అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నాసా సంచలన విజయం సాధించింది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ తొలిసారిగా సూర్యుడి వాతావరణాన్ని ముద్దాడింది. సోలార్ మిషన్‌లో భాగంగా తొలి ఘట్టాన్ని నాసా ద్విగ్విజయంగా పూర్తి చేసింది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఒక ప్రధాన మైలురాయి దాటిందని డిసెంబర్ 14న న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన 2021 అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ఫాల్ మీటింగ్‌లో విలేకరుల సమావేశంలో తెలిపింది. పార్కర్ సోలార్ ప్రోబ్ అందించిన ఫలితాలను ఫిజికల్ రివ్యూ లెటర్స్‌లో నాసా ప్రచురించింది.
చదవండి: రష్యా మిస్సైల్ పరీక్షలతో ప్రపంచానికి పెనుముప్పు
తొలి అడుగు విజయవంతం..!
సోలార్ ప్లేర్, మాగ్నెటిక్ ఫీల్డ్ చేంజెస్ లాంటి దృగ్విషయాలను, సూర్యుడి వాతావరణాలను శోధించడానికి నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ ను 2018లో ప్రయోగించింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఈ ప్రోబ్ సూర్యుని వెలుపలి వాతావరణం కరోనాలో ప్రవేశించింది. ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన కొన్ని నమూనాలను సేకరించి నాసాకు పంపింది. సూర్యుని వాతావరణంలోని ధూళి కణాలను సేకరించడంలో పార్కర్ ప్రోబ్ ప్రధాన పాత్ర పోషించింది.ఈ మిషన్‌లో భాగంగా వాహక నౌక ఈ ఏడాది సూర్యుడికి అత్యంత దగ్గరగా సుమారు 8.13 మిలియన్ మైళ్ల దూరానికి నౌక చేరుకుంది. డిసెంబర్ 2021 నాటికి 4.89 మిలియన్ మైళ్ల సూర్యుడి వాతావరణంలోకి పార్కర్ సోలార్ ప్రోబ్ చేరగా...2025 నాటికి సూర్యుడి నుంచి 3.83 మిలియన్ మైళ్ల దూరంకు చేరి చివరి ఘట్టాన్ని పూర్తి చేయనుంది.
భగభగ మండే వాతావరణంలోకి ఎలా చేరిందంటే..!
సూర్యుడి వాతావరణాన్ని తట్టుకునేలా పార్కర్ సోలార్ ప్రోబ్ నౌకను నాసా తయారుచేసింది. ప్రోబ్‌లో హీట్ షీల్డ్ నాసా శాస్త్రవేత్తలు అమర్చారు. 4.5-అంగుళాల మందంతో ఉండే కార్బన్-మిశ్రిత ఉష్ణ కవచం 1,377 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోనే కెపాసిటీ పార్కర్‌కు ఉంది. సూర్యుడి నుంచి దాదాపు 3.83 మిలియన్ మైళ్ల దూరం వరకు వెళ్లే విధంగా పార్కర్ ప్రోబ్‌ను నాసా డిజైన్ చేసింది.
పార్కర్ సోలార్ ప్రోబ్ గుర్తించిన విషయాలు..!
సూర్యుడి వాతావరణానికి సంబంధించిన అనేక విషయాలను పార్కర్ సోలార్ ప్రోబ్ వెల్లడించింది. ఈ ప్రోబ్ ముఖ్యంగా సోలార్ స్విచ్‌బ్యాక్‌లను గమనించింది. అదేవిధంగా భూమిపై పవర్ గ్రిడ్స్, రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే సోలార్ ఫ్లేర్స్ అధ్యయనం చేయడం కోసం శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడింది.
చదవండి: కోట్లు మింగేసిన టెలిస్కోప్! విశ్వం పుట్టుక.. గుట్టు వీడేనా?
Comments
Please login to add a commentAdd a comment