ప్రపంచం నలుమూలలా ఉన్న మానవ నాగరిక సమాజమంతటికి ఒక విషయం సర్వ సాధారణం : మత్తుపదార్ధం. కొన్ని పదార్ధాలు పవిత్రమైనవాటివిగా పరిగణింపబడతాయి, కానీ ఎక్కువ సార్లు, మనం కేవలం వేడుకలకో లేదా నిషా కోసమో తాగుతాం.
మత్తులో స్పృహ తప్పడం మానవుల హక్కేమి కాదు. చాలా జంతువులు మత్తులో తూగడానికి ఎంతో శ్రమకోడుస్తాయి. తమిళనాడులోని బానేట్ మాకాక్లు అడవిలో దాచే అక్రమ సారాయి పీపాలను కొల్లగొట్టేవయితే, కరీబియన్ వెర్వేట్ కోతులు క్రమం తప్పక తప్పతాగి తూగుతుంటాయి. ఆ దీవిలో ఏడాది పొడుగునా సెలవల సందడి ఉండడంతో అక్కడ మత్తు పానీయాలకు ఏమి కొదవలేదు.
పనికిమాలినట్టుగా అనిపించినా, వెర్వేట్ కోతుల తాగుడు అలవాట్లపై చేసిన ఒక శాస్త్రీయ అధ్యయనం, అవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తాయని చూపడం ఆశ్చర్యకరం. వాటిలో కొన్ని అతిగా తాగేవి ఉంటాయి - అవి త్వర త్వరగా, ఎక్కువ ఎక్కువ, తరచూ తాగుతుంటాయి. కొన్ని స్థిరంగా ఉండే తాగుబోతులు ఉంటాయి - అవి సరాసరి మద్యాన్ని సోడాగానీ, నీళ్లుగానీ కలపకుండా, క్రమం తప్పకుండా కొట్టేస్తాయి. కానీ చాలామటుకు కోతులు సామాజిక జీవనంలో భాగంగా తాగుతుంటాయి. అటువంటి కోతులు కాక్టైల్స్ ఇష్టపడతాయి. మరికొన్ని మద్యాన్ని అసలు తాకవు. అక్కడితో వాటికీ మనకీ పోలికలు ఆగవు. కొన్ని కోతులు తాగినప్పుడు నిషాలో బాగా మునిగిపోయి దూకుడుగా తయారవుతాయి, కొన్ని కఠినంగా దుర్భాషలాడతాయి, మరికొన్ని దిగాలుగా, ముభావంగా తయారవుతాయి. కానీ చాలామటుకు సంతోషంగా నిషాలో మునిగిపోతాయి…. బహుశా గులాబీ రంగు ఏనుగులను చూసిన భ్రమలో ఊగుతాయి.
మామూలు నలుపురంగు ఏనుగులు కూడా కాస్త మద్యం ఎక్కువైత ఒళ్లు మర్చిపోయేంతగా విజ్రుoభిస్తాయి. జార్ఖండ్లో ఆశియా ఏనుగులు పాకల లోపల కాగుతున్న మద్యాన్నిగైకొనడానికి పాకలని నాశనం చేస్తాయని విషయం తెలిసినది. కొన్ని ఏళ్ల క్రితం, ఒక మత్తెక్కిన ఏనుగులగుంపు ఊరుమీద విరుచుకుపడి, విద్యత్ స్థంభాలను పాడగొట్టి తిరిగితూ, ఆ ప్రక్రియలో అవే విద్యుత్ షాకు తగిలి కాలిపోయాయి.
పశ్చిమ దేశాలలో పిల్లులు పుదీనాలా ఉండే క్యాట్నిప్ అనే మొక్క మత్తులో మునిగిపోతాయి. పిల్లులు ఆ పుదీనా వంటి మొక్క కొమ్మల మీద పడి మూలుగుతూ, చోంగకారుస్తూ, మళ్ళీ మళ్ళీ దొర్లుతాయి. నేను కొంచం ఆ మొక్కను తెచ్చి ఇవ్వగానే, ముందెన్నడూ ఆ మొక్కని చూడని మా నాన్నగారి పిల్లి కూడా మతిపోయినట్టు ప్రవర్తించింది. కానీ కొద్ది నిముషాల తరవాత అది బాగా తేరుకుని మళ్ళీ హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏళ్ల తర్వాత అమెరికా జంతు ప్రదర్శనశాలను సందర్శించే సమయంలో, మేము ఒక కౌగర్ క్యాట్నిప్తో నింపివున్న మేజోడు పట్టుకుని వెర్రివేషాలు వేయడం చూశాము. అన్ని జాతుల పిల్లులూ ఈ క్యాట్నిప్కు ఆకార్షితమవుతాయని స్పష్టంగా తెలుస్తోంది.
