ఘనీభవించి కూరగాయలు కంటే ఫ్రెష్‌గా ఉన్న కూరగాయలే బెటర్ అనేది చాలామంది భావన. అప్పటికప్పుడు దొరికిన వాటిల్లోనే మంచి పోషకాలు ఉన్నాయనుకుంటాం. కానీ ఇది కరెక్ట్ కాదని చెబుతున్నారు నిపుణులు. ఘనీభవించిన ఫ్రోజెన్ కూరగాయల్లోనే ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఇదేంటీ తాజా కూరగాయాల కంటే ఫ్రోజెన్ కూరగాయలే మంచివా? అదెలా అనుకుంటున్నారా..?. కానీ నిపుణులు మాత్రం శీతలీకరణం చేసిన కూరగాయల్లో పోషకాల నష్టం జరిగేందుకు ఆస్కారం ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. అందుకు గల కారణాలను కూడా సవివరంగా వెల్లడించారు.
నిపుణులు అభిప్రాయం ప్రకారం..స్టోర్‌లో శీతలీకరణం చేసిన బఠానీలు, బ్రోకలీ, బీన్స్, క్యారెట్లు,మొక్కజొన్నలు కూరగాయలు మనం తాజాగా అమ్మకందారుడి నుంచి కొన్నంత ఆరోగ్యకరమైనవని, వాటిలో విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయి. పరిశోధన ప్రకారం దాదాపు పదిమందిలో ఒక్కశాతం మంది మాత్రమే తగినంత పండ్లు కూరగాయలను తింటున్నారట.
కాబట్టి చాలామంది పోషకాహార నిపుణులు ఏ రూపంలోనైనా ఎక్కువ ఉత్పత్తులను తినాలని సిఫార్సు చేస్తున్నారు. ముందుగా కత్తిరించిన కూరగాయల్లో ఎక్కువ షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటాయి. తాజా వాటికంటే తక్కువ ధరను కలిగి ఉంటాయి. తాజా కూరగాయాలు చాలా దూరం ప్రయాణించి ఆయ ప్రాంతాలకు రవాణ అవ్వుతాయి. అందువల్ల తేలికగా వాడిపోవటం, ముఖ్యమైన పోషకాలు కోల్పోవటం జరుగుతుంది. అదే ఘనీభవించిన కూరగాయాలు అయితే పండించిన గంటల్లోనే ఫ్రీజర్‌లకు పంపబడతాయి.
ఫ్రోజెన్ కూరగాయలు ఎలా ఆరోగ్యకరం అంటే.
వీటిలో ఫైబర్, పొటాషియం,విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరాన్ని గుండె జబ్బులు, కేన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.
అలాగే వీటిని తాజాదనం కోల్పోకమునుపే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు
ఘనీభవంచిన కూరగాయలు గరిష్ట పరిపక్వత వద్ద పండించడం, శుభ్రం చేయడం పోషక నాణ్యత కోల్పోకుండా చేస్తారు. ఈ క్రమంలో కూరగాయలపై ఉండే బ్యాక్టీరియా నాశనం అవువుతుంది. ముఖ్యంగా ఈప్రాసెస్‌లో పోషకాలను రాజీ చెయ్యదు. ఘనీభవించిన కూరగాయల్లో విటమిన్ సీ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
వాస్తవానికి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో రంగులు, స్వీటెనర్లు కారణంగా ఆరోగ్యానకి మంచిదికాదు. అయితే అది కూరగాయాల విషయంలో కాదని చెబుతున్నారు.
అలాగే ఈ క్రమంలో ఫైబర్ కోల్పోతున్నాయా..? కాయగూరలు అనే విషయం గమనించి మరీ ఘనీభవించేలా స్టోర్ చెయ్యాలి.
అంతేగాదు రిఫ్రిజిరేటర్లో కూరగాయాలను ఎలా నిల్వ చేస్తున్నారు అనేది కూడా ముఖ్యం.
సరైన ఉష్ణోగ్రతల వద్ద కూలింగ్‌లో కూరగాయలు నిల్వ ఉంటున్నాయో లేదో కూడా గమనించాలి.
ముఖ్యంగా ఘనీభవించిన కూరగాయలని స్థిరమైన సున్నా డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నిల్వ చేయాలనుకుంటే సుమారు 18 నుంచి 12 నెలల పాటు చెడిపోకుండా ఫ్రిజర్‌లో ఉత్తమంగా ఉండేలా చూడండి.
(చదవండి: మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!)
Comments
Please login to add a commentAdd a comment