మంచు ఖండంలో మొక్కలు
వాషింగ్టన్: వాతావరణ మార్పుల వల్ల మంచు ఖండమైన ఆర్కిటిక్‌లో మొక్కలు పెరుగుతున్నట్లు నాసా పరిశోధనలో తేలింది. ల్యాండ్‌శాట్ ఉపగ్రహాల నుంచి సేకరించిన 87 వేల ఫోటోలను పరిశీలించి ఆర్కిటిక్‌లో మూడో వంతు పచ్చదనంతో నిండి ఉందని పరిశోధకులు తెలిపారు. ఆర్కిటిక్‌లోని పశ్చిమ అలాస్కా, క్యూబెక్‌ల్లో 1984-2012 మధ్య ఎక్కువ మొక్కలు పెరిగాయన్నారు.
ఆర్కిటిక్ వద్ద ఉష్ణోగ్రతలు ప్రపంచంలోని ఏ ఇతర ప్రదేశంతో పోల్చినా వేగంగా పెరుగుతున్నాయి. ఇందువల్లే అక్కడ మొక్కలు పెరుగుతున్నాయి. ఇక్కడ మొక్కలు పెరిగితే ఆ ప్రభావం సముద్ర నీటి మట్టం, కర్బన చక్రాలపై పడుతుంది.