వృధాప్యం అనేది సర్వసాధారణం. వయసు గడిచేకొద్ది ఎవ్వరైనా ఈ స్టేజ్‌కి రావాల్సిందే. అందుకోసం మార్కెట్లో లభించే వేల ఖరీదు చేసే కాస్మెటిక్స్‌కి డబ్బులు తగలేస్తుంటారు. పలు వర్కౌట్లని, డైట్‌లని నానాతంటాలు పడుతుంటారు. అయితే అవేమీ లేకుండానే, ఎలాంటి కష్టం లేకుండా తన తల్లి 60లలో కూడా యంగ్‌గా కనిపిస్తోందని చెబుతున్నాడు డిజిటల్ క్రియేటర్. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో కూడా షేర్ చేసుకున్నాడు. అదెంటో చూద్దామా..
వృద్ధాప్యాన్ని ఆపడం అంత ఈజీకాదు కానీ నియంత్రించొచ్చు. అది కూడా సహజమైన వాటితోనే చెయ్యొచ్చట. వయసు రీత్యా చర్మం పలు మార్పులకు లోనవ్వుతుంది. ఆ మార్పులను నియంత్రించగలిగితే నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతుందట. అందుకు నిద ర్శనం తన తల్లేనని డిజి టల్ క్రియేటర్ రోహిత్ బోస్ చెబుతున్నాడు. ఆమె 64 ఏళ్ల వయసులో కూడా యంగ్‌గా ఉంటుందని, అలా అని బోటాక్స్ ట్రీట్‌మెంట్, జిమ్ వంటి వర్కౌట్‌లు ఏమి చెయ్యదని చెబుతున్నాడు. అందుకోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి తీసుకోదని కూడా తెలిపారు. అయినా ఇంతలా ఆమె అందంగా కనిపించడానికి ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్సేనని చెప్పుకొచ్చారు. అవేంటంటే..
బొప్పాయి: విటమిన్లు ఏ, సీ, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ముఖంపై గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది.
అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండిన అవిసె గింజలు చర్మాన్ని ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకతకు మద్దతునిస్తాయి. దీంతో చర్మం బొద్దుగా, మృదువుగా ఉంచుతాయి.
గుమ్మడి గింజలు: జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న గుమ్మడికాయ గింజలు కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి, పైగా వృద్ధాప్యంతో పోరాడుతాయి.
కొబ్బరి నీరు: ఈ సహజ హైడ్రేటర్ సైటోకినిన్‌లతో నిండి ఉంటుంది. ఇది కణాల పెరుగుదల, వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని తాజాగా హైడ్రేట్‌గా ఉంచుతుంది.
అల్లం: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం చర్మపు రంగును సమంగా ఉంచడంలో సహాయపడటమే గాక వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.
పసుపు: పసుపులోని కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యగా ముడతలు తగ్గించి,యవ్వనపు ఛాయను ప్రోత్సహిస్తుంది.
వైద్యులు సైతం ఇలాంటి ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. బొప్పాయి చర్మానికి, ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అవిసెగింజలు చర్మాన్ని కోమలంగా ఉంచడంలోనూ, జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు. ఈ ఆహారాలు స్కిన్ టోన్‌ని మంచిగా ఉంచినప్పటికీ వ్యాయామాలు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.
(చదవండి: పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్‌లు..ఒక్కో జీన్స్‌కి ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment