ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఉమ్మడి కుటుంబాలన్న మాటే కరువయ్యిపోయింది. ఒకవేళ ఉన్నా..మహా అయితే ఓ మూడు తరాలు కలిసి ఉంటారు. వాళ్ల పిల్లల జనరేషన్ వద్దకు వచ్చేటప్పటికీ మళ్లీ వేర్వురుగా కాపురాలు పెంటడం మాములే. కానీ అలా గాక ఏళ్ల నుంచి..అదికూడా ఏకంగా ఆరు తరాలు ఇప్పటికీ కలిసి ఒకే ఇంటిలో నివశించి, ఉమ్మడి కుటుంబంలోనే ఉంది అసలైన ఆనందం అని ప్రూవ్ చేసి చూపిస్తోంది రాజస్తాన్‌లోని ఓ కుంటుంబం.
రాజస్తాన్‌లో బాగ్దీ కుటుబంలో ఏకంగా 185 మంది ఉన్న సభ్యులు చక్కగా ఐక్యంగా ఉంటూ నేటి చిన్న కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వాళ్లింట్లో జరిగే ప్రతి పండుగ, కార్యక్రమాన్ని అందరం కలిసి జరుపుకుంటామని చెబుతున్నారు. వీళ్లంతా రాజస్తాన్‌లోని అజ్మీర్ నుంచి సుమారు 36 కిలో మీటర్లు దూరంలో నసిరాబాద్ సమీపంలోని రామ్‌సర్ గ్రామంలో జీవిస్తున్నారు. కుటుంబానికి తగ్గట్టుగా వంటగది పెద్దదిగా ఉంటుంది. ఆ వంటగదిలో ఏకంగా 13 స్టౌవ్‌లు మండుతుంటాయని, ఇందులో చపాతీలు, 15 కిలోల కూరగాయలు, 50 కిలోల పిండిని ఉపయోగిస్తారట.
ఇంటిలోని ఆడబిడ్డలంతా కుటుంబం మొత్తానికి వంట చేస్తారు. అంతేగాదు రేషన్ కోసం ఏకంగా రూ. 12 లక్షలు వరకు ఖర్చు చేస్తారట. ఈ ఉమ్మడి కుటుంబంలో 65 మంది పురుషులు, 60 మంది మహిళలు, 60 మంది చిన్నారులతో కలిపి ఆరు తరాలు కలిసి జీవిస్తున్నారు. ఈ బాగ్దీ కుటుంబానికి అధిపతి సుల్తాన్ మాలి, అతనికి ఆరుగురు కుమారులు. మోహన్ లాల్, రామచంద్ర భన్వర్ లాల్, ఛగన్ లాల్, చోటూ లాల్, బిర్డిచంద్. అయితే సుల్తాన్ మాలీ, అతని ఇద్దరు కుమారులు భన్వర్ లాల్, రామచంద్ర చనిపోయారు. తన తండ్రి ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండటం నేర్పించాడని, అందువల్ల తాము ఇప్పటికీ ఆ మార్గాన్ని అనుసరిస్తామని బర్హిచంద్ చెబుతున్నారు. ఎప్పుడైనా ఏదైనా వివాదం తలెత్తితే పెద్దలంతా కలిసి కూర్చొని పరిష్కరించుకుంటామని చెబుతోంది ఆ కుటుంబం.
తమ కుటుంబసభ్యులకు ప్రేమగా, ఐక్యంగా ఎలా మసులుకోవాలో తెలుసని చెబుతున్నారు. ఇక ఆ కుటుంబంలో కొందరూ ప్రభుత్వ, ప్రైవేటే ఉద్యోగాల్లో పనిచేస్తుండగా, మరికొందరూ వ్యవసాయం, పశుపోషణ, భవన నిర్మాణ సామాగ్రి దుకాణం, ట్రాక్టర్లు నడపడం ద్వారా సంపాదిస్తారు. పిల్లలు, వృద్ధులు,చిన్నవాళ్లు కలిసి భోజనం చేస్తారు, ఆ తర్వాత మిగతావాళ్లు భోంచేస్తామని అంటున్నారు. ఇక తమలోని ఒక కోడలు 2016లో గ్రామానికి సర్పంచ్ అయ్యి రోడ్లు, డ్రైయిన్లు అభివృద్ధి చేయడం, విద్యుత్ సరఫరా కోసం కృషి చేసినట్లు తెలిపారు.
అంతేగాదు గత నెలలో అజ్మీర్‌లో సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ఈ ఇంటికి రావడంతో ఈ కుటుంబం ఒక్కసారిగా వెలుగులోకివచ్చింది. ఈ ఉమ్మడి కుటుంబంలోని ప్రేమ, అప్యాయతకు వారు ఉబ్బితబ్బిబ్బైపోయారు. పైగా ఈ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు సారా అలీఖాన్. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవ్వుతున్న టైంలో ఈ కుటుంబం ఇలా ఉమ్మడిగా, ఐక్యమత్యంగా ఉండటం నిజంగా చాలా గ్రేట్ కదూ.
*सुपरजंबो जॉइंट फैमिली !!!!!*🤘🔥🔥
1. 185 सदस्य
2. 700 बीघा खेती
3. 12 कार
4. 80 टू व्हीलर
5. 11 ट्रैक्टर
6. 10 बच्चे हर साल जन्म
7. हर रोज b'day
8. अनलिमिटेड आनंद
9. अनलिमिटेड सम्पन्नता pic.twitter.com/svuBp8HbgO— VISHAL SINGH (@Vishalk09340276) June 19, 2024
(చదవండి: ఐఐటీ హైదరాబాద్ ఘనత..త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో బ్రిడ్జ్ తయారీ..!)
Comments
Please login to add a commentAdd a comment