నచ్చిన కార్టూన్‌ పాత్రలను అనుకరిస్తూ ఉంటారు. అలాగే ఈ చిన్నారి కూడా. తనకు నచ్చిన ‘ఫ్రాజెన్‌’ కార్టూన్ సినిమాలోని లీడ్‌రోల్‌ పాత్ర ‘ఎల్సా’ లాంటి దుస్తులను ధరించి మంచులో పాట పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ.. అచ్చం  ‘ఎల్సా’లా మారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. టెక్సాస్‌కు చెందిన 2 ఏళ్ల చిన్నారి మాడెలిన్‌ ‘ఫ్రాజెన్‌’  సినిమాలోని యువరాణి ‘ఎల్సా’ ఫ్రాక్‌ను ధరించి.. ఆనందంగా మంచులో డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పాపపై ముద్దుల వర్షం కురిపిస్తూ.. వీడియో షేర్‌ చేసిన చిన్నారి తల్లికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇక ఈ వీడియోలో చిన్నారి అచ్చం ‘ఎల్సా’ లాంటి ఫ్రాక్‌, షూ, తలపై కీరిటం ధరించి డిస్నీలోని  ‘లెట్‌ ఇట్‌ గో’ పాటను ముద్దు ముద్దుగా పాడుతోంది. ఇక బుల్లి ఎల్సా వీడియోకు ఇప్పటి వరకు 30 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. పెరుగుతూనే ఉంది. ‘చూడ్డానికి చిన్న నటిలా ఉంది. వావ్‌! అచ్చం ఎల్సాలానే ఎంత ముద్దుగా ఉందో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ చిన్నారి తల్లి క్రిస్టీ మైకేల్‌ ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘మాడెలిన్‌ రోజూ ‘ఫ్రాజెన్‌’ చూస్తుంది. తనకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. అందులో యువరాణి ఎల్సా అంటే మరీ ఇష్టం. ఈ సినిమా చూస్తున్నంతసేపు సీన్‌లోని ప్రతి డైలాగ్‌ను ముందే చెప్తుంది’  అంటూ రాసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement