ఆయిల్‌తో చర్మం కాంతివంతం
బ్యూటిప్స్
కొబ్బరి నూనె – అర కప్పు అలోవెరా ఆకు – సగం ఉల్లిపాయలు – రెండు ఉసిరిపొడి – రెండు టీ స్పూన్లు శీకాయ పొడి – రెండు టీ స్పూన్లు పాత్రలో కొబ్బరి నూనె సన్నని మంట మీద పెట్టాలి. దీంట్లో ఆమ్లా పౌడర్, శీకాకాయ్ పౌడర్ ఒకదాని తరవాత ఒకటి వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత కాగుతున్న నూనె మిశ్రమంలో ఆలోవెరా ఆకును చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.
మిశ్రమం మరుగుతుండగా ఉల్లిపాయ ముక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దింపేయాలి. నూనె మిశ్రమం చల్లారిన తరవాత బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. అవసరమయినప్పుడు ఈ మిశ్రమం బాడీకంతటికీ పట్టించాలి. 30 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే శరీరం కాంతివంతం అవుతుంది.
గమనిక: కొబ్బరినూనెకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, బాదం నూనెలను కూడా ఉపయోగించవచ్చు.