మన ఉపయోగించే బట్టల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని తెలుసా..!. ఏటా వేల బట్టలు చెత్త కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వాటిని కాల్చడం వల్ల మరింత కాలుష్యం ఏర్పడుతుంది. అవి మట్టిలో కలిసిపోయేందుకు చాలా టైం పడుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం పర్యావరణవేత్తలు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు కూడా. ముఖ్యంగా జీన్స్ లాంటి దుస్తులు అంతతేలిగ్గా మట్టిలో కలిసిపోవు. పైగా దీని తయారీ కోసం ఎన్ని నీళ్లు ఖర్చుఅవుతాయో వింటే షాకవ్వుతారు. అలాంటి పాత జీన్స్ రీసైకిల్ చేసి ఉపయోగపడేలా చక్కగా రూపాందిస్తున్నాడు 16 ఏళ్ల యువకుడు. అంతేగాదు పర్యావరణ సంరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తూ అందిరిచేత శెభాష్ అని ప్రశంలందుకుంటున్నాడు. అతనెవరంటే..
ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల నిర్వాన్ సోమనీ మన ఇంట్లో ఉండే దుస్తులు, వాటికి ఉపయోగించే రంగులు వల్ల ఎంత కాలుష్యం ఏర్పడతుందో తెలుసుకున్నాడు. అదీగాక ఏటా ఈ దుస్తులు వ్యర్థాలు ఎంతలా కుప్పలుగా పేరుకుపోతున్నాయో గమనించాడు. పర్యావరణ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అలా అతడి దృష్టి జీన్స్ దుస్తులపై పడింది. అప్పుడే.. ఒక్కో జీన్స్ తయారీకి ఏకంగా పదివేల లీటర్లు అవుతుందని, తెలుసుకుని షాక్ అవ్వుతాడు.
ఐదు జతల జీన్స్‌కి ఏకంగా 50 వేల లీటర్ల అవుతాయా అని విస్తుపోయాడు. అంత నీటిని ఖర్చు చేస్తున్న ఈ జీన్స్‌లు సౌకర్యవంతంగా వినియోగించేలా రీ సైకిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే ప్రాజెక్ట్ జీన్స్ పేరుతో స్లీపింగ్ బ్యాగ్‌లు తయారు చేయడం ప్రారంభించాడు. కొన్ని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు సహాయంతో నిర్వాణ్ వేల జతలు జీన్స్‌లు సేకరించాడు నిర్వాన్. వాటితో దాదాపు 900 స్లీపింగ్ బ్యాగ్‌లను రూపొందించాడు.
అవి ఎవరికీ ఇస్తారంటే..
ఢిల్లీలో చలికాలంలో రోడ్లపై నిద్రించే నిరాశ్రయులకు స్లిపింగ్ బ్యాగ్‌లు అందిస్తున్నాడు నిర్వాన్. సాధారణంగా మనం వారికి దుప్పట్లు ఇస్తుంటాం. అయితే అది పరిష్కారం కాదు. అవి కొంతకాలం తర్వాత చిరిగిపోతాయి. నిద్రపోయేలా పరుచుకుని పడుకోవడం కుదరదు కూడా. దీంతో ఈవిషయమై లోతుగా ఆలోచించి మరీ ఇలా స్లీపింగ్ బ్యాగ్‌లు రూపొందించాడు. అవి బెడ్ మాదిరిగా ఉండి..దాని లోపల పడుకోవచ్చు. ఎలా అంటే.. పడుకునే బెడ్ కమ్ దుప్పటిగా ఉంటుంది. ఇది వారికి సౌకర్యవంతంగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. మిగతా దుస్తులు కంటే జీన్స్ చాలా దృఢంగా ఉంటుంది. అంత ఈజీగా చీరగదు కాబట్టి నిరాశ్రయులకు, అభాగ్యులకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు నిర్వాన్.
తనకు ఈ ఆలోచన రావడానికి కారణం వాళ్లమ్మ దుస్తుల దుకాణమేనని చెబుతున్నాడు. అక్కడ చాలా మెటీరియల్‌లు కుట్టగా చాలా దుస్తుల వేస్టేజ్ వస్తుంది. వాటిలో కొంత మేర ఏదో రకంగా ఉపయోగిస్తాం. మిగతా చాలా వరకు వేస్ట్ అయ్యేది. దాన్ని ఉపయోగిస్తూ ఏదైనా చేయగలనా అనుకున్నాను అలా ఈ స్లీపింగ్ బ్యాగ్‌లు తయారు చేసినట్లు వివరించాడు. గతేడాది టర్కీలో భూకంపం వచ్చి నిరాశ్రయులుగా మారిన ప్రజల కోసం దాదాపు 400 స్లీపింగ్ బ్యాగ్‌లను అందజేశాడు నిర్వాన్. మన అలమార్లో వృధాగా పడి ఉన్న జీన్స్‌ని అతడి కంపెనీకి అందజేస్తే మన వంతుగా పర్యావరణ సంరక్షణలో బాధ్యత తీసుకున్నట్లే అవుతుంది. ఈ పర్యావరణ కోసం అందరూ ఇలాంటి పలు కార్యక్రమాలు చేసి మన పుడమతల్లిని కాలుష్యం కోరల నుంచి కాపాడుకుందాం!.
(చదవండి: ఆరు తరాలు, 185 మంది సభ్యులు..ఇప్పటికి ఒకే ఇంటిలో..)
Comments
Please login to add a commentAdd a comment