రాకీ కొండలలో పెద్ద కొమ్ముల గొర్రెలు మత్తు కోసం, ఒక రకమైన బూజు గోకి తినడానికి, ఎంతో ప్రమాదకరమైన కొండ చరియలుఎక్కుతాయని తెలిసినది. మరి ఈమెన్లో మేకలైతే వారి కాపారులలాగే ఖట్ ఆకుల మత్తుకు బానిసలు.
ఎంతో అందంగా మిఠాయిలా కనిపించి, ఎర్ర టోపీలతో, పైన కాస్త పంచదార చల్లినట్టు ఉండీ, యాక్షినిల కథలలో కనిపించే బొమ్మల్లో అమ్మాయాకంగా కనిపించే పుట్టగొగుల పేరు ఫ్లై ఆగారికస్ పుట్టగొడుగులు. నన్ను తినకండి అని హెచ్చరించే రంగులో ఉన్నాకూడా రెయిన్ డీర్లు వాటిని తిని మత్తులో గెద్దలంత ఎత్తు ఎగురుతాయి. ఎన్నో మత్తు పదార్ధాలను రెయిన్ డీర్ మూత్ర పిండాలు వడగొట్టగలవు కనుక, వాటి మూత్రం పుట్టగొడుగులు తినటం కాంటే స్పష్టంగా ఎంతో శక్తివంతమైన మత్తు పదార్థం. మరి మత్తు కోసం ప్రాకులాడే యూరోప్ మారియు ఉత్తర ఆసియాలో గొర్రెకాపరులు చేసేది అదే!
ఎన్నో శాంతా క్లాస్ పుట్టుక కథలలో ఒకటైన కథ మనని సైబీరియా వైపుకు దారితీస్తుంది. ఒక సీతాకాలం మధ్యలో వచ్చే పండుగలో, ఒక నాటు వైద్యుడు, పోగాకమ్ముకున్న ఒక ముఖం ద్వారoగుండా ఫ్లై ఆగారిక్ నిండిన సంచీని మోస్తూ ఒక యూర్ట్ ( జూలుతో చేయబడ్డ గుండ్రటి డేరా) లోపలకి ప్రవేశిస్తాడు. ప్రజలు ఈ గొడుగుల నిషాలో పడ్డ వేళ, వారి ముఖము - ముఖ్యంగా వారి బుగ్గలు, ముక్కు, ఎర్రగా మారతాయి. శాంతా, అతని ఎర్ర ముక్కు రెయిన్ డీర్ రుడోల్ఫ్, ఆకాశంలో దీనిపై ఎగురుతున్నారన్న అంచనా వేసినందుకు ఏమి బహుమతులు లేవు!
శతాబ్దాలా నుంచీ సమాజం ఈ పదార్ధాలను భయంకరమైన చెడుతో కూడిన వాటిగా పరిగణించి బహిష్కరించడానికి ప్రయత్నించింది. అయినా వాటిలో మునిగి తెలడం మన ఆచ్చారాలలో ఎంత బలంగా నాటుకుందో, అది అంతే బలంగా మన జన్యువులో కూడా నాటుకుని ఉండి ఉంటుంది. పిల్లలు కూడా ఆ అనుభూతి పొందడానికి కళ్ళుతిరిగి, కాలపై నిలబడడానికి తడబడేదాకా పదే పదే గుండ్రంగా తిరిగితారు. దెర్విషలు (సన్యాసులు) కూడా మనకుకి అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి ఇటువంటి పద్దతే వాడతారు. పార్స్వ ఆలోచన అనే భావాన్ని పెంపొందించిన ఎడ్వర్డ్ డి బోనో ప్రస్తావన ఇక్కడే వస్తుంది. అతను మత్తుపదార్థాలు మనని పోతపోసిన ఆలోచనా విధానాలనుంచి బయటకులాగి, ఎంతో సృజనత్మాకంగా ఆలోచింపచేయగలదని అతను సూచించాడు. అదే గనక నిజమైతే, మనసుని మార్చేటువంటి ఈ మత్తు అనుభూతులతో, ఖచ్చితంగా ఈ పాటికి ప్రపంచంలో ఎన్నో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మారియు ప్రయత్నలు చూసుండేవాళ్ళం.
రచన : జానకి లెనిన్
ఫోటోలు: సిద్దార్థ్ రావు
Comments
Please login to add a commentAdd a comment