దీపిక హర్ట్ అయిందా? | Deepika did you get hurt? | Sakshi
Sakshi News home page

దీపిక హర్ట్ అయిందా?

Published Fri, Apr 1 2016 11:10 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దీపిక హర్ట్ అయిందా? - Sakshi

దీపిక హర్ట్ అయిందా?

గాసిప్స్

 

ఈ ఏడాది జాతీయ అవార్డులు సాధించిన చిత్రాల మీద ఎంత మంది సంతృప్తిగా ఉన్నారో, అంతకుమించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్లూ ఉన్నారు. పలువురు దర్శకులు బాహాటంగానే ఈ అవార్డుల తీరును తప్పుబట్టారు కూడా. ఇక కథానాయికల్లో దీపికా పదుకొనే కూడా అవార్డుల నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్నారని బాలీవుడ్ టాక్. గత ఏడాది చేసిన సూపర్ హిట్ మూవీస్ ‘బాజీరావ్ మస్తానీ’, ‘పికు’ చిత్రాల ద్వారా ఆమె బాక్సాఫీస్ క్వీన్ అనిపించుకున్నారు. ఈ రెండు చిత్రాలు ఆ స్థాయిలో వసూళ్లు సాధించాయి.


ఈ ఏడాది జాతీయ అవార్డులను కూడా సాధించాయి. అయితే ఈ రెండు చిత్రాల్లో ఏదైనా ఒక చిత్రమైనా  తనకు కచ్చితంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చిపెడుతుందని దీపిక ఆశించారట. కానీ, ఆమెకు నిరుత్సాహమే ఎదురైంది. అవార్డు ప్రకటనల జాబితా విని, ఒక్కసారిగా హర్ట్ అయిపోయారట. అందుకే, ‘బాజీరావ్ మస్తానీ’ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇచ్చిన పార్టీకి కూడా హాజరు కాలేదని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement