Parker Solar Probe
-
భగభగమండే సూర్యుడి వాతావరణాన్ని చూశారా..! అందులో ఎన్నో అద్బుతాలు..!
Parker Solar Probe: Jaw Dropping Footage from the First Spacecraft to Touch the Sun: నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ తొలిసారిగా సూర్యుడి వాతావరణాన్ని ముద్దాడిన విషయం తెలిసిందే. సోలార్ మిషన్‌లో భాగంగా తొలి ఘట్టాన్ని నాసా ద్విగ్విజయంగా ప్రయోగించింది. సూర్యుని వెలుపలి వాతావరణం కరోనాలోకి పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రవేశించింది. సూర్యుడి వాతావరణంలోకి వెళ్లిన అద్భుతమైన క్షణాలను పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు చేసింది. ఈ వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది. వీడియోలో ఎన్నో అద్భుతాలు..! సూర్యుడి నుంచి 4.89 మిలియన్ కిలోమీటర్ల వాతావరణంలోకి ప్రవేశించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అద్భుతమైన క్షణాలను రికార్డు చేసింది. 13 సెకన్ల టైమ్ లాప్స్ వీడియోలో సూర్యుడి కరోనా లోపలి ఫోటోలను క్యాప్చర్ చేసింది పార్కర్. అందులో కరోనల్ స్ట్రీమర్స్ అని పిలిచే దృగ్విషయాన్ని ప్రోబ్ రికార్డు చేసింది. మునుపెన్నడూ లేని విధంగా సౌర వాతావరణంలోని అయస్కాంత క్షేత్రాలను గుర్తించిందని పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త నూర్ రౌవాఫీ వివరించారు. ఈ వీడియో శాస్త్రవేత్తలకు మాగ్నెటిక్ ఫీల్డ్ , సోలార్ విండ్ డేటాలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడనుంది. ఈ వీడియోలో పాలపుంతతో పాటుగా సౌర కుటుంబంలోని పలు గ్రహాలను పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు చేసింది. బుధ, గురు, శుక్ర, శని, అంగారక గ్రహాలతో పాటుగా భూమిని కూడా పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు చేసింది. రాబోయే సంవత్సరాల్లో సూర్యుని ఉపరితలానికి పార్కర్ సోలార్ ప్రోబ్ మరింత దగ్గరగా చేరుకోనుందని నాసా హెలియోఫిజిక్స్ విభాగం డైరెక్టర్ నిక్కీ ఫాక్స్ చెప్పారు. చదవండి: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాసా..! తొలిసారిగా సూర్యుడి వాతావరణంలోకి..!అదెలా సాధ్యమైందంటే..? -
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాసా..! తొలిసారిగా సూర్యుడి వాతావరణంలోకి..!అదెలా సాధ్యమైందంటే..?
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నాసా సంచలన విజయం సాధించింది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ తొలిసారిగా సూర్యుడి వాతావరణాన్ని ముద్దాడింది. సోలార్ మిషన్‌లో భాగంగా తొలి ఘట్టాన్ని నాసా ద్విగ్విజయంగా పూర్తి చేసింది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఒక ప్రధాన మైలురాయి దాటిందని డిసెంబర్ 14న న్యూ ఓర్లీన్స్లో జరిగిన 2021 అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ఫాల్ మీటింగ్‌లో విలేకరుల సమావేశంలో తెలిపింది. పార్కర్ సోలార్ ప్రోబ్ అందించిన ఫలితాలను ఫిజికల్ రివ్యూ లెటర్స్‌లో నాసా ప్రచురించింది. చదవండి: రష్యా మిస్సైల్ పరీక్షలతో ప్రపంచానికి పెనుముప్పు తొలి అడుగు విజయవంతం..! సోలార్ ప్లేర్, మాగ్నెటిక్ ఫీల్డ్ చేంజెస్ లాంటి దృగ్విషయాలను, సూర్యుడి వాతావరణాలను శోధించడానికి నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ ను 2018లో ప్రయోగించింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఈ ప్రోబ్ సూర్యుని వెలుపలి వాతావరణం కరోనాలో ప్రవేశించింది. ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన కొన్ని నమూనాలను సేకరించి నాసాకు పంపింది. సూర్యుని వాతావరణంలోని ధూళి కణాలను సేకరించడంలో పార్కర్ ప్రోబ్ ప్రధాన పాత్ర పోషించింది.ఈ మిషన్‌లో భాగంగా వాహక నౌక ఈ ఏడాది సూర్యుడికి అత్యంత దగ్గరగా సుమారు 8.13 మిలియన్ మైళ్ల దూరానికి నౌక చేరుకుంది. డిసెంబర్ 2021 నాటికి 4.89 మిలియన్ మైళ్ల సూర్యుడి వాతావరణంలోకి పార్కర్ సోలార్ ప్రోబ్ చేరగా...2025 నాటికి సూర్యుడి నుంచి 3.83 మిలియన్ మైళ్ల దూరంకు చేరి చివరి ఘట్టాన్ని పూర్తి చేయనుంది. భగభగ మండే వాతావరణంలోకి ఎలా చేరిందంటే..! సూర్యుడి వాతావరణాన్ని తట్టుకునేలా పార్కర్ సోలార్ ప్రోబ్ నౌకను నాసా తయారుచేసింది. ప్రోబ్‌లో హీట్ షీల్డ్ నాసా శాస్త్రవేత్తలు అమర్చారు. 4.5-అంగుళాల మందంతో ఉండే కార్బన్-మిశ్రిత ఉష్ణ కవచం 1,377 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోనే కెపాసిటీ పార్కర్‌కు ఉంది. సూర్యుడి నుంచి దాదాపు 3.83 మిలియన్ మైళ్ల దూరం వరకు వెళ్లే విధంగా పార్కర్ ప్రోబ్‌ను నాసా డిజైన్ చేసింది. పార్కర్ సోలార్ ప్రోబ్ గుర్తించిన విషయాలు..! సూర్యుడి వాతావరణానికి సంబంధించిన అనేక విషయాలను పార్కర్ సోలార్ ప్రోబ్ వెల్లడించింది. ఈ ప్రోబ్ ముఖ్యంగా సోలార్ స్విచ్బ్యాక్లను గమనించింది. అదేవిధంగా భూమిపై పవర్ గ్రిడ్స్, రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే సోలార్ ఫ్లేర్స్ అధ్యయనం చేయడం కోసం శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడింది. చదవండి: కోట్లు మింగేసిన టెలిస్కోప్! విశ్వం పుట్టుక.. గుట్టు వీడేనా?