
ఈ చిత్రాలు చూడండి. పై చిత్రంలో కొండలు కనబడట్లేదు కానీ కింది చిత్రంలో మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ ఆహ్లాదంగా, చూడముచ్చటగా ఉందనిపిస్తోంది కదా. చూడముచ్చట పక్కనబెడితే మున్ముందు అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి ఇవి.
పై చిత్రాన్ని దాదాపు 100 ఏళ్ల కిందట ఆర్కిటిక్‌లో తీశారు. అప్పుడు కొండలు కనబడనంతగా మంచు పేరుకుపోయి ఉంది. కానీ ఇప్పుడు ఆ మంచు ఆనవాళ్లు కూడా లేవు. కొన్నేళ్లుగా పెరుగుతున్న భూతాపం వల్లే ఈ మంచంతా మాయమైపోయింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోందని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. (చదవండి: స్పెషల్ బ్రిడ్జిలు.. ఇవి మనుషుల కోసం కాదండోయ్..)
Comments
Please login to add a commentAdd a comment