బాలీవుడ్ నటి రిచా చద్దాకు ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనభవం ఎదురైంది. ఇటీవల ఆమె ముంబై వెళ్లేందుకు ఢిల్లీలో విమానాశ్రయానికి రాగా, బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని సెక్యూరిటీ అధికారులు ఆపేశారు. రెండు గంటలపాటు విచారణ జరిపిన తర్వాత గాని విడిచిపెట్టలేదు. ఇంతకీ ఆమె వద్ద వివాదాస్పదంగా ఉన్న వస్తువు ఏంటో తెలుసా.. ‘పౌడర్’.. అవునండీ.. మీరు చదివింది నిజమే.. రిచా బ్యాగ్‌లో ఉన్న పౌడర్‌పై విమానాశ్రయ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి అది ఆయుర్వేద పద్ధతిలో తయారుచేసిన అందాన్ని సంరక్షించే పౌడరు. రిచా గత ఆరు నెలలుగా తన సౌందర్య రక్షణ కోసం ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు.
దీనిలో భాగంగా ప్రత్యేకంగా తయారుచేసిన ఆయుర్వేద పౌడర్‌ను ప్రయాణ సమయంలో ఆమె నిత్యం తన వెంట తీసుకువెళతారు. అయితే ఈ సారి ప్రయాణంలో ఆ పౌడర్ ఈ అందాల బాలీవుడ్ నటికి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని రిచా ధ్రువీకరించింది.. ‘అవును.. నాకు ఆయుర్వేదంలో విపరీతమైన నమ్మకం. నా వెంట ఎప్పుడూ ఆయుర్వేద ఉత్పత్తులు ఉంటాయి. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆయుర్వేద పౌడర్‌ను చూసి అనుమానించిన అధికారులకు దాని గురించి పూర్తిగా వివరించాను. రెండు గంటలపాటు వారి అనుమానాలను నివృత్తి చేశాను. వారిపై నాకు ఎటువంటి కోపం లేదు.. వారి పనిని వారు సక్రమంగా నిర్వర్తించారు.. అందుకే వారికి పూర్తిగా సహకరించాను. అయితే అదృష్టం కొద్దీ నా విమానం మిస్ కాలేదు..’ అని ఆమె ముక్తాయించారు.
పౌడర్ తెచ్చిన తంటా..
Published Thu, Jun 19 2014 10:23 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement