
బెంగాలీ చిత్రంలో సుస్మిత
జాతీయ అవార్డు గ్రహీత సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’లో మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ నటించనుంది. ఈ చిత్రం షూటింగ్ కోసం నాలుగు రోజుల్లో కోల్‌కతా బయలుదేరనున్నట్లు ఆమె చెప్పింది.
బెంగాలీ భామ అయిన సుస్మితకు మాతృభాషలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. తమిళ, తెలుగు వంటి ఏ ఇతర భాషా చిత్రాల్లోనైనా బెరుకు లేకుండా నటించిన తనకు బెంగాలీ చిత్రాలంటే ఇదివరకు కాస్త బెరుకు ఉండేదని, ఇప్పుడు దాన్ని అధిగమించానని సుస్మితా చెబుతుండటం విశేషం.