మంచు తీవ్రతకు గడ్డకట్టుకుపోయి ప్రాణాలు విడిచిన కుక్క, కుందేలు
కజకిస్థాన్, మధ్య ఆసియా : మధ్య ఆసియా దేశాలు చలికి గడ్డకట్టుకుపోతున్నాయి. ఆర్కిటిక్ ఖండం స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మధ్య ఆసియా దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కజకిస్థాన్‌లో మంచు తీవ్రతకు జంతువులు గడ్డ కట్టి ప్రాణాలు విడిచాయి. ఈ హృదయవిదారక దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
మంచుదిబ్బలో కూరుకుపోయి గడ్డకట్టి మరణించిన కుక్క
ఫెన్సింగ్‌ను దాటేందుకు ప్రయత్నించిన కుందేలు అందులో ఇరుక్కుపోయి చలి తీవ్రతకు గడ్డకట్టి మరణించింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన కుందేలును స్థానికులు ఫెన్సింగ్ నుంచి బయటకు తీశారు. అదే ప్రాంతంలో మంచు దిబ్బను దాటడానికి ప్రయత్నించిన శునకం కూడా దానిలో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచింది.
ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశం ‘ఓమియాకాన్’ సైబీరియాలోనే ఉంది. ఇక్కడ శీతాకాలపు ఉష్ణోగ్రత -67 డిగ్రీలకు పడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment