శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాంసంతో పోలిస్తే.. వెజిటేరియన్ ఫుడ్ త్వరగా జీర్ణం అవుతుంది. అదీగాక మాంసం వినియోగం పెరిగేకొద్దీ వనరుల వాడకం ఎక్కువవుతుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు వెజిటేరియన్లుగా మారిపోతున్నారు. పైగా ఈ శాకాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కూడా. మన దేశంలో దాదాపు 40 శాతం మందికి పైగా శాఖాహారులే. అయితే మన దేశంలో కొన్ని నగరాల్లో మాంసాహారం ఇష్టమైనా సరే తినడం సాధ్యం కాదు. పైగా ఈ నగరాలను భారత దేశ పూర్తి శాకాహార నగరాలుగా పిలుస్తారు. ఆ నగరాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!
రిషికేశ్, ఉత్తరాఖండ్: రిషికేశ్ గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర నగరం. మనశ్శాంతి , మోక్షం కోసం చాలా మంది ప్రజలు ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన ఈ నగరానికి వస్తారు. నగరం చుట్టూ ముళ్ల చెట్లు , పచ్చని కొండలు ఉన్నాయి. దీన్ని దేవతల భూమిగా పిలుస్తారు. ఇక్కడ మాంసం పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఆధ్యాత్మిక శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ శాకాహారం మాత్రమే దొరుకుతుంది.
వారణాసి, ఉత్తరప్రదేశ్: పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న పురాతన నగరం వారణాసి. ఈ నగరాన్ని బనారస్ లేదా కాశీ అని కూడా అంటారు. ఇది శివుని నివాసం. ఎందుకంటే ఈ నగరాన్ని సాక్షాత్తు శివుడే నిర్మించాడని నమ్ముతారు. ఇక్కడ మీరు అన్ని రకాల రుచికరమైన,స్వచ్ఛమైన శాఖాహారం తినవచ్చు.
హరిద్వార్, ఉత్తరాఖండ్: పవిత్ర గంగానది ఒడ్డున హరిద్వార్ ఒక ప్రకాశవంతమైన నగరం. ఈ నగరం భారతదేశంలోని పవిత్ర నగరాలలో ఒకటిగా అలరారుతుంది. ఇక్కడ
వేయించిన ఆహారం నుంచి సలాడ్లు , సూప్‌ల వరకు అన్ని రకాల శాకాహారాలను ఇక్కడ ప్రయత్నించవచ్చు.
మదురై, తమిళనాడు: తమిళనాడు నడిబొడ్డున ఉన్న ఈ నగరాన్ని రాష్ట్రానికి గుండెకాయ అని కూడా అంటారు. ఈ నగరం పూర్తిగా శాఖాహారం. కానీ ఈ నగరం భారతదేశపు నిజమైన సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. అత్యంత రుచికరమైన, పోషక విలువలు కలిగిన శాకాహార వంటకాలు ఇక్కడ లభిస్తాయి.
అయోధ్య, ఉత్తరప్రదేశ్ : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కూడా మాంసం దొరకడం లేదు. అయోధ్య పురి మొత్తం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ ఒక్క మాంసాహార రెస్టారెంట్ కూడా లేదు.
పలిటానా, గుజరాత్: ఈ నగరం (గుజరాత్ భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా) కూడా పూర్తిగా శాకాహామే.. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తొలి శాకాహార నగరంగా పేరుగాంచింది. కనుక ఇది శాకాహారులకు స్వర్గధామం. ఎందుకంటే ఈ ప్రదేశంలో నివసించే చాలా మంది జైనులను కఠినమైన శాకాహారులుగా పిలుస్తారు. కాబట్టి ఈ నగరంలో శాకాహారం మాత్రమే వడ్డిస్తారు.
బృందావన్, ఉత్తరప్రదేశ్: ఇది మథుర జిల్లాలోని ఒక చారిత్రక నగరం.ఇది మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశం. నగరం పవిత్రత కారణంగా, ఇక్కడ గుడ్లు , మాంసం అమ్మకాలు నిషేధం.
తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి నగరం కొండపై ఉన్న తిరుమలలలో కూడా మాంసాహారం పూర్తిగా నిషేధం. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ మాంసాహారం పూర్తిగా నిషేధం.
(చదవండి: 60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment